డీకేను డమ్మీ చేయాలనేనా?

కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ను నియమించింది. డీకే శివకుమార్ పీసీపీ అధ్యక్ష్య బాద్యతలను చేపట్టి దాదాపు నెలన్నర కావస్తుంది. ఈలోగా కరోనా వైరస్ [more]

Update: 2020-05-10 17:30 GMT

కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ ను నియమించింది. డీకే శివకుమార్ పీసీపీ అధ్యక్ష్య బాద్యతలను చేపట్టి దాదాపు నెలన్నర కావస్తుంది. ఈలోగా కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో డీకే శివకుమార్ పెద్దగా పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టలేదు. అయితే పార్టీ సీనియర్ నేతలను కలసి మద్దతు కోరుతున్నారు. బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. కర్ణాటకలో పీసీసీ చీఫ్ పదవి అంటే మామూలు విషయం కాదు. ఆ తర్వాత స్టెప్ చీఫ్ మినిస్టర్ పోస్టు అన్నది కాంగ్రెస్ పార్టీలో వస్తున్న సంప్రదాయం.

పీసీసీ చీఫ్ పదవి కోసం….

అందుకే పీసీసీ చీఫ్ పదవి కోసం అనేక మంది పోటీ పడుతుంటారు. డీకే శివకుమార్ కు కూడా ఈ పదవి అంత తేలిగ్గా రాలేదు. అధిష్టానం వద్ద లాబీయింగ్ మామూలుగా చేయలేదు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు డీకేను పీసీసీ చీఫ్ గా నియమించడం అస్సలు ఇష్టం లేదు. అందుకే ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్ల అంశాన్ని సిద్ధరామయ్య తెరపైకి తెచ్చారు. అధిష్టానం కూడా సిద్ధరామయ్యను కాదని పీసీసీ చీఫ్ నియామకంలో సాహసం చేయలేకపోయింది.

హైకమాండ్ కు ఫిర్యాదులు….

డీకే శివకుమార్ పై ఈడీ కేసులున్నాయని కూడా ఆయన ప్రత్యర్థులు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అయినా ఎట్టకేలకు డీకే శివకుకమార్ నే పీసీసీ చీఫ్ పదవికి అధిష్టానం ఎంపిక చేసింది. అయితే గత కొద్ది రోజులుగా సిద్ధరామయ్య పైచేయి సాధించాలని చూస్తున్నారు. కరోనా సమయాన్ని తనకు అనుకూలంగా వినియోగించుకుంటున్నారు. శాసనసభ పక్ష నేత హోదాలో సిద్ధరామయ్య ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు.

సిద్ధరామయ్య సపరేట్ గా…..

ఇందుకోసం పీసీసీ చీఫ్ ను పక్కన పెట్టి సిద్ధరామయ్య శాసనసభ పక్ష నేత హోదాలో విపక్షాలతో సమావేశాన్ని నిర్వహించడం కాంగ్రెస్ లో చర్చనీయాంశమైంది. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ప్రకటించాలని, కరోనా సమయంలో కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని సిద్ధరామయ్య యడ్యూరప్ప పై యుద్ధం మొదలుపెట్టారు. ఈ సమావేశానికి జేడీఎస్, సీపీఐ, సీపీఎం, రైతు సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. డీకే శివకుమార్ ను డమ్మీ చేయడానికే సిద్ధరామయ్య ఈవిధంగా విపక్షాలతో కూటమి కట్టే ప్రయత్నం చేస్తున్నారన్న టాక్ కాంగ్రెస్ పార్టీలోనే విన్పిస్తుండటం విశేషం.

Tags:    

Similar News