దిగిరాక తప్పదుగా.. చెక్ పెట్టాలనుకుంటే?

డీఎంకే అధినేత స్టాలిన్ కొంత దిగివచ్చినట్లే కన్పిస్తుంది. ఇన్నాళ్లూ కూటమి పార్టీలను పట్టించుకోని స్టాలిన్ కాంగ్రెస్ వ్యూహంతో కొంత వెనకడుగు వేయక తప్పేట్లు లేదు. డీఎంకే ఇప్పుడు [more]

Update: 2021-02-09 17:30 GMT

డీఎంకే అధినేత స్టాలిన్ కొంత దిగివచ్చినట్లే కన్పిస్తుంది. ఇన్నాళ్లూ కూటమి పార్టీలను పట్టించుకోని స్టాలిన్ కాంగ్రెస్ వ్యూహంతో కొంత వెనకడుగు వేయక తప్పేట్లు లేదు. డీఎంకే ఇప్పుడు తమిళనాడులో దూకుడు మీద ఉంది. గెలిచేది తామే అన్న ధీమాలో స్టాలిన్ ఉన్నారు. అందుకే ఈసారి డీఎంకే ఎక్కువ స్థానాల్లో పోటీ చేయాలని స్టాలిన్ భావిస్తున్నారు. కూటమిలోని పార్టీలను కట్టడి చేయాలని నిర్ణయించారు. స్థానాల పరంగానే చెక్ పెడితే ముందుగానే వీరికి కళ్లెం వేసినట్లవుతుందన్నది స్టాలిన్ అభిప్రాయం.

కాంగ్రెస్ వ్యూహంతో…..

అయితే స్టాలిన్ ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంది కాంగ్రెస్. ఇటీవల కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తరచూ తమిళనాడులో పర్యటిస్తున్నారు. క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. రాహుల్ సభలకు, సమావేశాలకు పెద్దయెత్తున ప్రజలు హాజరవుతున్నారు. అది మోడీపై ఆగ్రహంతో కావచ్చు. రాహుల్ గాంధీ అంటే సింపతీ కావచ్చు. మొత్తం మీద తమిళనాడులో కాంగ్రెస్ కు రాహుల్ పర్యటనలతో ఊపు వచ్చిందనే చెప్పవచ్చు. దీనిని స్టాలిన్ కూడా గమనించారు.

మిగిలిన పార్టీలతో…..

తమకు సీట్లు తక్కువ ఇస్తారని భావించిన కాంగ్రెస్ తృతీయ కూటమిని ఏర్పాటు చేయాలని భావించింది. తమతో కలసి వచ్చే పార్టీలలతో కలసి ముందుకు నడవాలని నిర్ణయించింది. దీనిపై ఫైనల్ గా నిర్ణయం తీసుకోకపోయినా డీఎంకే లో ఉన్న కూటమి పార్టీలతో కాంగ్రెస్ నేతలు ఈ మేరకు చర్చలు ప్రారంభించారు. కమల్ హాసన్ ను కూడా కలుపుకుని డీఎంకే, అన్నాడీఎంకే కూటములకు వ్యతిరేకంగా పోటీ చేయాలని భావిస్తుంది. ఇది డీఎంకే అధినేత కాంగ్రెస్ కు మింగుడు పడటంలేదు.

కబురు పంపిన కాంగ్రెస్….

అందుకే కాంగ్రెస్ ను దువ్వేందుకు స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ కు డీఎంకే 40 స్థానాలను కేటాయించింది. ఈసారి 20కి మించి ఇవ్వలేమని పరోక్షంగా సంకేతాలను పంపింది. అయితే కాంగ్రెస్ తాజా ఎత్తుగడతో స్టాలిన్ దిగివచ్చినట్లు తెలిసింది. ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు? ఏ నియోజకవర్గాల్లో బలం ఉంది? అన్న దానిపై జాబితాను పంపాలని స్టాలిన్ కాంగ్రెస్ నాయకత్వానికి కబురు పంపారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తమకు 40 స్థానాలు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు. స్టాలిన్ మాత్రం నేరుగా రాహుల్ తో సమావేశమై పరిస్థిితిని వివరించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News