ఢోకా లేదట.. ఈయనకే ఆ పదవి అట

బీజేపీలో మోదీ, షా తర్వాత ఎవరు? ఇప్పుడు అందరి నుంచి వస్తున్న సందేహాలివే. మోదీకి వచ్చే ఎన్నికల నాటికి 70 ఏళ్లు దాటిపోతాయి. బీజేపీ సిద్ధాంతాలు, నిబంధనల [more]

Update: 2020-09-18 18:29 GMT

బీజేపీలో మోదీ, షా తర్వాత ఎవరు? ఇప్పుడు అందరి నుంచి వస్తున్న సందేహాలివే. మోదీకి వచ్చే ఎన్నికల నాటికి 70 ఏళ్లు దాటిపోతాయి. బీజేపీ సిద్ధాంతాలు, నిబంధనల ప్రకారం ఏ పదవీ చేపట్టకూడదు. తర్వాత ప్రధాని పదవిని అమిత్ షా చేపట్టవచ్చు. ఆయన తర్వాత ఇదే ప్రశ్న బీజేపీ క్యాడర్ లోనూ కలుగుతోంది. అయితే ఇప్పటి నుంచే కేంద్ర స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేసేందుకు సిద్ధమవుతున్నారు మోదీ, షాలు.

జేపీ నడ్డాను కొనసాగించే…..

వచ్చే 2024 నాటికి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉండే అవకాశం లేదు. ఆయన కాలపరిమితి ముగియనుండటంతో ఎన్నికల ముందు నాటికి కొత్త అధ్యక్షుడు వస్తారు. ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు ముందు అధ్యక్ష పదవి కావడంతో కీలమైన, నమ్మకమైన నేతకే అప్పగిస్తారన్న ప్రచారం కమలం పార్టీలో జరుగుతోంది. ఇందులో ప్రధానంగా దేవేంద్ర ఫడ్నవిస్ పేరు బాగా విన్పిస్తుండటం విశేషం.

యువకుడు, వ్యూహాలు…..

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన దేవేంద్ర ఫడ్నవిస్ యువకుడు మాత్రమే కాదు రాజకీయ వ్యూహాలు తెలిసిన వ్యక్తి. భవిష్యత్ లో పార్టీకి ఉపయోగపడే నేతగా కేంద్ర నాయకత్వం నమ్ముతుందట. అందుకోసమే మహారాష్ట్ర రాజకీయాలే కాకుండా ఇతర రాష్ట్రాల రాజకీయాలను కూడా ఫడ్నవిస్ కు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బీహార్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించాలని ఫడ్నవిస్ కు బాధ్యతలను అప్పగించిందంటున్నారు.

నమ్మకమైన నేత కావడంతో…..

పైగా దేవేంద్ర ఫడ్నవిస్ మోదీ, షాలకు నమ్మకమైన నేత. మహారాష్ట్రలో శివసేనతో కటీఫ్ చెప్పిన తర్వాత వారిద్దరి సూచనలతోనే ఒకరోజు ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ బాధ్యతలు చేపట్టారంటారు. ఫడ్నవిస్ కు అది ఇష్టం లేకపోయినా షా ఆదేశాలను అమలు చేశారని చెబుతారు. అలాంటి ఫడ్నవిస్ కు 2024 ఎన్నికలకు ముందు బీజేపీ అధ్యక్ష్యుడిగా బాధ్యతలను దక్కనున్నాయి. మోదీ, షా ల తర్వాత అంత చరిష్మా, వ్యూహం ఉన్న నేత ఫడ్నవిస్ అని ఇప్పటికే పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఫడ్నవిస్ కు సంఘ్ పరివార్ ఆశీస్సులు కూడా ఉండటంతో ఆయన రాజకీయ భవిష్యత్ కు ఢోకా ఉండదని అంటున్నారు.

Tags:    

Similar News