దేనికైనా రెడీ

మాజీ ప్రధాని దేవెగౌడ దూకుడు పెంచతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తన స్వరాన్ని పెంచుతున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని [more]

Update: 2019-09-07 18:29 GMT

మాజీ ప్రధాని దేవెగౌడ దూకుడు పెంచతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తన స్వరాన్ని పెంచుతున్నారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టేలా ఆయన ముందుకు వెళుతున్నారు. కర్ణాటకలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టానికి సాయం అందించాలని దేవెగౌడ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే తాను ఢిల్లీలో పోరాటం చేస్తాననికూడా పిలుపునిచ్చారు. కేంద్రం సాయం చేయకుండా కర్ణాటక రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందన్నది ఆయన ప్రధాన ఆరోపణ.

కేంద్రానికి హెచ్చరికలు….

ఇందుకోసం తనపార్టీ కార్యకర్తలతో కలసి ఆందోళనకు దిగుతానని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. దేవెగౌడ ఇప్పుడు పార్టీని చక్కదిద్దే పనిలో పడ్డారు. వరసగా రెండు ఎన్నికలలో చతికల పడిన పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశముందని ఆయనఅంచనా వేస్తున్నారు. జమిలి ఎన్నికలు జరిగినా, బీజేపీ ప్రస్తుత ప్రభుత్వం కుప్ప కూలిపోయినా మధ్యంతర ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇదే విషయాన్ని పార్టీ కార్యకర్తల సమావేశాల్లో పదే పదే చెబుతున్నారు.

రెండింటికీ సమదూరం….

మరోవైపు కాంగ్రెస్, బీజేపీతో సమదూరం పాటించాలని దేవెగౌడ నిర్ణయించారు. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికలు తనకు, పార్టీకి గుణపాఠం నేర్పాయని ఆయన భావిస్తున్నారు. కాంగ్రెస్, జనతాదళ్ ఎస్ లు కలసి లోక్ సభ లో పోటీ చేసినా ఓట్ల బదిలీ జరగలేదు. పైగా స్వయంగా తాను కూడా ఓటమి పాలు కావాల్సి వచ్చింది. దీంతో ఆయన ఏ ఎన్నిక జరిగినా ఇక జేడీఎస్ ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని దాదాపుగా సంకేతాలు ఇచ్చేశారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఒంటరిపోరు వైపే మొగ్గు చూపుతుంది. ఎప్పటిలాగానే ఎన్నికల అనంతరం పొత్తులే మేలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.

ఎప్పుడైనా సరే….

ఈ నేపథ్యంలో దేవెగౌడ కు తన తనయుడు కుమారస్వామి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తలనొప్పిగా మారింది. కుమారస్వామి హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఇప్పటికే ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. దీంతో దేవెగౌడ కొంత ఆందోళన చెందుతున్నారు. అందుకే కేంద్రంపై యుద్ధమే బెటరన్ననిర్ణయానికి వచ్చారు. నిత్యం కార్యకర్తలతో సమావేశమవుతూ దేవెగౌడ పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నంచేస్తున్నారు. 17 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగినా, మధ్యంతర ఎన్నికలు వచ్చినా ఎప్పుడైనా రెడీ అంటూ పెద్దాయన వైరి పక్షాలకు సవాల్ విసురుతున్నారు.

Tags:    

Similar News