దేవ్ మూవీ రివ్యూ

బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్ నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, నిక్కీ గల్రాని, రమ్యకృష్ణ, అమృత శ్రీనివాసన్, రేణుక తదితరులు మ్యూజిక్ డైరెక్టర్: హరీష్ [more]

Update: 2019-02-14 08:21 GMT

బ్యానర్: ప్రిన్స్ పిక్చర్స్
నటీనటులు: కార్తీ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రకాష్ రాజ్, నిక్కీ గల్రాని, రమ్యకృష్ణ, అమృత శ్రీనివాసన్, రేణుక తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్: హరీష్ జైరాజ్
సినిమాటోగ్రఫీ: ఆర్ వేల్ రాజ్
నిర్మాత: ఠాగూర్ మధు
దర్శకత్వం: రజత్ రవిశంకర్

తమిళ స్టార్ హీరో కార్తీకి తెలుగులోనూ మంచి మర్కెట్ ఉంది. తాను తమిళ్ లో చేసిన ప్రతి సినిమాని కార్తీ తెలుగులోనూ డబ్ చేసి విడుదల చేస్తూ వస్తున్నాడు. అలా తెలుగుతెరకు కార్తీ కొత్తేమి కాదు. ఇక నాగార్జునతో కలిసి కార్తీ ఊపిరి సినిమాని వంశి పైడిపల్లి దర్శకత్వంలో చేసాడు. కార్తీకి సూర్య, రజినీకాంత్, అజిత్, విజయ్ అంత స్టార్ డం లేకపోయినా… కార్తీ సినిమాలకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన గత చిత్రాలు చినబాబు, ఖాకీ తెలుగులోనూ మంచి కలెక్షన్స్ తెచ్చాయి. ఖాకి సినిమాలో కార్తీ – రకుల్ ప్రీత్ కాంబినేషన్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా కార్తీ మరోసారి హీరోయిన్ రకుల్ ప్రీత్ తో జోడి కట్టాడు. రజత్ రవిశంకర్ దర్శకత్వంలో దేవ్ అనే ప్రేమకథ చిత్రంలో నటించాడు. సూపర్ క్లాస్ లుక్ లో కార్తీ, హాట్ లుక్ లో రకుల్ ప్రీత్ లు ఆకట్టుకున్నారు. కార్తీ, రకుల్ కాంబో ఖాకీతో సూపర్ హిట్ అనిపించుకుంది. మరి దేవ్ తో కూడా ఈ జంట సూపర్ హిట్ కొట్టిందా లెదా అనేది సమీక్షలో తెలుసుకుందాం.

కథ

దేవ్ సినిమాని కథగా చెప్పాలి అంటే… అందులో పెద్దగా ఏం కనబడదు. ఓ అన్నంత ట్విస్టులు కానీ, హార్ట్ టచ్చింగ్ ఎమోషన్ కానీ కనిపించదు. దేవ్ కథలోకి వెళితే… అడ్వెంచర్స్ ని ఇష్టపడే దేవ్(కార్తీ) మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని కలలు కంటాడు. అయితే ఈలోపు దేవ్, మేఘన(రకుల్ ప్రీత్) అనే యంగ్ బిజినెస్ విమెన్ తో ప్రేమలో పడతాడు. కానీ దేవ్ ని మేఘన ప్రేమించదు. మేఘనని ప్రేమలో పడెయ్యడానికి దేవ్ రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. మేఘనని ప్రేమిస్తూనే దేవ్ మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి ట్రైనింగ్ తీసుకుంటాడు. మరి దేవ్ మౌంట్ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాడా? మేఘన, దేవ్ లవ్ యాక్సెప్ట్ చేస్తుందా? అసలు మేఘన, దేవ్ ని ప్రేమించకపోవడానికి కారణాలేమిటి? అనేది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు

కార్తీ అడ్వంచెర్స్ చేసే దేవ్ పాత్రలో బాగా నటించాడు. అలాగే లవర్ బాయ్ లా.. రకుల్ ప్రీత్ ప్రేమ కోసం వెంటబడి కుర్రాడిలా కార్తీ మంచి పెరఫార్మెన్స్ ఇచ్చాడు. స్టైలిష్, క్లాస్ లుక్స్ లో కార్తీ చూడడానికి బాగున్నాడు. సింపుల్ డాన్స్ స్టెప్స్ తో కార్తీ పర్వాలేదనిపించాడు. ఇక రకుల్ ప్రీత్ ఎప్పటిలాగే హాట్ హాట్ గా గ్లామర్ లుక్ లో అదరగొట్టేసింది. కార్తీ – రకుల్ రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కార్తీ ఫాదర్ గా ప్రకాష్ రాజ్ మెప్పించాడు. రామలింగయ్య పాత్రలో ప్రకాష్ రాజ్ ఒదిగిపోయాడు. మేఘన మదర్ గా రమ్యకృష్ణ క్యారెక్టర్ పర్వాలేదనిపిస్తుంది. రమ్యకృష్ణ గ్లామర్ గా స్లిమ్ లుక్ లో అదరగొట్టేసింది. మిగతా క్యారెక్టర్స్ కి అంతగా స్కోప్ లేదు కానీ.. ఉన్నంతలో పర్వాలేదనిపిస్తారు.

