ఆ వైసీపీ సీనియ‌ర్ మౌన రాజ‌కీయం… జ‌గ‌న్ అస‌హ‌నం..?

ధ‌ర్మాన ప్రసాద‌రావు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గత ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, కాంగ్రెస్ హ‌యాంలోనే మంత్రిగా, వైఎస్‌కు అత్యంత స‌హ‌చ‌రుడిగా కూడా [more]

Update: 2020-04-08 15:30 GMT

ధ‌ర్మాన ప్రసాద‌రావు. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గత ఏడాది ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించారు. అయితే, కాంగ్రెస్ హ‌యాంలోనే మంత్రిగా, వైఎస్‌కు అత్యంత స‌హ‌చ‌రుడిగా కూడా ధర్మాన ప్రసాదరావు గుర్తింపు పొందారు. విద్యావేత్తగా ఆయ‌న గుర్తింపు పొందారు. అయితే, ఇంత సీనియ‌ర్ నాయ‌కుడు కూడా ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నారు. దీనికి కార‌ణం. ఆయ‌న ప్రజల‌కు, నియోజ‌క‌వ‌ర్గానికి కూడా దూరంగా ఉండ‌డం, స‌మ‌స్యల‌పై పెద్దగా స్పందించ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు రాజ‌కీయాల‌పై విమ‌ర్శలు వ‌స్తున్నాయి.

ఇద్దరికీ మాటల్లేవట….

రాజ‌కీయాల్లో సీనియ‌ర్ కావ‌డం, గతంలో మంత్రిగా కూడా జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పారు ధర్మాన ప్రసాదరావు. అయితే, జ‌గ‌న్ ప్రభుత్వంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆశించారు. అయితే, అనూహ్యంగా ఆ అవ‌కాశం ఆయ‌న సోద‌రుడు కృష్ణదాస్‌కు ద‌క్కింది. దీంతో ధర్మాన ప్రసాదరావు ఒకింత ఆవేద‌న‌లో ఉన్నారు. పైగా త‌న అన్నతోనే ఆయ‌న వైరం పెట్టుకున్నార‌ని, ఇరువురి మ‌ధ్య కూడా మాట‌లు లేవ‌నే ప్రచారం కూడా జోరుగా సోగుతోంది. రాజ‌ధాని త‌ర‌లింపు విష‌యంలో కూలంక‌షంగా అసెంబ్లీలో మాట్లాడిన త‌ర్వాత ధ‌ర్మాన ప్రసాద‌రావు వర్గం .. ఓ విష‌యాన్ని తెర‌మీదికి తెచ్చింది.

పదవి దక్కలేదనేనా?

ఇంత నాలెడ్జ్ ఉన్న ధర్మాన ప్రసాదరావును పక్కన పెట్ట‌డం భావ్యమేనా ? అని ఆ చ‌ర్చల సారాంశం. ఇది కృష్ణదాస్ కు తెలిసింది. అయితే, ఈ వ్యాఖ్యల‌ను ధర్మాన ప్రసాదరావు ఖండించ‌లేదు. దీంతో ఇద్దరు అన్నద‌మ్ముల మధ్య కూడా మౌన పోరాటం సాగుతోంది. ఇక‌, స్థానిక ఎన్నిక‌ల్లోనూ ప్రసాద‌రావు దూకుడుగా వ్యవ‌హ‌రించలేదు. పైగా త‌న సొంత వ్యవ‌హారాలు తాను చూసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోనూ ప్రజ‌ల‌కు అందుబాటులో ఉండ‌డంలేద‌నే టాక్ ఉంది. మొత్తానికి త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కలేద‌నే ఆవేద‌న మాత్రం ఆయ‌న‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఓ వైపు క‌రోనా విష‌యంలో ఇంత హ‌డావిడి జ‌రుగుతున్నా ధర్మాన ప్రసాదరావు మాత్రం క‌నీసం నియోజ‌క‌వ‌ర్గ ప్రజ‌ల‌కు కూడా అందుబాటులో లేకుండా వ్యవ‌సాయం చూసుకుంటున్నార‌ట‌.

తన పని తాను చేసుకుంటూ…..

చిన్నా చితకా ప‌నుల కోసం త‌న ద‌గ్గర‌కు వ‌చ్చేవారిని సైతం ధర్మాన ప్రసాదరావు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు. ఇటు పార్టీ విష‌యంలో కానీ, రాజ‌కీయాల విష‌యంలో కానీ అంటీ ముట్టన‌ట్టే వ్యవ‌హరిస్తున్నారు. పైగా స్థానిక ఎన్నిక‌ల‌ను కూడా పెద్దగా ప‌ట్టించుకున్నట్టు లేద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాలు ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా జిల్లా, రాష్ట్రంలోనూ చ‌ర్చకు వ‌స్తున్నాయి. దీనిపై పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ కూడా స‌మీక్షించార‌ని, ప్రసాద‌రావులో నైరాశ్యంపై ఆయ‌న ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశార‌ని అంటున్నారు. వ‌చ్చే రెండేళ్ల త‌ర్వాత జ‌రిగే మంత్రి వ‌ర్గ విస్తర‌ణ‌పై ధర్మాన ప్రసాదరావు ఆశ‌లు పెట్టుకున్నా.. జ‌గ‌న్ ఆయ‌న‌కు ఛాన్స్ ఇచ్చే అవ‌కాశం లేద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ? చూడాలి.

Tags:    

Similar News