దేవేంద్రుడికి ఇదే ప్రాబ్లం

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం డేట్ కూడా ఫిక్స్ చేసింది. కేవ‌లం ఒకే విడ‌త‌లో ఇక్కడ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల [more]

Update: 2019-10-09 17:30 GMT

మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఇప్పటికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం డేట్ కూడా ఫిక్స్ చేసింది. కేవ‌లం ఒకే విడ‌త‌లో ఇక్కడ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నెల 21న జ‌రిగే ఎన్నిక‌ల‌కు సంబంధించి కేవ‌లం 3 రోజుల్లోనే ఫ‌లితాలు కూడా రానున్నాయి. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలున్న మ‌హారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. గత లోక్ సభ ఎన్నిక‌ల్లో శివ‌సేన పొత్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన బీజేపీ విజ‌యం సాధించింది. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. మేధావి వ‌ర్గాలు బీజేపీకి దూరంగా ఉన్నాయి. అదేస‌మ‌యంలో నిన్న మొన్నటి వ‌ర‌కు శివ‌సేన బీజేపీతో పొత్తుకు క‌టీఫ్ చెప్పడం, విమ‌ర్శలు చేయ‌డం కూడా రాజ‌కీయంగా ప్రభావం చూపింది.

హామీలు అమలుకాక….

అయితే, శివ‌సేన మ‌రోసారి బీజేపీకి ఆప‌న్న హ‌స్తం అందించేందుకు రెడీ అయింది. అయితే, ఇప్పటి వ‌ర‌కు ఇక్కడ బీజేపీ సార‌ధి, సీఎం దేవేంద్ర ఫ‌డ్నవీస్ అమ‌లు చేసిన ప‌థ‌కాల‌పై పెద్దగా ప్రజ‌ల్లో స్పంద‌న లేక పోవ‌డం కూడా గ‌మ‌నార్హం. ముఖ్యంగా దేశ వాణిజ్య రాజ‌ధానిగా ఉన్న ముంబైలో వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీనికి ప్రధానంగా పెద్దనోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటివి ప్రభావం చూపాయి. ఇక‌, దేవేంద్ర ఫ‌డ్నవీస్ ప్రభుత్వం రైతుల‌కు ఇచ్చిన హామీలు కూడా నెర‌వేర్చలేదు. చిన్నపాటి వ‌ర్షానికే ముంబై మునిగిపోవ‌డం, లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం కావ‌డం, ఆశించిన స్థాయిలో ప‌రిశ్రమ‌లు కూడా పుంజుకోక‌పోవ‌డం వంటివి ప్రధానంగా బీజేపీ ప్రభుత్వానికి మైన‌స్‌గా మారిపోయింది.

కరువు పీడిత ప్రాంతంగా…

ఇక మాహారాష్ట్రలోని మ‌ర‌ఠ్వాడా ప్రాంతంలో ప్రజ‌లు క‌రువు కోర‌ల్లో చిక్కుకుని విల‌విల్లాడుతున్నారు. ఏడాదిన్నర నుంచి ఇక్కడ ప్రజ‌లు తాగు, సాగునీటికి కూడా తీవ్రంగా ఇబ్బందులు ప‌డ్డారు. ఆ టైంలో ప్రభుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంది. ఇటీవ‌ల ప‌రిస్థితి కొంత మెరుగుప‌డినా ఆ ప్రాంతంలో బీజేపీ తీవ్ర వ్యతిరేక‌త‌తో కొట్టుమిట్టాడుతోంది. ఇక ఔరంగాబాద్ జిల్లాలో మ‌జ్లీస్ బీజేపీకి స‌వాల్ విసురుతోంది. ఇక్కడ గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోనే ఎంఐఎం ఔరంగాబాద్ ఎంపీ సీటు గెలుచుకుంది. త్వర‌లోనే జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో త‌మ స‌త్తాచాటాల‌ని కాంగ్రెస్‌, ఎన్సీపీ వంటి కీల‌క పార్టీలు కూడా చ‌క్రం తిప్పుతున్నాయి.

అన్నీ ఎలా ఉన్నా….

అయితే, శివ‌సేన‌తో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్లడం, ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ పుంజుకోక‌పోవ‌డం, ఇటీవ‌ల పార్లమెంటు ఎన్నిక‌ల్లోనూ కాంగ్రెస్ స‌త్తా చాట‌లేక పోవ‌డం వంటి కార‌ణాలు బీజేపీకి ఆశ‌లు చిగురించేలా చేస్తున్నాయి. వ్యూహాత్మకంగా పావులు క‌దిపేందుకు ప్రధాని న‌రేంద్ర మోడీ, బీజేపీ సార‌థి.. అమిత్ షాలు కూడా ఇక్కడ ప్రచారానికి సిద్ధ‌మ‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ.. ప్రతిప‌క్షాల్లో కూట‌మి లేకపోవ‌డం, పాల‌న‌పై దేవేంద్ర ఫ‌డ్నవీస్ ప‌ట్టు సాధించ‌డం, ప్రధాని మోడీ ఇమేజ్ వంటివి ప్రభావం చూపించే ఛాన్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. దీంతో మ‌హాతీర్పు బీజేపీకి అనుకూలించే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News