అబ్బే ఈయనుండగా ఈ దేశం ఎందుకు బాగుపడుతుంది?

అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడిపోతోంది. కరోనా మహమ్మారి ఈ దేశాన్ని వదిలిపెట్టేట్లు లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటమే ఇందుకు [more]

Update: 2020-04-17 16:30 GMT

అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడిపోతోంది. కరోనా మహమ్మారి ఈ దేశాన్ని వదిలిపెట్టేట్లు లేదు. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. దాదాపు ఆరున్నర లక్షల మందికి అమెరికాలో కరోనా వ్యాధి సోకింది. ఇప్పటికే 33 వేల మంది మృతి చెందారు. దీంతో అగ్రరాజ్యం ఏమి చేయలేని స్థితికి వెళ్లింది. దీంతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ లైట్ గా తీసుకుంటుండం ఆందోళన కల్గిస్తుంది. అమెరికాలో కరోనా వేగం తగ్గిందని ఆయన ప్రకటించడమే ఇందుకు నిదర్శనం.

ఇప్పటికీ లైట్ గానే…?

తొలి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనాను లైట్ గానే తీసుకున్నారు. అది తమను ఏమీ చేయలేదన్న ధీమాను అనేకసార్లు వ్యక్తం చేశారు. తీరా కరోనా వచ్చి మృత్యు ఘోష వినపడినత తర్వాత తొలుత చైనా మీద, తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం చేశారు డొనాల్డ్ ట్రంప్. చైనాకు వత్తాసు పలుకుతుందన్న నెపం మోపి ప్రపంచ బ్యాంకుకు నిధులను నిర్దాక్షిణ్యంగా డొనాల్డ్ ట్రంప్ నిలిపివేశారు. తన పిచ్చి చేష్టలతో అంతర్జాతీయంగా కూడా డొనాల్డ్ ట్రంప్ విమర్శలను ఎదుర్కొంటున్నారు.

గవర్నర్లు వర్సెస్ ట్రంప్….

ఇక గవర్నర్లకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మధ్య కూడా పొసగడం లేదు. అనేక రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ వైఖరిని వ్యతిరేకించారు. వీరిలో డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా ఉండటం విశేషం. న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అయితే ట్రంప్ ను ఒక నియంతగా అభివర్ణించారు. ట్రంప్ నిర్వాకం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. న్యూయార్క్ లో లాక్ డౌన్ ను గవర్నర్ వచ్చే నెల 15వ తేదీ వరకూ ప్రకటించారు. దీనికి ట్రంప్ అభ్యంతరం తెలిపినా లెక్క చేయలేదు. తానే సుప్రీం అన్నట్లు ట్రంప్ వ్యవహరిస్తున్నారని గవర్నర్లు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.

ఆరోగ్య నిఘా విభాగం హెచ్చరికలను….

ఇక ఇంటలిజెన్స్ హెచ్చరికలు కూడా డొనాల్డ్ ట్రంప్ కేర్ చేయలేదని అంతర్జాతీయ పత్రికలు చెబుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఇంటలిజెన్స్ హెచ్చరించినా పట్టించుకోలేదట. నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ ఇంటలిజెన్స్ సంస్థ వైరస్ తో అమెరికా చెలరేగిపోతుందని చెప్పినా ట్రంప్ చెవికెక్కించుకోలేదంటున్నారు. రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికీ కరోనా కంట్రోల్ లోనే ఉందని చెప్పడం తప్పుదోవపట్టించడమేనంటున్నారు. మొత్తం మీద అమెరికా ఈ దుస్థితికి కారణం ట్రంప్ వైఖరేనని అంతర్జాతీయ పత్రికలు చీల్చి చెండాడుతున్నాయి.

Tags:    

Similar News