ధోని రన్ అవుట్ పై..?

ప్రపంచ కప్ సెమి ఫైనల్ లో ధోని రన్ అవుట్ పై సోషల్ మీడియా లో ఒకరు పెట్టిన ట్వీట్ వీడియో సంచలనమే అయ్యింది. పవర్ ప్లే [more]

Update: 2019-07-11 02:01 GMT

ప్రపంచ కప్ సెమి ఫైనల్ లో ధోని రన్ అవుట్ పై సోషల్ మీడియా లో ఒకరు పెట్టిన ట్వీట్ వీడియో సంచలనమే అయ్యింది. పవర్ ప్లే సమయంలో ధోని రన్ అవుట్ అయ్యాడు. ధోని ముందు పదిబంతుల్లో 25 పరుగుల టార్గెట్ వుంది. ధోని రన్ అవుట్ కి ముందు సర్కిల్ అవతల ఆరుగురు ఫీల్డర్లు వున్నారని ఎంపైర్లు ఇవి గమనించక పోతే ఎలా అంటూ నెటిజెన్ ప్రశ్నకు కోట్లాది మంది స్పందించారు. అసలే టీం ఇండియా ఓటమి నుంచి కోలుకోలేని ఫ్యాన్స్ కు ప్రపంచకప్ ఫైనల్ కి తమ ఫెవరెట్ టీం చేరుకోలేదన్న బాధతో మ్యాచ్ లో ప్రతి చిన్న పాయింట్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

కివీస్ వత్తిడిని జయించింది ….

అసలైన నాకౌట్ మ్యాచ్ లో ఓడిన భారత్ కన్నా కివీస్ అన్ని రంగాల్లో వత్తిడిని అధిగమించిందని టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. వత్తిడి సమయంలో టీం ఇండియా తడబడితే కివీస్ వత్తిడిని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లలో దాటిందని వ్యాఖ్యానించాడు. ఫైనల్ కి వెళ్లిన కివీస్ కి అభినందనలు తెలిపాడు కోహ్లీ. న్యూజిలాండ్ కి ఫైనల్ చేరడానికి అన్ని రకాల అర్హత ఉందన్నాడు.

జడేజా పై ప్రశంసలు….

లీగ్ లో కస్టపడి ఒకే ఒక్క ఓటమితో అద్భుతంగా రాణించి శ్రమించామని కేవలం 45 నిమిషాల్లో కష్టాన్ని నిలబెట్టుకోలేకపోయామన్నాడు విరాట్. ఇక ధోని – జడేజా ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత కెప్టెన్. ఇక ధోని రనౌట్ అయిన తీరుపై విరాట్ పెద్దగా పెదవి విప్పలేదు. అయితే అభిమానులు మాత్రం మ్యాచ్ ఓటమిపై కన్నీటి పర్యంతమై అయ్యారు. కోహ్లీ సేన ప్రపంచకప్ లో రాణించిన తీరును ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News