మత్తు దిగితే జగన్ దేవుడే ?

అదేంటో ఈ మధ్య అదోరకం రాజకీయానికి విశాఖపట్నం వేదిక అయింది. విశాఖ జిల్లా నర్శీపట్నం ఏరియా ఆసుపత్రిలో పనిచేసే మత్తు డాక్టర్ గత మూడు నెలలుగా జగన్ [more]

Update: 2020-06-12 09:30 GMT

అదేంటో ఈ మధ్య అదోరకం రాజకీయానికి విశాఖపట్నం వేదిక అయింది. విశాఖ జిల్లా నర్శీపట్నం ఏరియా ఆసుపత్రిలో పనిచేసే మత్తు డాక్టర్ గత మూడు నెలలుగా జగన్ సర్కార్ కి ఎంతలా తలనొప్పి తెచ్చిపెట్టాడో అందరికీ అర్ధం అయి ఉంటుంది. ఇక ఆయన ఈ మధ్య ఏ పొలిటీషియన్ కి లేనంత ఫాలోయింగ్ సంపాదించాడు. ఆయనకు దళిత కార్డుని తగిలించి రాజకీయం చేసింది తెలుగుదేశం పార్టీ, ఇక హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే తాజాగా మత్తు డాక్టర్ సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ ఆశ్చర్యకరంగా జగన్ ని దేవుడు అనేసారు.

వైఎస్సార్ అంటే ఇష్టం…..

జగన్ చాలా బాగా పాలిస్తున్నాడు, ఆయన తండ్రి వైఎస్సార్ అంటే తనకు చాలా ఇష్టమని కూడా మాట్లాడారు. అంతే కాదు తనకు ప్రభుత్వం మీద ఎందుకు ద్వేషం ఉంటుంది. తాను తన వైద్య వ్రుత్త్తి చేసుకుంటూ తాను గడుపుతున్నానని కూడా మాట్లాడారు. తన కుటుంబం ఇంకా స్థిరపడలేదని, తనను సస్పెండ్ చేశారని, తనకు ఆ ఉద్యోగం ఇస్తే తన మానాన తాను పనిచేసుకుంటానని కూడా చెప్పుకొచ్చారు. పదవీ విరమణ వయసు కూడా తనకు దగ్గరపడిందని, అందువల్ల మిగిలిన జీవితం ప్రశాంతంగా గడుపుతానని చాలా చక్కగా మాట్లాడారు.

రివర్స్ కేసుల మహిమా…?

ఒక ప్రభుత్వ డాక్టర్ అదీ కరోనా వేళ పవిత్రమైన విధి నిర్వహణలో ఉన్న వైద్యుడు మాట్లాడాల్సింది వైద్య పరిభాష. కానీ సుధాకార్ మరి గతంలో ఎందుకో అలా మాట్లాడారు. ఆయన నేరుగా జగన్ సర్కార్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ టీడీపీకి మద్దతు ఇచ్చేలా వ్యవహరించారు. ఇక ఆయన మే నెలలో విశాఖ నడిరోడ్డు మీద చేసిన రచ్చ ఒక ఎపిసోడ్. అప్పుడు కూడా ముఖ్యమంత్రి సీట్లో ఉన్న జగన్ని, మంత్రులను, ఎమ్మెల్యేలను అందరినీ తిట్టారని సీబీఐ విచారణలో బయటపడింది. ఆయన మీద కేసులు కట్టారు. దీంతో ఆయన రివర్స్ గేర్ వేశారా అన్న డౌట్లు వస్తున్నాయి.

దారుణమే ….?

రాజకీయాలు అంటే అంతేనేమో. వాటి ఉచ్చులో చిక్కుకుంటే ఇలాగే ఉంటుంది. డాక్టర్ సుధాకర్ తెలిసో తెలియకో ఇలా చేశారని కూడా అంటున్నారు. ఆయన మనసులో టీడీపీ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ రాజకీయ పార్టీ నేతల మాదిరిగా విమర్శలు చేయకూడదు కదా. నిజానికి ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎంతో మంది టీడీపీ మద్దతుదారులు ఉన్నారు. వారి ఇలా రెచ్చిపోయి రచ్చ చేయలేదుకదా. మొత్తానికి మత్తు డాక్టర్ సుధాకర్ కి తత్వం బోధపడిందా అన్న చర్చ సాగుతోంది. ఎవరైనా రాజకీయాల్లో ఉపయోగించుకున్నంతవరకే. ఎపుడైతే డాక్టర్ మీద కూడా కేసులు పడ్డాయో అపుడు విపక్షాలు కూడా ఆయనకు మద్దతుగా సౌండ్ చేయడం మానేశాయి. ఏది ఎలా ఉన్నా సుధాకర్ ఎపిసోడ్ ఏపీలో రాజకీయాల పరిస్థితిని తెలియచేస్తోంది. గడ్డి పరకనైనా అడ్డుపెట్తుకుని రాజకీయం చేద్దామనుకుంటున్న వారికి సుధాకర్ లాంటి వారు దూరంగా ఉండాలని కూడా నీతి చెబుతోంది.

Tags:    

Similar News