బాగానే యూజ్ చేసుకుంటున్నారే

కర్ణాటకలో డీకే శివకుమార్ అరెస్ట్ ను రాజకీయంగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ [more]

Update: 2019-09-10 17:30 GMT

కర్ణాటకలో డీకే శివకుమార్ అరెస్ట్ ను రాజకీయంగా వాడుకుంటున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ అరెస్ట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. డీకే అరెస్ట్ కేవలం కక్ష సాధింపు చర్చ అని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆరోపించారు. వరసగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగుతుందని ఆయన ఆరోపించారు.

డీకే అరెస్ట్ వెనక….?

మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం డీకే అరెస్ట్ వెనక ఎవరున్నారో తెలుసనని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న డీకే శివకుమార్ ను అరెస్ట్ చేసి భారతీయ జనతా పార్టీ లబ్ది పొందాలనకుంటుందని ఆయన అన్నారు. అంతేకాదు ఎక్కడ అసంతృప్తి ప్రబలి ఎమ్మెల్యేలు తిరిగి తమ చెంతకు వస్తారేమోనన్న భయంతోనే డీకే శివకుమార్ ను అరెస్ట్ చేసినట్లు జనతాదళ్ ఎస్ ఆరోపిస్తుంది.

బీజేపీ సంచలన కామెంట్స్….

ఇక భారతీయ జనతా పార్టీ కూడా డీకే శివకుమార్ ను రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తోంది. తాము డీకే శివకుమార్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నళిన్ కుమార్ కటిల్ అన్నారు. డీకే అరెస్ట్ వెనక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హస్తం ఉందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ లో తనకు పోటీగా డీకే ఎదుగుతున్నారని భావించి సిద్ధరామయ్య రాజకీయంగా కక్ష పెంచుకున్నారని ఆయన ఆరోపించారు.

ఎప్పటినుంచో జరుగుతున్నా…..

నిజానికి మనీలాండరింగ్ కేసులో డీకే శివకుమార్ కు ఎప్పటి నుంచో ఈడీ నోటీసులు పంపుతోంది. అనేక సార్లు డీకే ఇళ్లపై కూడా దాడి చేసింది. చివరకు ఆధారాలు లభించడంతోనే అరెస్ట్ చేశామని ఈడీ అధికారులు చెబుతున్నారు. డీకే అరెస్ట్ తో కర్ణాటకలో పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డీకే శివకుమార్ కు ఈ నెల 13వ వరకూ ఈడీ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. మొత్తం మీద డీకే శివకుమార్ అరెస్ట్ రాజకీయంగా ఎవరికి వారు వాడేసుకుంటున్నారు.

Tags:    

Similar News