స్టాలిన్ కండిషన్ లు పనిచేయడం లేదట

డీఎంకే అధినేత స్టాలిన్ అనుకున్నట్లు జరగలేదు. స్టాలిన్ కూడా సర్దుకుపోవాల్సి వస్తుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్టాలిన్ కు మిత్రపక్షాలు మద్దతు కూడా అవసరం. ఒపీనియన్ పోల్స్, సర్వేలు [more]

Update: 2021-03-13 18:29 GMT

డీఎంకే అధినేత స్టాలిన్ అనుకున్నట్లు జరగలేదు. స్టాలిన్ కూడా సర్దుకుపోవాల్సి వస్తుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో స్టాలిన్ కు మిత్రపక్షాలు మద్దతు కూడా అవసరం. ఒపీనియన్ పోల్స్, సర్వేలు అన్నీ డీఎంకేకు అనుకూలంగా వస్తున్నాయి. ఈసారి స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఈ ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం లేదని డీఎంకే నేతలు ప్రగాఢంగా నమ్ముతున్నారు. స్టాలిన్ కూడా మిత్రపక్షాలను కలుపుకుని వెళ్లాలని నిర్ణయించారు.

తమ పార్టీ గుర్తుపైనే…..?

తొలినాళ్లలో స్టాలిన్ మిత్రపక్షాలు కూడా తమ పార్టీ గుర్తు పైనే పోటీ చేయాలని కండిషన్ పెట్టారు. దీనికి అంగీకారం లేకపోతే తప్పుకోవచ్చని కూడా ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. గత ఎన్నికల్లో మిత్రపక్షాల వల్లనే అధికారంలోకి రాలేకపోయామని స్టాలిన్ భావించి ఈ ప్రతిపాదన మిత్రపక్షాల ముందు పెట్టారు. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ తో పాటు చిన్నా చితకా పార్టీలు అనేకం ఉన్నాయి. కాంగ్రెస్ మినహా మిగిలిన పార్టీలు తమ గుర్తు వెలిగే సూర్యుడు పై పోటీ చేయాలని స్టాలిన్ గట్టిగా కోరారు.

దిగివచ్చిన స్టాలిన్….

అయితే ఈ ప్రతిపాదనకు మిత్రపక్షాలు ఏవీ అంగీకరించలేదు. డీఎంకే గుర్తుపై పోటీ చేస్తే తమ పార్టీ గుర్తింపు ఏముంటుందని, తాము తమ పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తామని స్టాలిన్ కు తెగేసి చెప్పారు. దీంతో స్టాలిన్ కొంత దిగివచ్చినట్లు తెలిసింది. ఇటీవల ఇండియన్ ముస్లిం లీగ్, మణిదనేయ మక్కల్ కట్చి పార్టీలకు స్టాలిన్ సీట్లను కేటాయించారు. ఇండియన్ ముస్లిం లీగ్ మూడుచోట్ల, మణిదనేయ మక్కల్ కట్చికి రెండు స్థానాలను కేటాయించారు.

సీట్ల సర్దుబాటు కూడా….

అయితే ఇండియన్ ముస్లిం లీగ్ తమ గుర్తు నిచ్చెనపైనే పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక సీట్ల సర్దుబాటు విషయంలో స్టాలిన్ రాజీ పడటం లేదు. మిత్రపక్షాలకు వీలయినన్ని తక్కువ స్థానాలను ఇవ్వాలన్నది స్టాలిన్ అభిప్రాయం. ఈ మేరకే ఒక్కొక్క పార్టీకి సీట్లను సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు. మొత్తం మీద డీఎంకే కూటమి ఇప్పుడు తమిళనాడులో బలంగా ఉంది. స్టాలిన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. మరి తమిళుల తీర్పు ఎలా ఉండనుందో చూడాలి.

Tags:    

Similar News