ధర్మాన ఫ్యామిలీలో చిచ్చు పెట్టేశారే… ?

అసలే మంత్రి పదవి రాలేదని తెగ ఫీల్ అవుతున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా మూడు దశాబ్దాల క్రితమే [more]

Update: 2021-08-06 00:30 GMT

అసలే మంత్రి పదవి రాలేదని తెగ ఫీల్ అవుతున్నారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా కూడా మూడు దశాబ్దాల క్రితమే పనిచేశారు. రెవిన్యూ వంటి కీలకమైన శాఖలను నిర్వహించి కడు సమర్ధుడు అనిపించుకున్నారు. అటువంటి ధర్మాన ప్రసాదరావుని జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. పైగా ఆయన అన్నను ముందుకు తెచ్చి ఉప ముఖ్యమంత్రిని చేశారు. సరే అన్నకు పదవి వస్తే ఆందందించాల్సిందే కానీ ఇది ఫక్తు రాజకీయం. తమ్ముడు తమ్ముడే రాజకీయం వేరు అన్నట్లుగా ఉంటుంది. అందుకే ధర్మాన ప్రసాదరావు ఎక్కడా సౌండ్ చేయకుండా ఉన్నారు.

దాని అర్ధమేంటో….?

అన్న ఎన్టీయార్ సతీమణిగా లక్ష్మీపార్వతికి ఒక గుర్తింపు ఉంది. ఇక తెలుగు భాష మీద పట్టున్న నేతగా కూడా ప్రత్యేకంగా అభిమానించేవారున్నారు. ఈ మధ్య శ్రీకాకుళం పర్యటనలో లక్ష్మీపార్వతి చేసిన కొన్ని రాజకీయ కామెంట్స్ మాత్రం ఏకంగా ధర్మాన‌ వారి ఇంట మంటలనే పుట్టించాయి అని అంటున్నారు. లక్ష్మీపార్వతి తెలుగు అకాడమీ ప్రెసిడెంట్ కాబట్టి ఆమె పాల్గొన్న సభకు ధర్మాన ప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రసాదరావు తొందరలోనే మంత్రి అవుతారు అంటూ లక్ష్మీ పార్వతి సభకు సంబంధం లేని కామెంట్స్ చేసి వేడి పుట్టించారు. ముఖ స్తుతి కోసం ఆమె చెప్పినా కూడా ధర్మాన ప్రసాదరావు అభిమానులలో ఉన్న బాధను కెలికారని అంటున్నారు.

ప్రయత్నించి మరీ …?

ధర్మాన ప్రసాదరావు ఏం తక్కువ స్థాయి నాయకుడు కాడు. ఆయన మంత్రి పదవి కోసం ఎంత చేయాలో అంతా చేస్తూ వచ్చారు. జగన్ని ప్రసన్నం చేసుకోవడానికి అసెంబ్లీ లోనే పొగుడుతూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఏం చేసినా కూడా అక్కడ ఉన్నది జగన్. ఆయన మనసు మార్చడం ఎవరి తరం కాదు, పైగా ధర్మాన ప్రసాదరావు మీద బలమైన ఆధారాలతో వైసీపీలోని మరో వర్గం చేసిన ఫిర్యాదులు జగన్ వద్ద ఉన్నాయి. వరసబెట్టి శ్రీకాకుళం ఎంపీ సీటును కోల్పోవడానికి ఆయనే కారణం అని కూడా జగన్ కి తెలిసే అలా దూరం పెట్టారు అంటారు. అయితే గతమెలా ఉన్నా ఇక మీదట తాను పక్కాగా పార్టీ కోసం పనిచేస్తాను అని ఆయన అంటూనే ఉన్నారు. మరి అవకాశం వస్తుందా రాదా అన్నది తెలియదు కానీ లక్ష్మీపార్వతి మాత్రం కలి పెట్టేసారు అంటున్నారు.

ఎడముఖమేనా..?

జిల్లాలో బలమైన రాజకీయ కుటుంబంగా ధర్మాన ఫ్యామిలీ ఉంది. అయితే క్రిష్ణదాస్ కి పదవి రావడంతో ఇద్దరి మధ్యన దూరం బాగా పెరిగింది అంటారు. క్రిష్ణ దాస్ కూడా తన వారసుడుగా కుమారుడు క్రిష్ణ చైతన్య కోసం చూసుకుంటున్నారు. తనకు వరించిన పదవులు మళ్ళీ తమ కుటుంబానికే చెందాలని ఆయన ఎత్తులు వేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు కూడా తమ కుమారుడిని ప్రోత్సహిస్తున్నా మంత్రి పదవి మళ్ళీ చేపట్టిన తరువాతనే రిటైర్ కావాలనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన చాప కింద నీరులా చేసుకుంటున్న ప్రయత్నాలు లక్షీపార్వతి కామెంట్స్ తో ఒక్కసారి బయటపడ్డాయి అంటున్నారు. దీంతో అన్నతో పూర్తిగా చెడేలా సీన్ ఉందని అంటున్నారు. క్రిష్ణదాస్ తన పదవికి ఎసరు వస్తుంది అనుకుంటే ఆయన చేయాల్సింది చేస్తారు అంటున్నారు. మొత్తానికి అన్నదమ్ముల మధ్య చిచ్చు రాజేయడం తగునా అన్న గారి సతీమణి గారూ అంటున్నారు సిక్కోలు వైసీపీ నేతలు.

Tags:    

Similar News