ఆ ఆటలు ఇక్కడ సాగుతాయా?

అన్ని రాష్ట్రాలూ వేరు. తమిళనాడు వేరు. ఇక్కడ ప్రాంతీయ భావం ఎక్కువ. భాషా మమకారం మరింత ఎక్కువ. హిందీ అంటేనే తమిళనాడువాసులకు చిరాకు. హిందీలో తప్ప మరే [more]

Update: 2020-11-28 17:30 GMT

అన్ని రాష్ట్రాలూ వేరు. తమిళనాడు వేరు. ఇక్కడ ప్రాంతీయ భావం ఎక్కువ. భాషా మమకారం మరింత ఎక్కువ. హిందీ అంటేనే తమిళనాడువాసులకు చిరాకు. హిందీలో తప్ప మరే భాషను అనర్గళంగా మాట్లాడలేరు అమిత్ షా. పైగా తమిళనాడుకు మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ద్రావిడ పార్టీలు ఎక్కువ. విగ్రహారాధనను అసలే నమ్మరు. బీజేపీ మాత్రం విగ్రహారాధనపైనే ఆధారపడి ఉంటుంది. మతతత్వం, సెంటిమెంట్ ను రగిలించేందుకు తమిళనాడులో ఏ మాత్రం అవకాశాలు లేవు.

తమిళనాడులో మాత్రం…..

అలాంటి తమిళనాడులో అమిత్ షా ఎలా పార్టీని విజయపధం వైపు నడపగలుగుతారన్న చర్చ ఆసక్తికరంగా సాగుతుంది. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలదే హవా. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ ను నిలువరించేందుకు అమిత్ షా తన శక్తియుక్తులను ఉపయోగించారు. కానీ తమిళనాడులో మాత్రం కాంగ్రెస్ నామమాత్రమే. ఇక్కడ డీఎంకే ను ఢీకొనాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా దండయాత్ర చేస్తున్న బీజేపీకి తమిళనాడులో పట్టుచిక్కడం అంత సులువుకాదన్నది మాత్రం వాస్తవం.

పొత్తు కొత్తేమీ కాదు….

తమిళనాడులో ఇటీవల అమిత్ షా పర్యటించారు. బీజేపీ, అన్నాడీఎంకే పొత్తు పై క్లారిటీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకేతోనే కలసి వెళుతుందని ప్రకటించారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఈ కూటమి పోటీ చేసి డీఎంకే చేతిలో దారుణంగా దెబ్బతినింది. బీజేపీ ఒక్క స్థానంలోనూ గెలుచుకోలేకపోయింది. అనేక స్థానాల్లో తన పెరఫార్మెన్స్ ను కూడా చూపలేకపోయింది. ఇప్పుడు కొత్తగా కలసి వచ్చేది ఏంటన్నది మాత్రం సందేహమే.

మిగిలిన రాష్ట్రాల్లో లాగా…..

అయితే అక్కడ అమిత్ షా రాజకీయ వ్యూహాలపైనే ఆసక్తి నెలకొంది. డీఎంకేను నిలువరించాలంటే ఆళగిరిని తొలుత మంచి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే రజనీకాంత్ లాంటి ఇమేజ్ ఉన్న నేతల సహకారం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అమిత్ షాకు ఇక్కడ ఎంతవరకూ సాధ్యమనేది చూడాల్సి ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లో విడదీసి లబ్ది పొందిన బీజేపీ ఆటలు తమిళనాడులో సాగుతాయా? అన్నది అనుమానమే. మరి అమిత్ షా వ్యూహాలు ఏమేరకు తమిళనాడులో సఫలమవుతాయో చూడాల్సి ఉంది.

Tags:    

Similar News