జగన్ ను కలిసేందుకు ఇష్టపడటం లేదా?

రాజ‌కీయాల్లో ప్రత్యర్థుల ప‌ట్ల వైరం ఉంటుంది. అయితే, ఇప్పుడు మారుతున్న ప‌రిస్థితిలో ఏ పార్టీ నేత ఎవ‌రితో గొడ‌వ‌లు ప‌డుతున్నాడో కూడా చెప్పలేని ప‌రిస్థితి. సొంత పార్టీ [more]

Update: 2019-07-21 08:00 GMT

రాజ‌కీయాల్లో ప్రత్యర్థుల ప‌ట్ల వైరం ఉంటుంది. అయితే, ఇప్పుడు మారుతున్న ప‌రిస్థితిలో ఏ పార్టీ నేత ఎవ‌రితో గొడ‌వ‌లు ప‌డుతున్నాడో కూడా చెప్పలేని ప‌రిస్థితి. సొంత పార్టీ నేత‌పై కారాలు మిరియాలు నూరుతున్న నాయ‌కులు నేటి రాజ‌కీయా ల్లో మ‌న‌కు క‌నిపిస్తున్నాయి. నాలుగు గోడ‌ల మ‌ధ్య చ‌ర్చించుకుని, ప‌రిష్కరించుకోవాల్సిన స‌మ‌స్యలు కూడా నేడు ప‌బ్లిక్ అయిపోతున్నాయి. సో.. రాజ‌కీయాల్లో ఎవ‌రు ఎవ‌రితోనైనా గొడ‌వ‌లు ప‌డొచ్చు.. ఎక్కడైనా తిట్టిపోసుకోవ‌చ్చు.. అనే సంస్కృతి పెరిగిపోతోంది. ఇక‌, విష‌యానికి వ‌స్తే.. ప్రకాశం జిల్లా ప‌రుచూరుకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ కుటుంబం ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు ఫ్యామిలీలోనూ ఇప్పుడు పొలిటిక‌ల్ ర‌చ్చ సాగుతున్నట్టు స‌మాచారం.

ఏ పార్టీలో చేరకుండా….

టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ పెద్ద అల్లుడు అయిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు. టీడీపీతో రాజ‌కీయ ప్రస్థానం ప్రారంభించారు. త‌ర్వాత ఆయ‌న స‌తీమ‌ణి, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి అప్పటి కాంగ్రెస్ నేత‌, దివంగ‌త వైఎస్ ఆహ్వానం మేర‌కు కాంగ్రెస్‌లోకి చేరారు. ఈ క్రమంలోనే ఆమె ముందు బాప‌ట్ల ఎంపీగా ఆ త‌ర్వాత విశాఖ నుంచి ఎంపీగా విజ‌యం సాధించి కేంద్రంలో మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. అయితే, త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఆమె కాంగ్రెస్‌కు దూర‌మ‌య్యారు. అదే టైంలో కాంగ్రెస్ నుంచి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే పురంద్రేశ్వరి 2014 ఎన్నిక‌ల్లో బీజేపీలో చేరిపోయారు. క‌డ‌ప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు.. ఏ పార్టీలోనూ చేర‌కుండా కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయారు.

వైసీపీలో చేరినా….

అయితే, ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. త‌న కుమారుడు చెంచురామ్‌కు వైసీపీ త‌ర‌పున ప‌రుచూరు టికెట్ ఇప్పించుకోవాల‌ని భావించారు. అయితే, పౌర‌స‌త్వం వివాదం కార‌ణంగా చివ‌రి నిముషంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావు పోటీ చేసి.. టీడీపీ నేత ఏలూరి సాంబ‌శివ‌రావుపై ఓడిపోయారు. ఇక‌, ఈ తాజా ఎన్నిక‌ల్లో త‌న కోరిక మేర‌కు బీజేపీ నుంచి విశాఖ ఎంపీ టికెట్‌ను సొంతం చేసుకుని పోటీ చేసిన పురందేశ్వరి గెలుపు గుర్రం ఎక్కలేక పోయారు. క‌ట్ చేస్తే.. ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో రెండు రాజ‌కీయ పార్టీలు కొలువ‌దీర‌డం వీరిద్దరి మ‌ధ్య వివాదానికి దారితీస్తోంది. భార్య ఒక పార్టీ, భ‌ర్త మ‌రో పార్టీలో ఉండ‌డంతో ఆయా పార్టీల్లో వీరికి ఎలాంటి గుర్తింపు ల‌భించ‌డం లేదు.

ప్రాధాన్యత లేదా….?

పురందేశ్వరి బీజేపీలో ఉన్న నేప‌థ్యంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావుకు వైసీపీ త‌గిన ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఆయ‌న పరుచూరులో ఓడిపోయిన త‌ర్వాత ఇప్పటి వ‌ర‌కు జ‌గ‌న్ ఆయ‌న‌ను ప‌ల‌క‌రించింది లేదు. ఇక‌, పురందేశ్వరి బీజేపీలో ఉన్నా.. ఆమె భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వర‌రావును బీజేపీలోకి చేర్చకుండా.. పార్టీని బ‌లోపేతం చేస్తాన‌ని వ్యాఖ్యానించ‌డం, పార్టీ స‌భ్యత్వ న‌మోదును గ‌ణ‌నీయంగా పెంచుతాన‌ని అన‌డం ద్వారా పురందేశ్వరి ప‌లుచ‌న అవుతున్నారు. ముందు మీ భ‌ర్తను బీజేపీలో చేర్పించొచ్చు క‌దా! అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ఇద్దరి మ‌ధ్య రెండు పార్టీల వివాదం తార‌స్థాయిలో న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో త్వర‌లోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటార‌ని అంటున్నారు. ఏం జ‌రుగుతుందో చూడాలి. వెంక‌టేశ్వర‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ రాష్ట్రంలోను, పురందేశ్వరి పార్టీ కేంద్రంలోను అధికారంలో ఉన్న నేప‌థ్యంలో వీరిద్దరూ సంయుక్తంగా ఏ పార్టీకి జై కొడ‌తారో చూడాలి.

Tags:    

Similar News