తర్వాత లక్ష్యం ఈయనేనటగా?

తెలుగుదేశం పార్టీలో నెక్ట్స్ టార్గెట్ ఎవరు? వైసీపీ తదుపరి లక్ష్యం ఏ నేతపైన? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ [more]

Update: 2020-11-14 05:00 GMT

తెలుగుదేశం పార్టీలో నెక్ట్స్ టార్గెట్ ఎవరు? వైసీపీ తదుపరి లక్ష్యం ఏ నేతపైన? అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అనేక మంది తెలుగుదేశం పార్టీ నేతలపై వైసీపీ ప్రభుత్వం అనేక రకాలుగా కక్ష సాధింపు చర్యలకు దిగింది. ముఖ్యంగా చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన వారి ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా కొంత దూకుడు ప్రదర్శిస్తున్న నేతలను వైసీపీ టార్గెట్ చేసిందన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

వరస అరెస్ట్ లతో….

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలుత ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై ఈఎస్ఐ కుంభకోణం కేసు నమోదు చేసింది. దాదాపు మూడు నెలలు అచ్చెన్నాయుడు జైలులో ఉన్నారు. ఆ తర్వాత ఒక హత్య కేసులో మాజీ మంత్రి కొల్లురవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు, మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు మరికొంత మంది నేతలు టార్గెట్ గా మారారంటున్నారు.

ఆర్థిక మూలాలు….

మాజీ ఎంపీ సబ్బం హరి ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ ఆయన ప్రహరీ గోడను కూల్చి వేశారు. మరోసారి ఆయనకు నోటీసులు జారీచేశారు. ఇక చంద్రబాబు బంధువు శ్రీభరత్ కు చెందిన గీతం కళాశాలలో ఆక్రమణలను కూల్చివేశారు. దాదాపు గీతం కళాశాల యాజమాన్యం ఆక్రమించిన ప్రభుత్వ భూమి విలువ 800 కోట్ల పైగానే ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రకటించడం విశేషం.

ఉమ టార్గెట్ గా…..

మరోవైపు దేవినేని ఉమ తర్వాత లక్ష్యంగా కన్పిస్తున్నారని టీడీపీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. కృష్ణా పుష్కరాల ఘాట్ నిర్మాణపనుల్లో జరిగిన అవినీతి పనులపై ఇప్పటికే కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ నివేదిక అందిన వెంటనే దేవినేని ఉమపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉమ కూడా వైసీపీ పై పదే పదే విమర్శలు చేస్తుండటం కూడా ఆయన టార్గెట్ అవ్వడానికి కారణంగా చెబుతున్నారు. ఈ అంశం ఇప్పుడు టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News