పెద్దాయనా… పెద్దాయనా…?

పెద్దాయనకు ఆఖరుసారి పోటీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. దేవెగౌడ స్వయంకృతాపరాధంతోనే ఇన్ని కష్టాలు వచ్చాయన్నది రాజకీయ పక్షాల నుంచి వస్తున్న వ్యాఖ్యలు. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన [more]

Update: 2019-05-24 17:30 GMT

పెద్దాయనకు ఆఖరుసారి పోటీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. దేవెగౌడ స్వయంకృతాపరాధంతోనే ఇన్ని కష్టాలు వచ్చాయన్నది రాజకీయ పక్షాల నుంచి వస్తున్న వ్యాఖ్యలు. జనతాదళ్ ఎస్ ను స్థాపించిన తర్వాత కర్ణాటకలో దేెవెగౌడ తనదైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీని బలీయమైన కేంద్రంగా మలచగలిగారు. సొంతంగా అధికారంలోకి రాలేకపోయినా.. కింగ్ మేకర్ గా అనేకసార్లు రుజువు చేసుకున్నారు. అయితే కుటుంబ పార్టీగా ముద్రపడటం, కుల పార్టీగా మిగిలిపోవడం దేవెగౌడకు ఈ లోక్ సభ ఎన్నికలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి.

తుముకూరు నుంచి…

దేవెగౌడ పోటీ చేసిన తుముకూరు నియోజకవర్గం నుంచి దారుణ ఓటమిని చవి చూశారు. కర్ణాటకలో కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు ఉండటంతో కాంగ్రెస్, జేడీఎస్ లు కలసి పోటీ చేశాయి. ఇరవై ఒక్క స్థానాల్లో కాంగ్రెస్, ఏడు స్థానాల్లో జేడీఎస్ లు బరిలోకి దిగాయి. అయితే అన్ని చోట్ల రెండు పార్టీల క్యాడర్ ఒకరి కొకరు సహకరించుకోలేదన్న వార్తలు మొదట్లోనే వచ్చాయి. ఓట్ల బదిలీ సక్రమంగా జరగలేదు. ముందుగానే సంకేతాలు కన్పించినా ఇరు పార్టీల నేతలు లైట్ గానే తీసుకున్నారు.

ముగ్గురు దిగి….

ఈ ఎన్నికల్లో దేవెగౌడ కుటుంబం నుంచి ముగ్గురు బరిలోకి దిగారు. తుముకూరు నుంచి దేవెగౌడ, మాండ్య నియోజకవర్గం నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ, హాసన్ నుంచి రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ బరిలోకి దిగారు. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు బరిలోకి దిగడం, మనవళ్లను తాను బతికుండగానే రాజకీయనేతలుగా చూడాలన్న అత్యాశకు దళపతి పోయారన్నది నిజం. ఆయన తాను ఎప్పుడూ గెలిచే హాసన్ ను మనవడు ప్రజ్వల్ కు విడిచిపెట్టి తుముకూరుకు షిప్ట్ అయ్యారు.

జాతీయ స్థాయిలో…..

దేవెగౌడ కు ఓటమి కొత్తేమీ కాకపోయినప్పటికీ ఈ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రాజకీయం నడపాలని భావించారు. సంకీర్ణ సర్కార్ పరిస్థితి బాగా లేకపోవడంతో కుమారస్వామి పదవిని నిలబెట్టడానికి తాను హస్తినలో ఉండి కంట్రోల్ చేయాలని అనుకున్నారు. కానీ హస్తినలో కాంగ్రెస్ సర్కార్ దారుణంగా ఓటమిపాలు కావడం, కర్ణాటకలో కూటమి కుదేలవ్వడంతో దేవెగౌడ దిగాలు పడ్డారు. ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం ఒక్కటే. సంకీర్ణ సర్కార్ ను కాపాడటం. కుమారస్వామికి పదవీ గండం లేకుండా చేయడం. మరి అది సాధ్యమవుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News