అన్నదమ్ములు ఉన్నదమ్ములు చూపిస్తున్నారా ?

శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం అతి పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. వారి తరువాత వరసలో ధర్మాన కుటుంబాన్నే అందరూ చెబుతారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ధర్మాన [more]

Update: 2020-11-23 14:30 GMT

శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబం అతి పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ. వారి తరువాత వరసలో ధర్మాన కుటుంబాన్నే అందరూ చెబుతారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ధర్మాన ఫ్యామిలీది. మంత్రిగా పలు కీలక శాఖలు నిర్వహించిన ధర్మాన‌ ప్రసాదరావు అంటే జిల్లాలో దమ్మున్న నేత అంటారు. ఆయన వ్యూహాలూ పదునుగా ఉంటాయి. మాట్లాడితే సబ్జెక్ట్ ఉంటుంది. ఆయన లాజిక్ పాయింట్లు తీస్తే ప్రత్యర్ధులకు చుక్కలు కనిపించాల్సిందే. ఇక ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి అనుకుంటే అన్న క్రిష్ణ దాస్ కి జగన్ ఇచ్చారు. దాంతో జిల్లాలో అన్నదమ్ముల సవాల్ అంటూ కొంతకాలం రాజకీయ సినిమావే నడిచింది.

ఒక్కటి అయ్యారా…?

జిల్లా రాజకీయాల్లో పట్టుని నిలుపుకోవడానికి ధర్మాన కుటుంబం ఇపుడు ఒక్కటి అయిందని ప్రచారం సాగుతోంది. అన్నకు పూర్తిగా సహకరించడానికి ప్రసాదరావు ఒప్పుకున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. మరో వైపు జగన్ కూడా జిల్లాల్లో అందరికీ కలుపుకునిపోవాలని కూడా దాసన్నకు సూచించారు. ప్రత్యేకించి ప్రసాదరావుని పొలిటికల్ గా యాక్టివ్ అయ్యేలా చూడాలని కూడా ఆదేశించారు ఆ బాధ్యత క్రిష్ణ దాస్ మీదనే పెట్టారు. ఆవేశపరుడిగా పేరున్న దాసన్న తమ్ముడి విషయంలో ఒకటి రెండు మెట్లు దిగి మరీ ఇపుడు మంచి చేసుకున్నారని అంటున్నారు.

ఆలోచనతో కూడిన ఆచరణ…..

జిల్లా ప్రగతి మీద ప్రసాదరావుకు కచ్చితమైన ఆలోచనలు ఉన్నాయి. వాటిని అన్న ధర్మాన ప్రసాదరావుకు చెబుతూ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేశారు. జిల్లాలో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులు అవసరం అవుతాయి. వాటి కోసం దాసన్న తనకు ముఖ్యమంత్రి జగన్ వద్ద ఉన్న పరిచయాలతో గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటూంటే జిల్లాలో అన్నదమ్ములు ఇద్దరూ కలసి ప్రగతిని పరుగులు పెట్టేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. దాంతో కొన్నాళ్ళుగా ఆగిన సిక్కోలు అభివృద్ధి మళ్ళీ దారిన పడుతోంది. మరో వైపు ప్రసాదరావు కూడా యాక్టివ్ అయ్యారు. పాదయాత్రను జిల్లాలో పూర్తిగా చేపట్టిన వైసీపీ ఎమ్మెల్యేలలో ఆయన ఒకరుగా ఉన్నారు.

వారసులు రెడీ …..

అన్నదమ్ములు ఇద్దరి వారసులు కూడా సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు క్రిష్ణ దాస్ తనయుడు డాక్టర్ క్రిష్ణ చైతన్య జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ అవుతారు అంటున్నారు. ఇక ధర్మాన ప్రసాదరావు కుమారుడు మనోహర్ నాయుడు కూడా తండ్రితో పాటే రాజకీయాన్ని ఔపాసన పట్టేశారు. 2024 నాటికి ప్రసాదరావు రిటైర్ అవుతారని, కుమారుడికే టికెట్ ఇప్పించుకుంటారని అంటున్నారు. అందువల్ల రానున్న మూడేళ్ళ కాలంలో అన్నతో కలసి తన నియోజక‌వర్గంలో పనులను పూర్తి చేసేందుకు ధర్మాన ప్రసాదరావు ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు అంటున్నారు. మొత్తానికి జగన్ కోరినదీ, జనం కోరినదీ కూడా ఇదే. అన్నదమ్ములు ఇద్దరూ కలసి జిల్లాను ముందుకు తీసుకెళ్తే అటు వైసీపీకి ఇటు శ్రీకాకుళానికి కూడా మేలు జరుగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News