దళపతి స్కూలా? మజాకా…?

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ జాతీయ పార్టీల హవా కన్పిస్తున్నా ప్రాంతీయ పార్టీ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. అనేక సార్లు [more]

Update: 2021-08-05 16:30 GMT

కర్ణాటక రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి. ఇక్కడ జాతీయ పార్టీల హవా కన్పిస్తున్నా ప్రాంతీయ పార్టీ కూడా ఏమాత్రం తక్కువ తినలేదు. అనేక సార్లు అధికారంలోకి వచ్చింది. జాతీయ పార్టీల సహకారంతో కింగ్ మేకర్ గా ఎదిగింది. జనతాదళ్ ఎస్ స్థాపించిన నాటి నుంచి దేవెగౌడ పార్టీని విజయవంతంగా నడుపుతున్నారనుకోవాలి. మూడు సార్లు ముఖ్యమంత్రి పదవి జేడీఎస్ కు దక్కించుకోవడంతో దళపతి దేవెగౌడ పాత్ర ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమంత్రులుగా…?

ఇక్కడ మరో ప్రస్తావన అవసరం. దేవెగౌడ స్కూలు నుంచి వచ్చిన వారు ముఖ్యమంత్రులుగా ఎదగడమూ చెప్పుకోవాల్సి ఉంటుంది. జేడీఎస్ స్థాపన కుటుంబ పార్టీగానే జరిగింది. కేవలం ఒక సామాజికవర్గం, కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పార్టీగా జేడీఎస్ ను అంటారు. దీనిని ఉప ప్రాంతీయ పార్టీగా కూడా అభివర్ణిస్తారు. ఒక్కలిగ సామాజికవర్గం నేతగా ఎదిగిన దేవగౌడ అనూహ్య పరిస్థితుల్లో ప్రధాని కూడా కాగలిగారు. ఆయన కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు.

సిద్ధరామయ్య అక్కడి…..

కాగా దేవెగౌడ స్కూల్ లో శిక్షణ పొంది రాజకీయ నాయకుడిగా ఎదిగిన సిద్ధరామయ్య కాంగ్రెస్ లో చేరి ముఖ్యమంత్రి కాగలిగారు. సిద్ధరామయ్య రాజకీయ పాఠాలు నేర్చుకుంది కూడా దేవెగౌడ వద్దనే. అయితే అక్కడ ఇమడలేక సిద్ధరామయ్య కాంగ్రెస్ లో చేరారు. అదృష్టం కలసి వచ్చి కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ లో ఐదేళ్ల పాటు పూర్తికాలం కొనసాగిన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య రికార్డును కూడా సృష్టించారు.

అక్కడ పాఠాలు నేర్చుకుని….

ఇక తాజాగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన బసవరాజ్ బొమ్మై సయితం జనతాదళ్ స్కూల్ నుంచి వచ్చిన వారే. జనతాదళ్ యు నుంచి వచ్చిన ఆయన తర్వాత బీజేపీలో చేరారు. 2008లో వివిధ కారణాలతో బీజేపీలో చేరిన బసవరాజు బొమ్మై ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన తండ్రి జనతాదళ్ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం బీజేపీలో చేరి అనతికాలంలోనే మంత్రి పదవులను దక్కించుకోగలిగారు. మొత్తం మీద కర్ణాటకలో జనతా పరివార్ స్కూల్ నుంచి ఇంకెంతమందిని ముఖ్యమంత్రులను చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News