ధర్మాన లాజిక్ కరెక్టేగా

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సబ్జెక్ట్ మీద పట్టు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆయన లాజిక్ పాయింట్లకు తలపండిన నాయకులు [more]

Update: 2020-01-08 05:00 GMT

శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సబ్జెక్ట్ మీద పట్టు ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఆయన లాజిక్ పాయింట్లకు తలపండిన నాయకులు సైతం సమాధానం చెప్పలేరు. వైసీపీ సర్కార్ లో మంత్రి పదవిని ఆశించి కేవలం ఎమ్మెల్యేగా మిగిలినా కూడా అపుడపుడు ధర్మాన ప్రసాదరావు తన మేధస్సుకు పదును పెడుతూ విపక్షాన్ని ఇరకాటంలో పెడుతూనే ఉంటారు. ఇవన్నీ ఇలా ఉంటే ధర్మాన తాజాగా ఒక ధర్మ సంకటాన్ని బయటపెట్టారు. అదీ అమరావతి రైతులు రగులుతున్న వేళ అసలు అక్కడ రాజధాని ఏర్పాటే రాజ్యాంగబద్ధం కాదని. దాని ఉనికికే ముప్పు తెచ్చేలా ధర్మాన ప్రసాదరావు చేసిన కామెంట్స్ ఇపుడు కాక రేపుతున్నాయి.

అంతా విరుద్ధ్ధమే…..

అసలు అమరావతి రాజధాని అన్నదే ఒక రాజ్యాంగ విరుద్ధమైన విధానమని అసలుకే ఎసరు పెట్టారు ధర్మాన ప్రసాదరావు. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ళ వరకూ ఉండగా హఠాత్తుగా కొత్త రాజధానిగా అమరావతిని తెరపైకి తేవడం రాజ్యాంగ విరుద్ధమని ధర్మాన అంటున్నారు. అంతే కాదు, కొత్త రాజధాని ఇదీ అని కనీసం గెజిట్ నోటిఫికేషన్లో పెట్టకపోవడమూ రాజ్యాంగ ఉల్లంఘ‌నేనని అన్నారు. ఇక కొత్త రాజధాని విషయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణ కమిటీ సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకపోవడం కూడా మరో ఉల్లంఘన అని ఆయన ఎత్తి పొడిచారు. ఇక రాజధాని పేరిట సొంత మనుషులతో వేసిన కమిటీ నివేదికను అమలుచేయడం మరో ఉల్లంఘన‌గా చెప్పుకొచ్చారు. మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని కోసం తీసుకోరాదని, మరీ ముఖ్యంగా కృష్ణా, గుంటూరు పరిసర ప్రాంతాలాలో రాజధాని వద్దు అని శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికకు విరుధ్ధంగా అక్కడే రాజధాని పెట్టడం కూడా బాబు పాల్పడిన ఇంకో ఉల్లంఘన‌గా ధర్మాన చెప్పారు.

రాష్ట్రపతికి లేఖ…

ఈ మేరకు అన్ని అంశాలను పొందుపరుస్తూ రాష్ట్రపతికి లేఖ రాసిన ధర్మాన ప్రసాదరావు అమరావతి రాజధానిని రాజ్యాంగ ఉల్లంఘన‌ కింద పరిగణించాలని అందులో కోరారు. ఆ విధంగా నాటి టీడీపీ సర్కార్ పెద్దలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌ రీ–ఆర్గనైజేషన్‌ యాక్ట్‌–14 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించారని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలు ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్‌లో పనిచేయలేదని, వాటిని వేరే చోటుకు మార్చేశారని పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో అమరావతి రాజధాని రాజ్యాంగ విరుధ్ధమని ప్రకటించాలని ఆయన రాష్ట్రపతిని కోరారు. ఇక జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు, బోస్టన్ నివేదిక అధికార వికేంద్రీకరణను సూచించిందని, దాన్ని పక్కాగా అమలుచేయాలని కూడా ధర్మాన ప్రసాదరావు కోరారు.

Tags:    

Similar News