తప్పుచేశారు….చేస్తున్నారు

సిక్కోలు రాజకీయల్లో కింజరపు కుటుంబం దూకుడుగా ముందుకుసాగుంతుంది. ఫైర్ బ్రాండ్ గా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని చెప్పుకుంటారు. ఆయన మాటలతో బాంబులు పేలుస్తారు. ఇక తనదైన ఆవేశంతో [more]

Update: 2019-10-05 03:30 GMT

సిక్కోలు రాజకీయల్లో కింజరపు కుటుంబం దూకుడుగా ముందుకుసాగుంతుంది. ఫైర్ బ్రాండ్ గా మాజీ మంత్రి అచ్చెన్నాయుడుని చెప్పుకుంటారు. ఆయన మాటలతో బాంబులు పేలుస్తారు. ఇక తనదైన ఆవేశంతో ప్రకంపనలు పుట్టిస్తారు. ఓ విధంగా చంద్రబాబుకు రైట్ హ్యాండ్ గా అచ్చెన్న ఉంటూ వేయి ఏనుగుల బలన్ని ఇస్తున్నారు. అటువంతి అచ్చెన్నాయుడుని ఎన్నికల్లో ఓడించాలనుకున్నారు జగన్. ప్రతిపక్ష నేతగా జగన్ అసెంబ్లీలో ఉన్నపుడు ఆయన మీద దారుణమైన కామెంట్స్ చేసిన అచ్చెన్న అంటే జగన్ కి మంట అన్నది తెలిసిందే. అయితే ఎంతలా అనుకున్నా అచ్చెన్న ఎమ్మెల్యేగా తిరిగి గెలిచేశారు. ఆయన అసెంబ్లీలో సైతం జగన్ కి ఎదురునిలిచి విపక్షం నుంచి బలమైన గొంతు వినిపిస్తున్నారు. మరి ఈ సమాయంలో జగన్ అచ్చెన్నను కట్టడి చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకున్నారన్నది ఆలోచిస్తే మంత్రిగా కృష్ణ దాస్ ఎంపిక రాంగ్ డెసిషన్ అంటున్నారంతా.

సౌమ్యుడిగానే….

కృష్ణ దాస్ పూర్వ రంగం ప్రభుత్వ ఉద్యోగం. ఆయనకు సౌమ్యుడిగానే పేరు. శ్రీకాకుళం రాజకీయాలు పూర్తిగా మాస్ గా ఉంటాయి. అటువంటి చోట టీడీపీకి గట్టి పట్టున్న చోట మాస్ లీడర్ని మంత్రిగా చేస్తే వైసీపీకి ఊపు వచ్చేదని, ప్రభుత్వం కూడా జనంలో కనిపించేదన్న మాట పార్టీలో గట్టిగా ఉంది. అయితే జగన్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ మూలంగానూ, ధర్మాన ప్రసాదరావుకి మంత్రి పదవి ఇస్తే ఊరుకోమని మరో బలమైన కాళింగ సామాజికవర్గం చెప్పడం వల్ల తరుణోపాయంగా కృష్ణ దాస్ ని ఎంపిక చేశారని అంటారు. జగన్ వరకూ ఇది బాగానే ఉన్నా జగన్ అనుకున్నట్లుగా జిల్లాలో సామాజిక రాజకీయ సమీకరణలను కృష్ణ దాస్ సరిగ్గా బ్యాలన్స్ చేయలేకపోతున్నారని అంటున్నారు. అంతెందుకు సొంత తమ్ముడు ప్రసాదరావుని కలుపుకుని ముందుకు పోవడంలో కూడా కృష్ణ దాస్ విఫలం కావడాన్ని ఏ విధంగా చూడాలని వైసీపీ నేతలే అంటున్నారు.

పూర్తిగా మౌన ముద్ర….

ఇక ధర్మాన ప్రసాదరావు పూర్తిగా మౌన ముద్రలోకి వెళ్ళిపోయారు. ఆయన అలికిడి అన్నది సిక్కోలు జిల్లాలో కనిపించడంలేదు. తాను గెలిచిన అసెంబ్లీ నియోజకవర్గాన్ని తనయుడు మనోహరనాయుడుకు అప్పగించిన ప్రసాదరావు జరుగుతున్న పరిణామాలను మౌనంగానే గమనిస్తున్నారు. వైసీపీ గెలిచింది, అన్న మంత్రి అయ్యారు. పార్టీ కోసం పనిచేద్దామని ప్రసాదరావు అనుకోకపోవడం విడ్డూరమే. ఆయనలో అసంతృప్తి అలా చేయిస్తోందని అంటున్నారు. అదే సమయంలో మాజీ మంత్రిగా అచ్చెన్నాయుడు రెచ్చిపోతున్నారు. నేరుగా జగన్ ని టార్గెట్ చేస్తూ మీడియాముఖంగానూ, జనంలోనూ వెళ్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది ఎమ్మెల్యే సీట్లకు గాను ఎనిమిది గెలిచి అధికారంలో ఉన్న వైసీపీ అచ్చెన్న జోరుకు కళ్ళెం వేయలేకపోతోంది. అచ్చెన్నను వైసీపీలో జూనియర్ నాయకులు పేడాడ తిలక్, దువ్వాడ శ్రీనివాస్ కౌంటర్ చేసే పరిస్థితి ఉందంటే ఇంతటి బలమైన అధికార పార్టీ ఎక్కడికి పోయిందన్న సందేహం కలుగుతోంది. కృష్ణ దాస్ మంత్రిగా దూకుడు ప్రదర్శిస్తే తప్ప పార్టీ ముందుకు సాగదని అంటున్నారు.

Tags:    

Similar News