కృష్ణదాస్‌ విఫలమయ్యారా…!

ఉత్తరాంధ్రలోని కీలకమైన జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లాలో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నుంచి రాజకీయంగా చక్రం తిప్పిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా [more]

Update: 2019-08-07 09:30 GMT

ఉత్తరాంధ్రలోని కీలకమైన జిల్లా శ్రీకాకుళం. ఈ జిల్లాలో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ నుంచి రాజకీయంగా చక్రం తిప్పిన వారు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఈ జిల్లా రాజకీయాలను శాసించిన చరిత్ర కూడా సొంతం చేసుకున్నారు. 2004, 2009 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన అప్పటి కాంగ్రెస్‌ నాయకుడు, వైఎస్‌కు అంత్యంత ప్రియమైన నాయకుడు ధర్మాన ప్రసాదరావు.. ఆ పదేళ్లు జిల్లాను ఏలేశారు. ఇతర పార్టీల నుంచి నాయకులు ఉన్నా కూడా ఆయనే కీలకంగా అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుని ముందుకు సాగారు.

టీడీపీలో అచ్చెన్న…..

ఇక, ఆ తర్వాత.. 2014లో టెక్కలి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన కింజరాపు అచ్చన్నాయుడు కూడా జిల్లాను ఏలేశారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో ఏకఛత్రాధిపత్యంగా ముందుకు సాగారు. ఇక, ఈ జిల్లా నుంచి తర్వాత కాలంలో అంటే 2017లో కళా వెంకట్రావు మంత్రి అయినా కూడా ఆయన మాట కూడా ఎక్కడా చెల్లలేదు. అంతా తానే అయిన వ్యవహరించారు అచ్చన్న. ఇక, ఇప్పుడు పరిస్థితిని గమనిస్తే.. శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, ఆయన అన్న కృష్ణదాస్‌, మరోపక్క టీడీపీ నుంచి టెక్కలి స్థానంలో అచ్చన్న సంపూర్ణ విజయం సొంతం చేసుకున్నారు. జగన్‌ తన కేబినెట్‌లో కృష్ణదాస్‌కు మంత్రి పదవి కూడా ఇచ్చారు. దీనిని జిల్లాలోని సీనియర్‌ నేతలు స్వాగతించారు.

వైసీపీనే నమ్ముకుని….

వైసీపీని నమ్ముకుని కృష్ణదాస్‌ చాలా ఏళ్లు కృషి చేశారు. ముఖ్యంగా జగన్‌ జైలులో ఉండాల్సి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి కృష్ణదాస్‌ అండగా నిలిచారు. పార్టీని ముందుకు తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవిని ఇవ్వడం సరైన చర్యేనని అందరూ భావించారు. అయితే, ఆయన మంత్రిగా ఉన్నా ఎక్కడా దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు. అధికారుల దగ్గర కనీసం వైసీపీ నేతలకు సంబంధించిన పనులు కూడా చేయలేక పోతున్నారు. దీంతో ఆయనను సమర్థించిన నాయకులే ఇప్పుడు పెదవి విరుస్తున్నారు.

ఆయనే బెటరంటూ…

కేబినెట్ ఏర్పాటు చేసే ముందు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలంతా కృష్ణదాస్ వైపే మొగ్గు చూపారు. ఇప్పుడు అధికారుల్లో ప‌ట్టు లేక‌పోవ‌డం, చివ‌ర‌కు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌నుల కోసం కూడా ఇన్‌చార్జ్ మినిస్టర్ మీదే ఆధార‌ప‌డ‌డం, అటు పార్టీలో ఉన్న గ్రూపుల‌ను కూడా క‌ట్టడి చేయ‌లేక‌పోవ‌డంతో కృష్ణదాస్‌పై స‌గ‌టు వైసీపీ కార్యక‌ర్త‌లు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం నుంచి గెలిచిన ధర్మాన ప్రసాదరావు అయితే బెటరే ఆలోచన చేస్తున్నారు. ఆయనైతే పార్టీని ముందుకు నడిపించడంతోపాటు. వ్యూహాత్మకంగా ప్రతిపక్షానికి చెక్‌ పెట్టి జిల్లాలో తన ఆధిపత్యం సాగేలా చేయడంలో కీలకంగా వ్యవహరించే వారని అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు మంత్రులను మార్చడం సాధ్యం కాదు కాబల్లి.. మరో రెండున్నరేళ్ల తర్వాత ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావుకు చోటిస్తే బెటరనే సూచనలు వస్తున్నాయి. మరి జగన్‌ ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News