దివ్య వాణి టీడీపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నారా ? పార్టీ పాలిటిక్స్ సెగ ?

సీనియ‌ర్ హీరోయిన్ దివ్యవాణి రాజ‌కీయంగా త‌ప్పట‌డుగు వేశారా ? ఎన్నో ఆశ‌ల‌తో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన ఆమె ఆ పార్టీలో ఇమ‌డ లేక‌పోతున్నారా ? [more]

Update: 2021-03-07 11:00 GMT

సీనియ‌ర్ హీరోయిన్ దివ్యవాణి రాజ‌కీయంగా త‌ప్పట‌డుగు వేశారా ? ఎన్నో ఆశ‌ల‌తో గ‌త ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరిన ఆమె ఆ పార్టీలో ఇమ‌డ లేక‌పోతున్నారా ? పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఉన్నా దివ్యవాణికి గుర్తింపు లేదా ? పార్టీ ఇంట‌ర్నల్ పాలిటిక్స్‌తో ఆమె వేగ లేక‌పోతున్నారా ? అంటే తాజా ప‌రిణామాలు, ఆమె చేసిన వ్యాఖ్యలు చూస్తే అవున‌నే ఆన్సర్లు వినిపిస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు ఆమె టీడీపీలోకి వెళ్లాలా ? వ‌ద్దా ? అనే విష‌యంలో ఎంతో సందిగ్ధత‌తో ఉన్నారు. పార్టీలో చేరిన ఆమె ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్యటించారు. పార్టీ అధికారంలోకి వ‌స్తే మంచి ప‌ద‌వే ఇస్తాన‌ని చంద్రబాబు ఆమెకు గ‌ట్టి హామీ ఇవ్వడంతోనే ఆమె విస్తృతంగా ప‌ర్యటించారు.

పార్టీలో యాక్టివ్ గా ఉండి….

ఎన్నిక‌ల్లో టీడీపీ చిత్తుగా ఓడిపోవ‌డంతో ఆమె తీవ్ర నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. మధ్యలో కొద్ది రోజులు పూర్తిగా సైలెంట్ అయిన దివ్యవాణి రాజ‌కీయాల‌కు దూర‌మ‌వుదామా ? అన్న ఆలోచ‌న కూడా చేశారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఉంటే గింటే టీడీపీలోనే ఉండాలి.. లేక‌పోతే సైలెంట్ అయిపోవడం మిన‌హా ఆమెకు వేరే ఆప్షన్ లేదు. దీంతో మ‌ళ్లీ ఆమెలో ఆశ‌లు చిగురించ‌డంతో పార్టీలో యాక్టివ్ అవుతున్నారు. పార్టీ త‌ర‌పున ఉన్నంత‌లో వాయిస్ వినిపిస్తోన్న దివ్య వాణిని సొంత పార్టీ నేత‌లే ఆవేద‌న చెందేలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ట‌. తాజాగా దివ్యవాణి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిద‌ర్శనం.

బాబుతో ఇబ్బంది లేకపోయినా…?

పార్టీ అధినేత చంద్రబాబుతో ఎలాంటి ఇబ్బంది లేక‌పోయినా ? పార్టీలో ఉన్న ఇంట‌ర్నల్ పాలిటిక్స్ వ‌ల్ల తాను చాలా ఇబ్బంది ప‌డుతున్నాన‌ని దివ్యవాణి చెప్పారు. ఇక ఇత‌ర పార్టీల ఆఫ‌ర్ల గురించి కూడా ప్రస్తావించిన దివ్య వాణి దేనికి అయినా టైం రావాలి క‌దా ? అని కూడా బ‌దులు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలే టీడీపీలో ఆమె ఉండ‌లేక బ‌ల‌వంతంగా ఉంటున్నార‌ని తెలిసిపోతోంది. టీడీపీలో ఇప్పుడు మ‌హిళా వాయిస్ విన‌ప‌డ‌డం లేదు. ఎంతో మంతి మాజీ మ‌హిళా మంత్రులు ఉన్నా వారి వాయిస్ ఎప్పుడైనా స్థానికంగా వినిపిస్తోందే త‌ప్పా రాష్ట్ర స్థాయిలో ఈ మ‌హిళా నేత వాయిస్ బ‌లంగా ఉందే అన్న చ‌ర్చే లేదు.

అధికార పార్టీ నుంచి కూడా…

టీడీపీలో మ‌హిళా వాయిస్ వినిపిస్తోన్న వారిలో వంగ‌ల‌పూడి అనిత లాంటి ఒక‌రిద్దరు నేత‌లు మాత్ర‌మే ప్రధానంగా ముందున్నారు. దివ్యవాణిపై సైతం ప్రెస్‌మీట్లు పెట్టాల‌ని.. ప్రభుత్వాన్ని విమ‌ర్శించాల‌న్న ఒత్తిళ్లు ఎక్కువుగా ఉన్నాయంటున్నారు. ఈ క్రమంలోనే ఆమె అధికార పార్టీ నేత‌ల‌కు గ‌ట్టిగా టార్గెట్ అవుతున్నారు. ఆమె వ్యక్తిత్వం నేప‌థ్యంలో ఎదుట వాళ్లను తిట్టి త‌న‌ను తిట్టించుకోవ‌డం ఇష్టం లేక‌పోయినా ఇది దివ్యవాణికి ఇబ్బంది క‌రంగా మారింది. పోనీ సైలెంట్‌గా ఉందామా ? అంటే పార్టీ నేతల ఒత్తిళ్లుక తోడు.. ఫ్యూచ‌ర్ ప‌ద‌వుల విష‌యంలో ఎక్కడ వెన‌క‌ప‌డిపోతామా ? అన్న ఆందోళ‌న కూడా ఆమెలో ఉన్నట్టే కనిపిస్తోంది.

బాబుకు లేఖ రాసి….

15 ఏళ్లకే తాను సినిమాల్లోకి వ‌చ్చాన‌ని.. సినిమాల్లో తాను ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేద‌ని.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన యేడాదికే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌చ్చింద‌ని దివ్యవాణి చెప్పిన మాట‌లే ఆమె ఇక్కడ స‌ర్దుబాటు కాలేక‌పోతున్నార‌న్నది అర్థమ‌వుతోంది. పార్టీలో జ‌రుగుతోన్న ఇంట‌ర్నల్ పాలిటిక్స్‌పై బాబుకు ఇప్పటికే లేఖ రాశాన‌ని చెప్పిన దివ్యవాణి టైం వ‌చ్చిన‌ప్పుడు అన్ని బ‌య‌ట పెడ‌తాన‌ని బాంబు పేల్చారు. తాను ఎప్పుడూ సీట్ల కోసం బాబు గారి ద‌గ్గర దొంగ వేషాలు వేయ‌లేద‌న్న ఆమె అధికార ప్రతినిధికి పార్టీ గైడెన్స్ ఇవ్వాల‌ని.. కానీ ఇక్కడ అలాంటిదేమీ లేద‌ని ఆమె అస‌హ‌నం వ్యక్తం చేశారు. ఏదేమైనా గ‌తంలో పార్టీ మార్పు వార్తల‌ను కొట్టి ప‌డేసిన దివ్యవాణి ఇప్పుడు ఇలా మాట్లాడ‌డం ర‌క‌ర‌కాల రాజ‌కీయ సందేహాల‌కు తావిస్తోంది.

Tags:    

Similar News