జగన్ ఎత్తుకెళ్ళిన ఓటు బ్యాంక్ కు గండిపడుతుందా?

కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ ఉంది. ఒక విధంగా ఈ దేశంలో ఏ పార్టీకి లేని బ్యాంక్ అది. అగ్ర కులాలుగా ఉన్న బ్రాహ్మణులు. [more]

Update: 2020-09-22 05:00 GMT

కాంగ్రెస్ పార్టీకి అతి పెద్ద ఓటు బ్యాంక్ ఉంది. ఒక విధంగా ఈ దేశంలో ఏ పార్టీకి లేని బ్యాంక్ అది. అగ్ర కులాలుగా ఉన్న బ్రాహ్మణులు. అట్టడుగున ఉన్న దళితులు. ఈ రెండు సామాజికవర్గాలను తనలోన పొదువుకోవడం కాంగ్రెస్ కంటే మరో పార్టీకి చేతకాదని చెప్పాలి. ఈ రోజు బీజేపీ అగ్ర వర్ణాల పార్టీగా ఉంది, బీసీలు కొన్ని చోట ఆదరించవచ్చు కానీ ఓట్ల చీలిక ద్వారానే ఆ పార్టీ అధికారంలోకి వస్తోంది అన్నది నిజం. ఇక ఏపీలో కాంగ్రెస్ ద్వారా ఒక్క కాపులు, కమ్మలు తప్ప అనేక సామాజికవర్గాలు ముఖ్యమంత్రి పదవులు అందుకున్నారు.

దళితుల ఓట్లుట ….

కాంగ్రెస్ కి దళితులకు అవినాభావ సంబంధం ఉంది. మహాత్ముడు వేసిన పునాది అది. హరిజనులను పురజనులుగా మార్చి దేవాలయ ప్రవేశం వారికి కల్పించి అందరివారుగా దళితులను ముందుకు తెచ్చారు. ఇక వారిని స్వాతంత్ర పోరాటంలో కూడా కలుపుకున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ తో దళితుల బంధం పెనవేసుకుపోయింది. ఇక నెహ్రూ, ఇందిరాగాంధీ వారు చేసిన అనేక సామాజిక, సంక్షేమ కార్యక్రమాల వల్ల కూడా దళితులు కాంగ్రెస్ లో అంతర్భాగమయ్యారు. అటువంటి దళితులను ముందు ఉత్తరాదిన కాంగ్రెస్ కోల్పోయింది, తరువాత దక్షిణాదిన కూడా కోల్పోయింది. ఏపీలో చూసుకుంటే వైఎస్సార్ తో పాటే వారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇపుడు ఆయన కుమారుడు జగన్ వెంట నడుస్తున్నారు. వారికి గట్టి భరోసా ఇచ్చే నేతగా జగన్ ఉండడం వల్లనే వారు అంతా వైసీపీలో కొనాగుతున్నారు. ఇదీ మన పార్టీ అనుకుంటున్నారు. ఇపుడు ఆ దళిత ఓట్లు అన్నీ మావి అంటున్నారు పీసీసీ చీఫ్ శైలజానాధ్.

వెనక్కి వస్తారా ….?

దళితులు ఒకసారి విశ్వాసం చూపిస్తే ఆ పార్టీని దశాబ్దాల తరబడి ఆదరిస్తారు. ఇది కాంగ్రెస్ ను చూస్తే అర్ధమవుతుంది. అక్కడ సరైన లీడర్ షిప్ లేక వైఎస్సార్ కుటుంబాన్ని దళితులు అభిమానించి కొనసాగుతున్నారు. పైగా వైఎస్సార్ కుటుంబంలో ఉన్న వారు అంతా ఆచరణలో దళితుల మీద ప్రేమను చూపించారు. వారిని కులాంతర వివాహంగా దళితులను చేసుకుని తమ‌ ఆదర్శాన్ని చాటుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే వైఎస్సార్ తమ వాడు అని దళితులు భావిస్తారు. అటువంటి దళిత ఓటు బ్యాంక్ ని వెనక్కు రప్పిస్తామని శైలజానాధ్ అంటున్నారు. వారంతా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అని కూడా చెబుతున్నారు. అదే నిజం అనుకుంటే రెండు ఎన్నికల్లో దళితుల ఓట్లు ఎందుకు కాంగ్రెస్ కి పడలేదో ఆయనే చెప్పాలి.

చిల్లు పెట్టే కుట్ర…..

కాంగ్రెస్ వైఎస్సార్ పోయిన తరువాత సొంత అస్థిత్వాన్ని కోల్పోయింది. ఆ తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కలలో కూడా కాంగ్రెస్ తో కలవలేని టీడీపీతో చేతులు కలిపి పాలన సాగించారు. ఎన్నో చీకటి ఒప్పందాలు నాడు జరిగాయి. వైఎస్సార్ కుటుంబాన్ని వేధించేలా టీడీపీ చంద్రబాబు కాంగ్రెస్ పన్నిన కుట్రలు నాడు స్వయంగా దళితులు చూశారు, ఇక కాంగ్రెస్ తన రాజకీయం కోసం, మరీ ముఖ్యంగా వైఎస్సార్ కుటుంబాన్ని అణచడానికి ఎందాకైనా వెళ్తుంది. ఎవరితోనైనా చేతులు కలుపుతుంది అని గ్రహించబట్టే దళితులు ఆ పార్టీతో దశాబ్దాల బంధం తెచ్చుకుని వైసీపీలోకి వచ్చారు. ఇపుడు శైలజానాధ్ మా ఓటు బ్యాంక్ దళితులు అని చెప్పుకున్నా వారు వెనక్కి వచ్చేది లేదు. పైగా అదంతా గత వైభవంగానే చూడాల్సి ఉంటుంది. అంతే కాదు, బలమైన ఓటు బ్యాంక్ తో ఉన్న వైసీపీని తగ్గించడానికి టీడీపీని బతికించడానికి కాంగ్రెస్ నాయకులు వేసే మరో కొత్త ఎత్తుగడ ఇదని కూడా దళితులు గ్రహించబట్టే కాంగ్రెస్ కి దూరం జరుగుతున్నారని అంటున్నారు.

Tags:    

Similar News