అందరికీ ఇదే న్యాయం ఎప్పుడు..?

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అన్నది దేశంలో సూక్తికే పరిమితం అవుతుంది. చట్టాల్లో ఉన్న లొసుగులు నేరస్తులకు చుట్టలుగా మారుతున్న నేపథ్యంలో దిశ సంఘటనలో [more]

Update: 2019-12-06 09:30 GMT

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవత అన్నది దేశంలో సూక్తికే పరిమితం అవుతుంది. చట్టాల్లో ఉన్న లొసుగులు నేరస్తులకు చుట్టలుగా మారుతున్న నేపథ్యంలో దిశ సంఘటనలో ఎన్ కౌంటర్ యువతుల పట్ల ఆరాచకంగా వ్యవహరించే వారికి చెంప పెట్టుగా నిలుస్తుంది. దిశ కేసులో పోలీసులు సీన్ రీ కన్ సృక్ట్ చేసే ప్రక్రియలో నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నం చేయడం నలుగురు ఎన్ కౌంటర్ కావడంతో అత్యాచారాలకు అడ్డు కట్ట పడినట్లేనా అంటే అందరిలోనూ ఒక అనుమానం, సందేహం అలాగే వుంది.

ప్రతి కేసులోనూ….

మహిళలు స్వేచ్ఛగా తిరిగే రోజులు వచ్చాయా అంటే లేదనే చెప్పాలి. కొన్ని కేసుల్లో మాత్రమే లభించే ఇలాంటి న్యాయం అన్ని కేసుల్లో ఉంటుందా అంటే లేదనే మాటే వినిపిస్తుంది. మీడియా లో బాగా ప్రచారమైన సంఘటనల్లో కొన్నింటిపై మాత్రమే ఇలాంటి చర్యలు కనిపిస్తున్నాయి. ఎన్నో కేసులు పోలీస్ స్టేషన్ గుమ్మం వరకు కూడా వెళ్ళని తీరు నేటి సమాజంలో కనిపిస్తూనే ఉంది.

లోపం ఎక్కడ ఉంది…?

అక్షరాస్యులు కావొచ్చు, నిరక్షరాస్యులు కావొచ్చు పిల్లల పెంపకం విషయంలో తల్లితండ్రులు అనుసరిస్తున్న మార్గం నేర ప్రవృత్తి కి ఎంతో కొంత దోహదం చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆడ, మగ అనే తేడాతో పెంచడం పదేపదే వారి లింగ భేదం గుర్తు చేస్తూ మగ పిల్లలు గొప్ప… ఆడపిల్లలు తక్కువ అనే విధానం ముందుగా విడనాడాలి అని సూచిస్తున్నారు. ఆడపిల్లల విషయంలో అదుపు ఆజ్ఞలు పెట్టే తల్లితండ్రులు మగపిల్లల విషయంలో అవే ఆంక్షలు పెట్టకపోవడం నుంచి ప్రతి అంశంలోను తేడా చూపించడం చేస్తారని ఈవిధంగా చేయడం వల్ల ఇద్దరి మధ్య అంతరం పెరుగుతూ వస్తోంది అంటున్నారు. పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలనే తేడా లేకుండానే ఈ విధానం సాగుతుందని ఈ మూలాలను గుర్తించి సరి చేయాలని తల్లితండ్రులను కోరుతున్నారు.

వారికేది న్యాయం…?

నిర్భయ కేసు ఏడేళ్ళుగా సాగుతూనేవుంది. ఆయేషా మీరాపై అత్యాచారం హత్య కేసులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినవే. మా పిల్లల విషయం లో మాకేది న్యాయం అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి ఎన్నో వేల కేసులు నత్తదకన నడుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవాసులంతా ఒక్కటై రోడ్డుపైకి వచ్చి నినదించారు. దేశంలో ఆడవారి భద్రత ప్రశ్నర్ధకమేనా అని గొంతెత్తాయి. ఈ ఆందోళన గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించింది. దేశ అత్యున్నత చట్టసభల్లో దిశఘటన అట్టుడికించింది. తీవ్ర వత్తిడిలో పడిన టి సర్కార్, ఈ అంశంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ప్రసాదించడం ఖాకీలు కోరుకున్న విధంగా నేరస్థులు వ్యవహరించడం చివరికి యమపురికి చేరుకోవడం చకచకా సాగిపోయాయి. అయితే పోలీసులు ఎన్నికేసుల్లో ఇలాంటి న్యాయం చేస్తారని అనేక మంది నుంచి వస్తున్న ప్రశ్న.

Tags:    

Similar News