ఎవరినీ వదిలపెట్టడం లేదుగా… చివరకు పోలీసులనూ?

లాక్ డౌన్ పుణ్యమా అని నేరాలు కాస్త తగ్గినప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఒక్క క్లిక్ తో ఇతరుల ను మభ్య పెట్టడమే కాకుండా [more]

Update: 2020-09-21 18:29 GMT

లాక్ డౌన్ పుణ్యమా అని నేరాలు కాస్త తగ్గినప్పటికీ సైబర్ నేరగాళ్లు మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఒక్క క్లిక్ తో ఇతరుల ను మభ్య పెట్టడమే కాకుండా వారి నుండే డబ్బులు రాబడుతున్నారు. సామాన్యుల నుండి మొదలుకొని ఎంపీలు ఎమ్మెల్యేలు ఐపీఎస్ లు, ఐఏఎస్ ల దాకా అందరినీ బురిడీ కొట్టిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. ఓటిపి లో నుండి మొదలు కొని సోషల్ మీడియా ప్లాట్ ఫారం వేదికగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్న సైబర్ ఫ్రాడ్ గాళ్ళ తో జర బద్రం.

అకౌంట్ ఉంటే చాలు….

ప్రపంచవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయి. టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ టెక్నాలజీతో నేరాలకు పాల్పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్క సోషల్ మీడియా అకౌంట్ ఉంటే చాలు ఎంతటివారినైనా సైతం బురిడి కొట్టించవచ్చని నిరూపిస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. సామాన్యుల నుండి బ్యూరోక్రాట్స్ దాకా అందరిని తమ వలలో పడేస్తున్నారు. వారికి తెలియకుండానే వారి పేరుమీద నకిలీ ఖాతాలు సృష్టించడమే కాదు వారి పేరుతో చాటింగ్ చేస్తూ స్నేహితులకు మెసేజ్ లు పంపిస్తూ డబ్బులు కాజేచేస్తున్నారు. తెలంగాణ లో ఇటీవల చోటుచేసుకుంటున్న వరుస ఘటనలతో పోలీసు యంత్రాంగం అలర్ట్ అయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు పోలీస్ అధికారుల పేరుమీద నకిలీ అకౌంట్లను తెరిచి వారే మాట్లాడుతున్నట్టు అవతల వారిని నమ్మించి డబ్బు అవసరం ఉన్నట్టు నటించి సొత్తు కాజేచేస్తున్నారు.

నల్గొండ ఎస్పీ ఫేస్ బుక్ ను…

నల్గొండ ఎస్పీ రంగనాథ్ ఫేప్ బుక్ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. గత రెండు సంవత్సరాల క్రితం వరకు ఎస్పీ రంగనాథ్ వాడిన ఫేప్ బుక్ ఖాతా ను ఆయన మూసి వేశారు .అయితే దీన్నే అదునుగా చేసుకున్న సైబర్ ఫ్రాడ్ గాళ్లు అదే పేరుతో కొత్తది క్రియేట్ చేసి ఆయన పాత అకౌంట్ లో ఉన్న ఫ్రెండ్ లిస్ట్ అందరికీ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశారు. చాలా మంది కి ఆఫీసర్ సుపరిచితుడు కావడంతో యాక్సెప్ట్ చేశారు. అలా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిన వారితో చాటింగ్ చేయడం మొదలు పెట్టారు. మొదట మామూలుగా మెసేజ్ మొదలుపెట్టి ఆ తర్వాత తనకు అత్యవసరంగా 20000 కావాలంటూ తన భార్య ఖాతాలోకి డబ్బులు పంపాలంటూ ఫోన్ నెంబర్ పెట్టారు.ఇది నమ్మిన కొందరు డబ్బులు పంపించగా అనుమానం వచ్చిన మరికొందరు మాత్రం సదరు ఆఫీసర్ కి ఫోన్ చేసి విషయం తెలుసుకున్నారు. తన ఫేస్ బుక్ రెండు సంవత్సరాల నుండి వాడటం లేదని ఎస్పీ రంగనాథ్ ప్రకటన చేశారు. తన పేరుమీద నకిలీ ఖాతా క్రియేట్ చేశారని ఆయన తెలిపారు.. డబ్బులు పంపమని అగంతకులు ఇచ్చిన ఫోన్ నెంబర్ ట్రేస్ చేయగా ఒడిశాలోని అనిత అనే యువతి పేరు మీద ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

