ఇంకొంచెం వెయిట్ చేద్దాం: వైసీపీ సీనియ‌ర్లు

అధికార వైసీపీలో సీనియ‌ర్ల వ్యవ‌హారం ముదురుతున్నట్టు క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంతో కృషి స‌ల్పామ‌ని, జ‌గ‌న్ సీఎం అయ్యేందుకు అహ‌ర‌హం శ్రమించామ‌ని.. అయితే.. మంత్రి ప‌ద‌వులు, [more]

Update: 2021-05-04 14:30 GMT

అధికార వైసీపీలో సీనియ‌ర్ల వ్యవ‌హారం ముదురుతున్నట్టు క‌నిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వ‌చ్చేందుకు ఎంతో కృషి స‌ల్పామ‌ని, జ‌గ‌న్ సీఎం అయ్యేందుకు అహ‌ర‌హం శ్రమించామ‌ని.. అయితే.. మంత్రి ప‌ద‌వులు, కీల‌క‌మైన నామినేటెడ్ ప‌ద‌వులు మాత్రం.. కొత్తవారికి ఇచ్చార‌ని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏ ప‌నికావాల‌న్నా.. జూనియ‌ర్లుగా ఉన్న మంత్రుల ముందుకు వెళ్లి చేతులు క‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని వాపోతున్నారు. చాలా వ‌ర‌కు జిల్లాల్లో ఎంతో సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు నాలుగు నుంచి ఐదు సార్లుగా ఎమ్మెల్యే అయిన వారు సైతం ఉన్నారు.

తొలిసారి ఎమ్మెల్యేగా…?

కొన్ని జిల్లాలో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాయ‌కుడికి.. మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు సీనియ‌ర్ ఎమ్మెల్యేలు ఏ ప‌నిచేయించుకోవాల‌ని అనుకున్నా.. జూనియ‌ర్ అయిన‌.. మంత్రి చుట్టూ తిర‌గాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. దీంతో సీనియ‌ర్లు.. తీవ్ర ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక‌, మంత్రులుగా ఉన్న కొత్తవారు సైతం.. బెట్టు చేస్తున్నారు. మాకు సీఎం జగన్ అండ ఉంది. అనే ధీమా వీరిలో స్పష్టంగా క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. దీంతో వైసీీపీ లోని సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు.. మంత్రుల‌కు మ‌ధ్య స‌ఖ్యత కుద‌ర‌డం లేదు. ఈ ప‌రిణామంతో ప్రతి జిల్లాలోనూ మంత్రుల‌కు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య విభేదాలు పొడ‌సూపుతున్నాయి.

తమను సంప్రదించకుండానే..?

చివ‌ర‌కు మునిసిప‌ల్ చైర్మన్లు, కార్పోరేష‌న్ల‌లో మేయ‌ర్ ప‌ద‌వులు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్పిన వాళ్లకు ఇవ్వలేదు. దీనికితోడు.. సీనియ‌ర్ ఎమ్మెల్యేల‌కు ముఖ్యమంత్రి జగన్ క‌నీసం అప్పాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేదు. కానీ, ఈ విష‌యాల‌ను వేటినీ.. ముఖ్యమంత్రి జగన్ ప‌ట్టించుకోవడం లేదు. దీంతో సీనియ‌ర్లు మ‌రింత ఆవేద‌న‌ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇప్పటికిప్పుడు త‌మ ఆవేద‌న‌ను బ‌ర‌స్ట్ చేయ‌కుండా చూసుకుంటున్నారు.

వేవ్ ఉండటంతో…?

రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ జోరుగా ఉండ‌డంతో.. ఎటూ వెళ్లే దారి కూడా లేని ప‌రిస్థితి ఏర్పడింది. ఈ క్ర‌మంలో మ‌ళ్లీ త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న మంత్రి వ‌ర్గ ప్రక్షాళ‌న‌లో త‌మ‌కు అవ‌కాశం చిక్కక‌పోతుందా? అని కొంద‌రు ఎదురు చూస్తుంటే.. ఎన్నిక‌ల‌కు ముందు రెండేళ్ల వ‌ర‌కైనా.. త‌మకు ప్రాధాన్యం ఏర్పడుతుంద‌ని ఆశ ప‌డుతున్న వారు కూడా క‌నిపిస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News