Damacharla : దేవుడా… జనసేనతో జట్టు కుదర్చవూ?

తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు వచ్చే ఎన్నికల్లో కుదిరితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తీవ్రంగా నష్టపోతారు. మరికొందరు లాభపడతారు. అయితే పొత్తుల్లో భాగంగా సీటు తమకు [more]

Update: 2021-10-18 00:30 GMT

తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు వచ్చే ఎన్నికల్లో కుదిరితే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు తీవ్రంగా నష్టపోతారు. మరికొందరు లాభపడతారు. అయితే పొత్తుల్లో భాగంగా సీటు తమకు దక్కితే చాలు అనుకునే నేతలు ఉన్నారు. వారిలో ఒకరు దామచర్ల జనార్థన్. తొలిసారి ఎమ్మెల్యేగా దామచర్ల జనార్థన్ 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. దాదాపు పదిహేనేళ్ల తర్వాత టీడీపీ 2014లో ఒంగోలు నియోజకవర్గం నుంచి గెలిచింది.

వైసీపీికి స్ట్రాంగ్ హోల్డ్….

అయితే ఈ నియోజకవర్గంలో కులాల ఓట్లే శాసిస్తాయి. అన్ని సామాజికవర్గాల ఓట్లు ఇక్కడ బలంగానే ఉండటంతో గెలుపోటములు చివరి వరకూ అంచనా వేయడం కష్టమే. కాంగ్రెస్, వైసీపీల నుంచి ప్రస్తుత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి 1999 నుంచి 2019 వరకూ ఉప ఎన్నికతో కలుపుకుని ఐదుసార్లు గెలిచారు. కాంగ్రెస్ బలహీనమైన తర్వాత వైసీపీ ఇక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఏర్పరచుకుంది. అందుకే దామచర్ల జనార్థన్ జనసేనతో పొత్తు కుదిరితే బాగుంటుందని వేయి దేవుళ్లకు మొక్కుకుంటున్నారు.

అభివృద్ధి పైనే…..

2019 ఎన్నికల్లో దామచర్ల జనార్థన్ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై దాదాపు 13 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఒంగోలులో అభివృద్ధి జరగలేదని, కనీసం మంచినీళ్లు రోజు మార్చి రోజు ఇవ్వలేకపోతున్నారని దామచర్ల జనార్థన్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాము అధికారంలో ఉండగా వేసిన రహదారులే ఇప్పటికీ దర్శనమిస్తున్నాయని రోడ్ల ఫొటోలతో ఆయన సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.

కులాలదే కీలక పాత్ర….

అయితే ఒంగోలు నియోజకవర్గంలో కులాలు ఎక్కువగా కీలక పాత్ర పోషిస్తాయి. కమ్మ వర్గం ఓటర్లు 23 వేల మంది ఉన్నారు. కాపుు సామాజిక వర్గానికి చెందని ఓటర్లు 19 వేలు ఉన్నాయి. ఇక యాదవులు కూడా అధిక సంఖ్యలో 23 వేల మంది ఓటర్లున్నారు. దళిత ఓటర్లు 43 వేల మంది వరకూ ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం ఓటర్లు పదిహేను వేల వరకూ ఉన్నారు. దీంతో జనసేన, టీడీపీ కలిస్తే తనకు ఈసారి విజయం ఖాయమని దామచర్ల జనార్థన్ గట్టిగా భావిస్తున్నారు. పొత్తు కుదిరితే ఒంగోలు సీటును వదులుకోబోమని కూడా ఆయన సన్నిహితులకు స్పష్టం చేస్తున్నారు.

Tags:    

Similar News