పోలీసు అధికారుల పేరు మీద…

ఇక మరో ఘటనలో సిద్దిపేట్ ట్రాఫిక్ ఏసీపీ బాలాజీ పేరు మీద నకిలీ ఖాతా తెరిచి ఫేస్ బుక్ మెసెంజర్ లో ఒక వ్యక్తి తో చాట్ చేసి 20,000 అర్జంట్ గా కావాలని తన నంబర్ పెట్టాడు..ఇంకో ఘటన లో యాదద్రి జిల్లా లో సీఐ బాలా గంగి రెడ్డి పేరు మీద నకిలీ ఖాతా తెరిచి డబ్బులు వసూలు చేశారు..ఇక వికారాబాద్ మోమింపెట్ సీఐ నగేష్ పేరు మీద కూడా నకిలీ ఖాతా తెరిచారు.అతని పేరు మీద చాట్ చేసి నలుగురు వ్యక్తుల నుండి డబ్బు రాబట్టారు..మరో వ్యక్తికి ఎంత ఉంటే అంతా పంపాలి అని చెప్పడంతో అనుమానం వచ్చిన వ్యక్తి సదరు ఆఫీసర్ కి ఫోన్ చేసి అడగటంతో విషయం బయట పడింది.

ముఠానా? ఒకరేనా?

సామాన్యులకు బురిడి కొట్టించడం నుండి వీరిని పట్టుకునే పోలీస్ ల దాకా ఎవరిని వదలట్లేదు మాయ గాళ్లు..పోలీస్ శాఖ లో ఉన్నతాధికారులను సైతం బురిడి కొట్టించి సొత్తు కజేస్తున్న ముఠా పై తెలంగాణ పోలీస్ యంత్రాంగం ఇప్ప టి కే అలెర్ట్ అయ్యింది..త్వరలోనే అగంతలకులను పట్టుకొనున్నట్టు పోలీసులు తెలిపారు. అయితే ఇదంతా చేస్తుంది ఒకరేనా లేక ముఠా గా ఏర్పడి చేస్తున్నారా అనేది మరి కొన్ని రోజుల్లో పోలీస్ ల విచారణ లో బయట పడనుంది.

నమ్మ బలుకుతూ…..

పోలీసులకు ప్రజలపై ఉన్న నమ్మకాన్ని సైబర్‌ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. వారి ఖాతాలో ఉన్న వారికి మళ్లీ రిక్వెస్టులు పంపిన నేరగాళ్లు.. వాటిని అంగీకరించగానే వీరి పని మొదలు పెడుతున్నారు. మొదటగా కొన్ని రోజులు చాట్‌ చేస్తున్నారు. సదరు స్నేహితుడ్ని కుశల ప్రశ్నలు అడగడంతో పాటు.. తన పనితీరు ఎలా ఉందని అడుగుతున్నారు. తియ్యని మాటలతో ఎదుటివారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అంతపెద్ద అధికారి తనతో ఈ విధంగా మాట్లాడుతుండటంతో వారి మధ్య సన్నిహిత్యం మరింత పెరుగుతోంది. ఆ తర్వాత తనకు డబ్బు అవసరం పడిందని, ఇప్పుడు ఇస్తే కొన్ని గంటల్లో తిరిగి ఇచ్చేస్తానంటూ నమ్మబలుకుతున్నారు. వెంటనే తనకు సంబంధించి ఈ-వ్యాలెట్‌ల నంబర్లను పంపించి.. సదరు ఖాతాకు పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.తక్కువైతే అనుమానం రాదని..ఎక్కువ మొత్తం అయితే అసలుకే మోసం వస్తుందని భావించిన నేరగాళ్లు.. తక్కువ మొత్తాలను డిమాండ్‌ చేస్తున్నారు. కేవలం రూ.5వేల నుంచి రూ.10 వేల వరకు అడుగుతున్నారు. అంతపెద్ద అధికారి డబ్బు సర్దుబాటు కాకపోవడంతోనే అడుగుతున్నారనే భావన ఎదుటివారిలో కల్పిస్తున్నారు. వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసు అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News