లేకుండానే అంతా అయిపోతుందా?

ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ బయటకు రాకుండానే కర్ణాటకలో ఉప ఎన్నికలు ముగిసిపోయేటట్లున్నాయి. డీకే శివకుమార్ కోసం పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. గతంలో జరిగిన [more]

Update: 2019-10-03 16:30 GMT

ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ బయటకు రాకుండానే కర్ణాటకలో ఉప ఎన్నికలు ముగిసిపోయేటట్లున్నాయి. డీకే శివకుమార్ కోసం పార్టీ శ్రేణులు ఎంతగానో ఎదురు చూస్తున్నాయి. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో డీకే శివకుమార్ దగ్గరుండి మరీ పార్టీని గెలిపించారు. డీకే శివకుమార్ వ్యూహాలు రచించడంలో దిట్ట. సామాజిక వర్గాల వారీగా డీకే శివకుమార్ వేసుకున్న అంచనాలు ఎప్పుడూ తప్పు కాలేదు.

ఎక్కడ ఎన్నికలు జరిగినా….

ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ పార్టీ అక్కడకు పరిశీలకుడిగా పంపుతుంది. 2018 లో తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచార సరళి వరకూ ఆయన సిద్ధం చేస్తున్న రూట్ మ్యాప్ గతంలో కాంగ్రెస్ పార్టీకి విజయాలను సాధించిపెట్టాయి. అధిష్టానానికి నమ్మకంగా ఉంటున్న డీకే శివకుమార్ ప్రస్తుతం మనీల్యాండరింగ్ కేసులో జైలులో ఉన్నారు.

డిసెంబర్ లో ఎన్నికలు….

కర్ణాటకలో ఉప ఎన్నికలు డిసెంబరు 5వ తేదీన జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. అన్ని స్థానాలను గెలుచుకోగలిగితే తిరిగి సంకీర్ణ సర్కార్ ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. పదిహేను నియోజకవర్గాల్లో కొన్ని ప్రాంతాల్లో డీకే శివకుమార్ కు పట్టుంది. ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంది.

బెయిల్ వస్తే….

కానీ డీకే శివకుమార్ ఇప్పట్లో బయటకు వచ్చేలా కన్పించడం లేదు. తాజాగా ఆయన బెయిల్ పిటీషన్ ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. మరో పదిహేను రోజుల పాటు డీకే శివకుమార్ జైల్లోనే ఉండాల్సి ఉంది. తిరిగి అక్టోబరు 14న డీకే శివకుమార్ బెయిల్ పిటీషన్ పై విచారణ జరుగుతుంది. నవంబరు 11వ తేదీ నుంచే కర్ణాటక ఉప ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈలోపు డీకే శివకుమార్ కు బెయిల్ దొరుకుతుందా? లేదా? అన్నదే ప్రశ్న. డీకే శివకుమార్ బెయిల్ పై బయటకు వస్తే కాంగ్రెస్ కు ఉప ఎన్నికల్లో వేయి ఏనుగుల బలం వచ్చినట్లవుతుంది.

Tags:    

Similar News