పీకల్లోతు కష్టాల్లో పడిపోయారే?

అధికారాంతమున చూాడాలి య్యవారి అసలైన పరిస్ధితి… అన్న పాత తెలుగు సామెత రాజకీయ నాయకులకు నూటికి నుారు శాతం వర్తిస్తుంది. అధికారంలో ఉన్నపుడు నిబంధనలకు విరుధ్దంగా ఇష్టారాజ్యంగా [more]

Update: 2020-03-17 16:30 GMT

అధికారాంతమున చూాడాలి య్యవారి అసలైన పరిస్ధితి… అన్న పాత తెలుగు సామెత రాజకీయ నాయకులకు నూటికి నుారు శాతం వర్తిస్తుంది. అధికారంలో ఉన్నపుడు నిబంధనలకు విరుధ్దంగా ఇష్టారాజ్యంగా వ్యవహరించే పాలకులు అధికారాంతాన అందుకు తగ్గ ప్రతిఫలాన్ని అనుభ వించాల్సి ఉంటుంది. పదవిలో ఉండగా కన్నుమీను కానకుండా వ్యవహరించిన వారు మాజీలైన తరువాత ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. వివాదాలు, విచారణలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి కావడం అనివార్యం. దాదాపు మాజీలైన ప్రతిఒక్కరికి ఈ చేదు అనుభవాలు అనివార్యం అవుతాయి.

ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా…..

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిదేళ్ల పాటు చక్రంతిప్పిన యువనేత, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవిస్ ఇప్పుడు ఇదే పరిస్ధితిని ఎదుర్కొంటున్నారు. వసంత్ దాదా పాటిల్ తరవాత అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసిన రెండో ము‌ఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ చరిత్ర సృష్టించారు. 2019 చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కుాటమి విజయం సాధించినప్పటికీ సీఎం పదవి కావాలని
జూనియర్ భాగస్వామి అయిన శివసేన పేచీ పెట్టడంతో దేవేంద్ర ఫడ్నవిస్ కు సమస్యలు ప్రారంభమయ్యాయి. 2019 నవంబరు 23న రెండోసారి సీఎంగా తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ మెజార్టీ లేక ముాడు రోజుల్లోనే పదవి నుంచి వైదొలగాల్సివచ్చింది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కాలక్షేపం చేస్తున్నారు.

యాక్సిస్ బ్యాంకు కేసులో….

విదర్భ కేంద్రమైన నాగ్ పూర్ లోని పశ్చిమనియెాజకవర్గంనుంచి అసెంబ్లీకి ఎన్నికైన ఈ బ్రాహ్మణ నేత దేవేంద్ర ఫడ్నవిస్ న్యాయపరంగా అనేక చిక్కులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేసిన పొరపాట్లు, తప్పులు ఆయనను వెంటాడుతున్నాయి. ప్రస్తుతం వీటినుంచి ఎలా బయటపడాలో దిక్కుతోచక దిగాలు పడుతున్నారు. రెండు విషయాల్లో ఆయన న్యాయస్ధానాల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి నుంచి బయటపడేందుకు న్యాయనిపుణులతో సంప్రదిస్తున్నారు. అధికారంలో ఉండగా పోలీసు వేతనాల చెల్లింపు బిల్లును యాక్సిస్ బ్యాంకుకు మార్చడంపై బాంబే హైకోర్టు దేవేంద్ర ఫడ్నవిస్ కు అక్షింతలు వేసింది. ఈ విషయమై దాఖలైన కేసులో నోటీసులు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి వ్యవహరించారని మెాహినిస్, జబల్ పూర్ అనేవ్యక్తి దా‌ఖలుచేసిన వ్యాజ్యాలకు హైకోర్టు స్పందించింది. ము‌ఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ భార్య అమృత యాక్సిస్ బ్యాంక్ లో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నందున ఇలా వ్యవహరించారని పిటీషనర్ ఆరోపించారు. ప్రభుత్వ రంగ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వ బ్యాంకుల ద్వారానే చెల్లించాలని నిబంధనలో పేర్కొంటున్నా దేవేంద్ర ఫడ్నవిస్ అనుచితంగా వ్యవహరించారన్నది ఆరోపణ. ఈ కేసును వాదించిన హైకోర్టు డివిజన్ బెంచ్ లోని న్యాయముార్తులు జస్టిస్ రవిదేశ్ పాండే, అమిత్ బోర్కర్ లు అఫిడవిట్లు దాఖలు చేయాలని హోంశాఖ అదనపు ముఖ్యకార్యదర్శి, డీజీపీలకు నోటీసులు జారీ చేశారు.

ఎన్నికల అఫడవిట్ లో…..

ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం పేర్కొన్నారన్న ఆరోపణలకు సంబందించి దేవేంద్ర ఫడ్నవిస్ సుప్రీంకోర్టు నుంచి చిక్కులు ఎదుర్కొంటున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపైగ ల రెండు క్రిమినల్ కేసుల సమాచారాన్ని అఫిడవిట్ లో పేర్నొనలేదని సతీష్ ఊకే అనే వ్యక్తి గత ఏడాది అక్టోబరులో నాగ్ పూర్ కోర్టులో కేసువేశారు. అయితే కేసు నమెాదుకు న్యాయస్ధానం నిరాకరించింది. ఈ విషయమై హైకోర్టు సైతం దేవేంద్ర ఫడ్నవిస్ కు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయన ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని ఉల్లంఘించలేదని పేర్కొంది. దీంతో పిటీషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు దేవేంద్ర ఫడ్నవిస్ పై కేసు నమోదు చేయాలని నాగ్ పూర్ న్యాయస్ధానాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 ఎ ప్రకారం న్యాయస్ధానం దేవేంద్ర ఫడ్నవిస్ కు నోటీసులు జారీచేసింది. దీనిపై ఆయన మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అవి రాజకీయ ప్రేరేపిత కేసులని, తనపై గల ఇతర కేసులను దాచిపెట్టలేదని ఆయన సుప్రీంకోర్టులో వాదించారు. న్యాయస్ధానం ఈవాదనను తోసిపుచ్చండంతో క్రిందికోర్టులో విచారణకు మార్గం సుగమమైంది. దీంతో కేసులనుంచి ఎలా బయటపడాలన్న విషయమై దేవేంద్ర ఫడ్నవిస్ తర్జనభర్జనలు పడుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News