డొక్కా జంప్ చేసింది అందుకేనట

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో? చెప్పలేం. ఈనాటి రాజకీయాలను అస్సలు ఊహించలేం. ఊపిరి ఉన్నంత వరకూ పార్టీ మారనని చెప్పే వాళ్లు సయితం తెల్లారేసరికి కండువా మార్చేస్తుండటం [more]

Update: 2020-03-10 03:30 GMT

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో? చెప్పలేం. ఈనాటి రాజకీయాలను అస్సలు ఊహించలేం. ఊపిరి ఉన్నంత వరకూ పార్టీ మారనని చెప్పే వాళ్లు సయితం తెల్లారేసరికి కండువా మార్చేస్తుండటం నేటి రాజకీయాల్లోనే చూస్తున్నాం. మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీ మారడం వెనక వ్యూహం ఏంటి? ఆయన టీడీపీని ఎందుకు వీడినట్లు? చంద్రబాబు మంచి ప్రయారిటీ ఇచ్చినా పసుపు కండువాను ఎందుకు తీసేసినట్లు ఇదే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.

రాయపాటి శిష్యుడిగా…..

డొక్కా మాణిక్యవరప్రసాద్ సీనియర్ నేత. గతంలో తాడికొండ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. రాయపాటి సాంబశివరావుకు అనుంగు శిష్యుడు. రాయపాటి ఎక్కడుంటే డొక్కా మాణిక్యవరప్రసాద్ అక్కడుంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాయపాటితో పాటు డొక్కా మాణిక్యవరప్రసాద్ కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.

ప్రాధాన్యత దక్కినా…..

డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీలో చేరగానే చంద్రబాబు మంచి ప్రాధాన్యత ఇచ్చారు. చేరిన వెంటనే ఆయనకు కనీస వేతనాల సంఘం ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ పోస్టు ఇచ్చారు. అదే సామాజికవర్గానికి చెందిన కీలక నేత వర్లరామయ్యను కాదని మరీ డొక్కామాణిక్యవరప్రసాద్ కు ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే ఆయన రాజధాని విభజన బిల్లులు శాసనమండలికి వచ్చే ముందు ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనమే అయింది. దీనిపై చంద్రబాబు కాని, టీడీపీ నేతలు కానీ పెద్ద విమర్శలకు కూడా దిగలేదు.

ఆ సీటు కోసమేనా?

అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీ మారడం వెనక వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే అంటున్నారు. తాడికొండ నియోజకవర్గంలో తనకు పట్టుంది. టీడీపీలో ఉంటే ఆ నియోజకవర్గం టిక్కెట్ దక్కే ఛాన్స్ లేదు. వైసీపీలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పనితీరుపై హైకమాండ్ కూడా సంతృప్తికరంగా లేదు. ఆమెపై ఇప్పటికే అనేక ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే డొక్కా మాణిక్యవరప్రసాద్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునిపార్టీ మారారంటున్నారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ నుంచి హామీ లభించిందని చెబుతున్నారు. ఫ్యూచర్ ను దృష్టిలో ఉంచుకునే డొక్కా జంప్ చేశారంటున్నారు.

Tags:    

Similar News