దేవెగౌడకు అందుకే అలా సపోర్ట్ చేసిందా?

కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దుకుంటోంది. కర్ణాటకలో జేడీఎస్ తో భవిష్యత్తు లోనూ స్నేహహస్తం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. జేడీఎస్ అధినేత హెచ్ డి దేవెగౌడను రాజ్యసభకు [more]

Update: 2020-06-14 17:30 GMT

కాంగ్రెస్ చేసిన తప్పును సరిదిద్దుకుంటోంది. కర్ణాటకలో జేడీఎస్ తో భవిష్యత్తు లోనూ స్నేహహస్తం ఇవ్వాలని ఆ పార్టీ నిర్ణయించింది. జేడీఎస్ అధినేత హెచ్ డి దేవెగౌడను రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. ఇది కాంగ్రెస్ లో కొంత ఇబ్బంది కర పరిణామమైనా అంగీకరించక తప్పని పరిస్థితి. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ కుప్పకూలిపోవడానికి సిద్ధరామయ్య కారణమని జేడీఎస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

సిద్దూ వర్సెస్ జేడీఎస్…..

తొలినుంచి సిద్ధరామయ్యకు, జేడీఎస్ కు పడదు. ఆయన జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చి ముఖ్యమంత్రి కాగలిగారు. అయితే గత ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటంతో సిద్ధరామయ్యను ఒప్పించి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే కాంగ్రెస్ అనుకున్నట్లుగా కర్ణాటకలో జరగలేదు. పథ్నాలుగు నెలల్లోనే పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వీరంతా బీజేపీలో చేరిపోయారు. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది సిద్ధరామయ్య అనుచరులే.

పార్లమెంటు ఎన్నికల్లోనూ…..

అంతేకాకుండా గత పార్లమెంటు ఎన్నికల్లో దేవెగౌడ ఓటమి పాలయ్యారు. అక్కడ దేవెగౌడ ఓటమికి కాంగ్రెస్ నేతలే కారణమంటూ అప్పట్లో దేవెగౌడ సయితం ఆరోపించారు. దీంతో జేడీఎస్, కాంగ్రెస్ ల మధ్య దూరం పెరిగింది. వచ్చే ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేస్తామని దేవెగౌడ ప్రకటించారు. జేడీఎస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను నియమించుకున్నారు. జేడీఎస్ ను దువ్వే కార్యక్రమంలో భాగంగా దేవెగౌడకు మద్దతివ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా…..

రాజ్యసభ ఎన్నికల్లో దేవెగౌడ పోటీ చేస్తున్నారు. కర్ణాటకలో మొత్తం నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. రాజ్యసభకు ఎన్నిక కావాలంటే 44 మంది సభ్యుల మద్దతు అవసరం. జేడీఎస్ కు కేవలం 34 మంది సభ్యులే ఉన్నారు. మిగిలిన పది మంది సభ్యుల మద్దతు కాంగ్రెస్ నుంచి లభించనుంది. భవిష్యత్ రాజకీయాల దృష్ట్యా దేవెగౌడను వదులుకోలేని కాంగ్రెస్ ఆయనకు మద్దతివ్వాలని నిర్ణయించింది. ఈ నెల 19వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

Tags:    

Similar News