జగన్…లెక్క సరిచూసుకో

వైసీపీ అధినేతగా జగన్ పాదయాత్రతో పాటు, అయిదేళ్ళ కాలంలో ప్రతిపక్ష నేతగా అనే చోట్ల పర్యటించారు. ఆయన సందర్భాలను బట్టి ఆయన హామీలను కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు. [more]

Update: 2019-08-08 02:00 GMT

వైసీపీ అధినేతగా జగన్ పాదయాత్రతో పాటు, అయిదేళ్ళ కాలంలో ప్రతిపక్ష నేతగా అనే చోట్ల పర్యటించారు. ఆయన సందర్భాలను బట్టి ఆయన హామీలను కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు. తనకు అధికారం ఇస్తే ప్రజలకు మేలు చేస్తానని జగన్ చెప్పుకున్నారు. ఇపుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన చెప్పిన మాట ప్రకారం నవరత్నాలను హామీలుగా ముందుంచుకుని పాలన సాగిస్తున్నారు. వాటిని తప్పక నెరవేరుస్తానని అంటున్నారు. చాలా వరకూ హామీల మీద జగన్ నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మరి జగన్ ఇచ్చిన హామీలన్నీ నవరత్నాలేనని వైసీపీ నేతలు అంటున్నారు. తమ మ్యానిఫేస్టోలో చెప్పిన వాటిని తప్పకుండా అమలుచేసి చూపిస్తామని కూడా చెబుతున్నారు.

కళా వారి మాట ఇదీ….

జగన్ హామీలు ఒక్క నవరత్నాలే అని తప్పించుకుంటే కుదరదని మాజీ మంత్రి , ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు అంటున్నారు. జగన్ వందల కొద్దీ హామీలు ఇచ్చి జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని ఆయన హాట్ కామెంట్స్ చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలను కూడా తప్పుతున్నారని ఆయన అంటున్నారు. అమ్మ ఒడి స్కీం తో పాటు, పించన్లు మూడు వేలు చేస్తామని చెప్పి 2,250 మాత్రమే ఇస్తున్నారని, మాట తప్పారని నిలదీస్తున్నారు. ఇక జగన్ తాను ఇచ్చిన హామీలు మరచిపోయారేమోకానీ తమ వద్ద లెక్క పక్కాగా ఉందని కూడా కళా అంటున్నారు. మరి కళా లెక్కబెట్టారో ఏమో కానీ జగన్ ఇచ్చిన హామీలు ఈ అయిదేళ్లలోనూ 272 ఉన్నాయంట. అందులో నవరత్నాలు మాత్రమే హామీలని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, మాట తప్పని జగన్ అన్ని హామీలూ నెరవేర్చాల్సిందేనని కళా డిమాండ్ చేస్తున్నారు.

చినబాబు లెక్క ఇదీ….

ఇక తెలుగుదేశం భావినాయకుడు లోకేష్ జగన్ హామీల చిట్టాను పద్దుగా రాసి దగ్గర ఉంచుకున్నట్లుగా ఉంది. జగన్ నవరత్నాల హామీలు మాత్రమే తనవని తప్పుకోవాలనుకుంటే కుదరదు అని గట్టిగా చెబుతున్నారు. జగన్ ఆరు వందలకు పైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, ఆ వివరాలు అన్నీ తన దగ్గర ఉన్నాయని కూడా నోరు పెద్దది చేస్తున్నారు. జగన్ హామీలు ఆయనకు గుర్తు లేకపోయినా తమకు ఉన్నాయని కూడా చినబాబు అనడం విశేషం. ఏ ఒక్క హామీ తీర్చకపోయినా తాము జనంతో కలసి నిలదీస్తామని కూడా చెబుతున్నారు.

ఐదేళ్ల హామీల మాట….

మరో వైపు చంద్రబాబు కూడా జగన్ హామీలు నెరవేర్చడం లేదని అంటున్నారు. హామీలు ఇచ్చేముందే చేయగలమా లేదా అని చూసుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు. జగన్ హామీల సంగతి పక్కన పెడితే అసలు టీడీపీ గత అయిదేళ్లలో ఎన్ని హామీలు ఇచ్చిందో బాబులిద్దరితో బాటు కళాకు ఏమైనా గుర్తుందా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీరా మాకు చెప్పేది అని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీ తమ నాయకుడు తీరుస్తాడని కూడా గట్టిగా చెబుతుననారు.

Tags:    

Similar News