విశ్లేషణ

దర్శకుడు రవిశంకర్ దేవ్ సినిమాతో డైరెక్టర్ గా కోలీవుడ్ తెరకి పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమానే చినబాబు, ఖాకి సినిమాల హిట్ తో ఉన్న కార్తీ తో దేవ్ చేసాడు రవిశంకర్. అయితే దర్శకుడు దేవ్ స్క్రిప్ట్ అడ్వెంచర్స్ తో కూడిన లవ్ స్టోరీ గా మల్చాలనుకున్నాడు. కానీ ఆ విషయంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. అసలు దేవ్ సినిమా గురించి చెప్పడానికేం లేదు. దర్శకుడు అసలు ఎలాంటి స్టోరీ లైన్ తీసుకుని సినిమా చెయ్యాలనుకున్నాడు అనేది అర్ధం కాదు. హీరోకి అడ్వెంచర్స్ మీదున్న ఇంట్రెస్ట్ ని హైలెట్ చేస్తూ సినిమా మొత్తం నడిపించేద్దామనుకున్నాడు. మధ్యలో హీరోయిన్ తో ప్రేమ అనేది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చప్పగా అనిపిస్తుంది. అడ్వంచర్ షాట్ తో మొదలైన సినిమా… కార్తీ స్నేహితులతో గడిపే క్షణాలు, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఉక్రెయిన్ కి వెళ్లడం, బిజినెస్ విమెన్ అయిన రకుల్ ని ప్రేమించడం… అలా ఫస్ట్ హాఫ్ అంతా నీరసంగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కూడా అంతంత మాత్రంగానే అనిపిస్తుంది. రకుల్ ని ప్రేమలోకి దింపడం, అలాగే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి శిక్షణ తీసుకోవడం… ఇలా అంతగా ఆకట్టుకోలేని విధంగా కథ, కథనంతో దర్శకుడు ఈ దేవ్ ని మలిచాడు. ట్విస్ట్ లు కానీ, ఎమోషనల్ సీన్స్ కానీ ఎక్కడా కనిపించవు. అసలు అక్కడక్కడా కొన్ని సీన్లు తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోడానికి ఏమీ ఉండదు. మరి కొన్ని సీన్లు అయితే వాటిని ప్రేక్షకుడు ముందే అంచనా వేసేస్తాడు. దర్శకుడు తాను తీసుకున్న హీరో రోల్ ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది. అలాగే సినిమాకి ఇచ్చిన క్లైమాక్స్ కూడా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోదు. దర్శకుడిగా అనుభవం లేని రవిశంకర్ వల్ల సినిమాకి దర్శకత్వలోపం అడుగడుగునా కనిపిస్తుంది. మరి కార్తీ – రకుల్ ఖాకీతో సూపర్ హిట్ కొట్టి.. దేవ్ తో డిజాస్టర్ అందుకున్నట్టే కనబడుతుంది.

సాంకేతిక వర్గం పనితీరు

ఇక సాంకేతికంగా దేవ్ సినిమాకి హరీష్ జైరాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించినా… పాటల విషయంలో మాత్రం తేలిపోయేలా చేసాడు. దేవ్ పాటలు ఏమాత్రం ఆకట్టుకొని విధంగా ఉంటాయి. కాకపోతే విజువల్ గా చూస్తే పర్వాలేదనిపిస్తాయి. ఇక ఆర్ వేల్ రాజ్ మాత్రం తన కెమరాతో సినిమాని రిచ్ గా చూపించాడు. మౌంట్ ఎవరెస్టు కానీ, సాంగ్స్ కానీ ఇలా ప్రతి ఫ్రేమ్ ని తన కెమరాతో అందంగా చూపించాడు. ఈ సినిమాకి ఎడిటింగ్ మాత్రం మైనస్. చాలా సీన్స్ కత్తెరవెయ్యాల్సింది కానీ వదిలేశారు. ఇక నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్: కార్తీ లుక్స్, రకుల్ గ్లామర్, కొన్ని అడ్వంచర్ సన్నివేశాలు

మైనస్ పాయింట్స్: దర్శకత్వం, కథ, కథనం. మ్యూజిక్, ఎడిటింగ్, క్లైమాక్స్

రేటింగ్: 2.0/5

Tags:    

Similar News