ఆ….బ్రదర్స్ కు బాబు మార్క్ షాక్‌…!

టీడీపీలో కొన్ని ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరిలోనూ అత్యంత అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికి అంతా తామైన వారు కూడా ఉన్నారు. [more]

Update: 2020-10-06 05:00 GMT

టీడీపీలో కొన్ని ద‌శాబ్దాలుగా చ‌క్రం తిప్పుతున్న నాయ‌కులు చాలా మంది ఉన్నారు. వీరిలోనూ అత్యంత అంకిత భావంతో పార్టీ అభ్యున్నతికి అంతా తామైన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో దామ‌చ‌ర్ల కుటుంబం ఒక‌టి. ప్రకాశం జిల్లాలో గ‌డిచిన ఐదేళ్ల చంద్రబాబు పాల‌న‌లో అంతా తామై.. వ్యవ‌హ‌రించింది ఈ కుటుంబమే. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న దామ‌చ‌ర్ల జ‌నార్దన్‌, ఆయ‌న సోద‌రుడు స‌త్య. ఇద్దరూ కూడా క్రియాశీల నాయ‌కులుగా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రించే నేత‌లుగా కూడా గుర్తింపు సాధించారు. 2012 ఉప ఎన్నిక‌ల నుంచే జ‌నార్థన్ ప్రకాశం జిల్లా రాజ‌కీయాల‌ను శాసిస్తూ వ‌చ్చారు.

ఓటమి పాలయిన నాటి నుంచి….

2014 ఎన్నిక‌ల్లో జ‌నార్థన్ ఒంగోలులో బాలినేనిని ఓడించ‌డంతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండ‌డంతో ఆయ‌న హ‌వా ప్రారంభ‌మైంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో మంత్రిగా సిద్ధా రాఘ‌వ‌రావు ఉన్నా జ‌నార్థనే చ‌క్రం తిప్పారు. ఇక జ‌నార్థన్ సోద‌రుడు స‌త్య కూడా షార్ప్ షూట‌ర్‌గా పార్టీలో త‌లెత్తిన స‌మ‌స్యల‌ను ప‌రిష్కరించ‌డంలో ముందున్నారు. కొండ‌పి రాజ‌కీయాల‌న్ని స‌త్య క‌నుస‌న్నల్లోనే న‌డిచాయి. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో దామ‌చ‌ర్ల ఓట‌మితోపాటు.. ప్రకాశం జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాలు టీడీపీ నుంచి జారిపోయాయి. ఇక‌, అప్పటి నుంచి దామ‌చ‌ర్ల కుటుంబం ఒకింత నైరాశ్యంలో ఉంది.

ఎందుకు పక్కన పెట్టారు?

పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న జ‌నార్థన్ ఒంగోలులో ఓడిపోయారు. ఇక ఈ కుటుంబం సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన కొండ‌పిలో మాత్రం టీడీపీ ముక్కుతూ మూలుగుతూ గెలిచింది. అయితే, తాజాగా ప్రక‌టించిన‌ పార్లమెంట‌రీ జిల్లా ప‌ద‌వుల విష‌యంలో త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌ని.. త‌మ‌కు గుర్తింపు ల‌భిస్తుంద‌ని అనుకున్నారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఒక‌రిద్దరికి చంద్రబాబు ఈ ఛాన్స్ ఇచ్చారు. అయితే, దామ‌చ‌ర్ల విష‌యానికి వ‌స్తే.. వీరిని ప‌క్కన పెట్టారు. దీనికి కార‌ణ‌మేంటి? ఎందుకు ఈ బ్రద‌ర్స్‌ను ప‌క్కన పెట్టారు ? అనే ప్రశ్నలు ప్రకాశం టీడీపీలో చ‌ర్చనీయాంశంగా మారాయి.

నేతలు మారిపోతున్నా…..

అయితే, ప‌రిశీల‌కులు చెబుతున్న దాని ప్రకారం.. స‌త్య ప‌రోక్షంగా వైసీపీ నేత‌ల‌తో క‌లిసి ప‌నిచేస్తున్నార‌ని, దీనిని అడ్డుకోవ‌డంలో జ‌నార్దన్ దృష్టిపెట్టలేద‌ని అంటున్నారు. ఇక జ‌నార్థన్ కూడా పార్టీ ఓడిపోయాక జిల్లాలో పార్టీని స‌మ‌న్వయం చేయ‌లేక‌పోయార‌ని.. ఇప్పటికే చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం లాంటి నేత‌లు పార్టీ మారిపోగా మ‌రి కొంద‌రు పార్టీ నేతలు కూడా వైసీపీ బాట‌లోనే ఉన్నారు. వీరిని కంట్రోల్ చేయ‌క‌పోవ‌డం జ‌నార్థన్‌కు ఒక మైన‌స్ అయితే ప‌క్కనే ఉన్న బాప‌ట్ల పార్లమెంట‌రీ జిల్లా ప‌గ్గాలు క‌మ్మ వ‌ర్గానికి చెందిన ప‌రుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబ‌శివ‌రావుకు ఇవ్వడంతో ఒంగోలును బీసీకి ఇవ్వడంతో జ‌నార్థన్‌కు షాక్ త‌ప్పలేదు. ఇక జనార్థన్ సోద‌రుడు స‌త్యకు కందుకూరు లేదా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ ప‌గ్గాలు ఇస్తార‌నుకున్నా బాబు ఇవ్వలేదు. ఏదేమైనా జిల్లా టీడీపీలో ద‌శాబ్దాలుగా కీల‌కంగా ఉన్న దామ‌చ‌ర్ల కుటుంబానికి ఇది పెద్ద షాకే అనుకోవాలి.

Tags:    

Similar News