అనుమానం నిజమైందిగా

జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ అనుకున్నట్లుగానే జరుగుతుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఇటీవల మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో పట్టున్న దేవెగౌడ [more]

Update: 2019-07-07 17:30 GMT

జనతాదళ్ ఎస్ అధినేత దేవెగౌడ అనుకున్నట్లుగానే జరుగుతుంది. మధ్యంతర ఎన్నికలు వస్తాయని ఇటీవల మాజీ ప్రధాని దేవెగౌడ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జాతీయ రాజకీయాల్లో పట్టున్న దేవెగౌడ కర్ణాటక రాష్ట్ర రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను చూసిన తర్వాత ఆయనకు ఖచ్చితంగా ఫిరాయింపులు ఉంటాయని పసిగట్టారు. ఫిరాయింపులు కాకుంటే రాజీనామాలు చేసైనా ప్రభుత్వాన్ని కూలదోస్తారని ఆయన అంచనా వేశారు.

అంచానా కరెక్ట్ గా…..

దేవెగౌడ అంచనా నిజమే అయింది. తనయుడు కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేయాలని దేవెగౌడ తొందరరపడలేదు. కాంగ్రెస్ తో మైత్రిని ఆయన కర్ణాటక శాసనసభ ఫలితాలు వచ్చిన తొలి రోజే వ్యతిరేకించారు. అయితే భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రాకుండా అడ్గుకునేందుకే ఆయన ఈ మైత్రికి అంగీకరించారని చెబుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు గులాం నబీ ఆజాద్ వంటి నేతలను తన ఇంటికి రప్పించుకుని మరీ తనయుడిని సీఎంగా చేశారు.

తొలి నుంచి జాగ్రత్తగా….

అయితే కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కూడా బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలందరినీ కర్ణాటకకు రప్పించగలిగారు. ఇలా దేవెగౌడ తొలి నుంచి పరోక్షంగా కుమారస్వామికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ అంతర్గత విభేదాలు, అసంతృప్తులపైన కూడా దేవెగౌడ హస్తినలో రాహుల్ గాంధీతో భేటీ అయి ఎప్పటికప్పుడు తన వద్ద ఉన్న సమాచారాన్ని పంచుకుంటున్నారు.

సొంత పార్టీ నేతలు…..

కానీ లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం బీజేపీ అధికారంలోకి రావడంతో బేరసారాలు జరుగుతాయని ఊహించారు. మధ్యంతర ఎన్నికలు వస్తాయని దేవెగౌడ అందుకే చెప్పారంటున్నారు. అయితే దేవెగౌడ తన పార్టీ నుంచి ఎమ్మెల్యేలు జారి పోతారని మాత్రం ఊహించలేదు. పార్టీలో కుటుంబ సభ్యుల ప్రమేయం పెరిగిపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందంటున్నారు. పార్టీకి చెందిన విశ్వనాథ్ ఈ ఆపరేషన్ వెనక ఉన్నారని దేవెగౌడ అనుమానిస్తున్నారు. మొత్తం మీద దేవెగౌడ అనుమానించినట్లే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News