దేవినేని ఉమాకు జ‌గ‌న్ మ‌రో చెక్ ?

మాజీ మంత్రి దేవినేని ఉమాకు రెండున్నర ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్రలో ఎప్పుడూ లేనంత గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. 1999 ఎన్నిక‌ల‌కు ముందు త‌న అన్న దివంగ‌త మాజీ [more]

Update: 2021-04-06 05:00 GMT

మాజీ మంత్రి దేవినేని ఉమాకు రెండున్నర ద‌శాబ్దాల రాజ‌కీయ చ‌రిత్రలో ఎప్పుడూ లేనంత గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. 1999 ఎన్నిక‌ల‌కు ముందు త‌న అన్న దివంగ‌త మాజీ మంత్రి దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ రాజ‌కీయ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన దేవినేని ఉమా నందిగామ‌ను కంచుకోట‌గా మార్చుకున్నారు. ఏ ఎన్నిక అయినా.. పార్టీ అధికారంలోకి వ‌చ్చినా.. రాక‌పోయినా గెలుపు మాత్రం అక్కడ దేవినేని ఫ్యామిలీదే అయ్యింది. ఆ మాట‌కు వ‌స్తే ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికీ దేవినేని కుటుంబానికి మంచి ప‌ట్టే ఉంది. టీడీపీ అభ్యర్థులు ఇప్పటికీ దేవినేని ఉమానే డిసైడ్ చేస్తారు. అక్కడ ఆ ఫ్యామిలీకి ఉన్న ప‌ట్టును గ్రహించే దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌. రాజశేఖ‌ర్ రెడ్డి నందిగామ‌ను ఎస్సీల‌కు రిజ‌ర్వ్ చేయించార‌న్న టాక్ కూడా ఉంది.

మైలవరం వచ్చిన తర్వాత…

కంచుకోట నందిగామ ఎస్సీల‌కు రిజ‌ర్వ్ కావ‌డంతో దేవినేని ఉమా ప‌క్కనే ఉన్న మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంకు మారారు. మైల‌వ‌రంలో కూడా దేవినేని ఉమాకు మంచి ప‌ట్టే ఉంది. అక్కడ వ‌రుస‌గా రెండు సార్లు గెలిచినా చెమ‌టోడ్చార‌నే చెప్పాలి. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం మైల‌వ‌రంలో ఉమా ఓడిపోక త‌ప్పలేదు. దేవినేని కుటుంబానికి చిర‌కాల రాజ‌కీయ శ‌త్రువులు అయిన వ‌సంత ఫ్యామిలీ నందిగామ‌లో దేవినేని సోద‌రుల‌పై ఓడిపోయింది. ద‌శాబ్దాల పాటు ఈ రెండు కుటుంబాల మ‌ధ్య సాగిన పోరులో ఎట్టకేల‌కు గ‌త ఎన్నిక‌ల్లోనే వ‌సంత కృష్ణప్రసాద్ (కేపీ) దేవినేని ఉమాను ఓడించి రివేంజ్ తీర్చుకున్నారు.

స్పెషల్ టార్గెట్…..

ఇక మైల‌వ‌రంలో దేవినేని ఉమాను ఎప్పటిక‌ప్పుడు రాజ‌కీయంగా అణిచివేసేందుకు కేపీ అలెర్ట్‌గా ఉంటున్నారు. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో అయితే టీడీపీ కేవ‌లం నియోజ‌క‌వ‌ర్గం మొత్తం మీద మూడే మూడు గెలిచింది. దీనిని బ‌ట్టే ఇక్కడ కేపీ వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలుస్తోంది. అటు వైసీపీ అధిష్టానం కూడా దేవినేని ఉమాను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తుండ‌డంతో పాటు మైల‌వ‌రంలో ఎప్పటికీ నిల‌దొక్కుకోకూడ‌ద‌నే ప్లాన్ వేస్తోంది. ఇందుకోసం కేపీకి తోడుగా త‌ల‌శిల ర‌ఘురాం సైతం ఇక్కడ బాధ్యత‌లు తీసుకున్నారు. క‌మ్మ సామాజిక వ‌ర్గానికే చెందిన ర‌ఘురాం జ‌గ‌న్ రూట్ మ్యాప్ కోఆర్డినేట‌ర్‌. 2014కు ముందు నుంచే ఆయ‌న జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితుడిగా ఉన్నారు.

జగన్ ఆదేశాలతో….

తలశిల ర‌ఘురాంది మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గమే.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో కీల‌క గ్రామం అయిన గొల్లపూడి ఆయ‌న స్వగ్రామం. దేవినేని ఉమాను నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయంగా మ‌రింత అణిచివేసేందుకు కేపీ, ర‌ఘురాం ఇద్దరూ క‌లిసి ప‌ని చేస్తున్నారు. ఇది జ‌గ‌న్ ఆదేశాల ప్రకార‌మే జ‌రుగుతోంద‌ని కూడా తెలుస్తోంది. ఇటీవ‌ల గొల్లపూడి గ్రామంలో టీడీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థుల‌తో పాటు ఆ పార్టీ జ‌డ్పీటీసీ అభ్యర్థి సైతం వైసీపీలో చేరిపోయారు. ఇది దేవినేని ఉమాకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ మార్పు వెన‌క ర‌ఘురాం కీల‌క పాత్ర పోషించార‌ని పార్టీ వ‌ర్గాలు చెపుతున్నాయి. ర‌ఘురాం అటు జ‌గ‌న్ వ‌ద్ద మంచి మార్కులు వేయించుకునే క్రమంలో ఇప్పటి వ‌ర‌కు తెర‌వెన‌క కీల‌క పాత్ర పోషించినా ఇప్పటి నుంచి తెర‌ముందుకు వ‌స్తోన్న ప‌రిస్థితి. మ‌రి ఈ ఇద్దరు నేత‌లు దేవినేని ఉమాను మైల‌వ‌రంలో ఎంత వ‌ర‌కు క‌ట్టడి చేస్తారో ? చూడాలి.

Tags:    

Similar News