“దాడి” మొదలెట్టారు

అవును కదా నిజమే కదా అనిపించే విధంగా లాజిక్ తో కూడిన ఘాటైన విమర్శను విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చంద్రబాబు మీద [more]

Update: 2020-01-11 05:00 GMT

అవును కదా నిజమే కదా అనిపించే విధంగా లాజిక్ తో కూడిన ఘాటైన విమర్శను విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చంద్రబాబు మీద చేశారు. రాజధాని, లక్ష కోట్లు అంటూ పెద్దగా గొంతు చేసుకుంటున్న చంద్రబాబు తన అయిదేళ్ళ పాలనతో ఎందుకు అక్కడ శాశ్వత నిర్మాణాలు కట్టలేదంటూ గద్దించారు. అందుకోసం అవసరమైన నిధులు లేవా బాబూ అంటూ అయిదేళ్ళ పాలనలో అక్షరాలా రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు, ఆ సొమ్ము ఏమైందో చెప్పగలవా బాబూ అంటూ గట్టిగానే తగులుకుంటున్నారు.

ఎక్కడ పెట్టారు..?

ఏపీ విడిపోయిన సమయంలో తొంబై లక్షల కోట్ల అప్పుతో ఉంది. చంద్రబాబు గద్దె దిగిపోయే నాటికి ఆ అప్పు కాస్తా మూడున్నర లక్షల కోట్లకు ఎగబాకింది. అంటే చంద్రబాబు జమానాలో అయిదేళ్ళకు గానూ రెండున్నరల లక్షల కోట్లు అప్పుగా తెచ్చారని ఇట్టే తెలిసిపోతోంది. మరి ఇంత పెద్ద ఎత్తున తెచ్చిపెట్టిన అప్పు నుంచి కేవలం లక్ష కోట్ల రూపాయలు అమరావతి రాజధాని కోసం చంద్ర బాబు ఎందుకు ఖర్చు పెట్టలేదని దాడి గణాంకాలను సైతం ముందుంచి మరీ డిమాండ్ చేస్తున్నారు. అప్పు మాత్రం జనం నెత్తిన పెట్టారు, అమరావతిని కూడా అలాగే ఉంచేశారు, మరి సొమ్ము అంతా ఎక్కడ పెట్టారు, ఎక్కడ దాచారు అంటూ దాడి వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో వద్ద సమాధానం ఉందా?

విరాళాల తంతు….

ఇక చంద్రబాబు రాజధాని పరిరక్షణ పేరు మీద జోలె పట్టడాన్ని కూడా దాడి వీరభద్రరావు ఎకసెక్కం చేస్తున్నారు. ఇలా బిక్షాటన చేయడానికి సిగ్గుందా చంద్రబాబు అంటూ హాట్ కామెంట్స్ చేస్తున్నారు అప్పట్లో అమరావతి కట్టాలంటూ ప్రతీ ఇంటికీ వెళ్ళి విరాళాలు సేకరించారు. ఆఖరుకు స్కూలు పిల్లలను సైతం వదలకుండా పైసా పైసా లాగేశారు. ఆ సొమ్ము అంతా ఏమైందో ముందు లెక్కలతో సహా బయటపెట్టండి అంటూ చంద్రబాబుని డిమాండ్ చేశారు. ఇపుడు వసూల్ చేస్తున్న సొమ్ముకు కూడా వివరాలు చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని ఆయన అంటున్నారు. అమరావతి పేరు చెప్పి విరాళాలు అడగడం చంద్రబాబుకు అలవాటు అయిపోయిందని కూడా ఆయన మండిపడుతున్నారు.

విశాఖ ఊసెత్తొద్దు…

విశాఖలో రాజధాని వద్దని ఏవరు చెప్పారు చంద్రబాబూ అని కూడా దాడి నిలదీస్తున్నారు. ఎవరైనా నీ చెవిలో చెప్పారా, లేక నీవే అనుకుంటున్నావా అంటూ ఫైర్ అయ్యారు. విశాఖలో రాజధాని కావాలో వద్దో తేల్చుకోవాలంటే టీడీపీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యే తమ్ముళ్ళ చేతా ముందు రాజీనామాలు చేయించండి, అపుడు మీ సంగతి ప్రజలే తేలుస్తారు, అంతే తప్ప ఊకదంపుడు మాటలు ఆడుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడొద్దని దాడి సెటైర్లు వేశారు. అమరావతి రైతులను బలి తీసుకుంటున్నది కూడా చంద్రబాబేనని, వారిని ప్రభుత్వం వద్దను పోనీయకుండా సైంధవుడిలా అడ్డుపడుతున్నారని, ఆఖరుకి వారిని ఏమీ కాకుండా చేస్తున్నారని కూడా దాడి వీరభద్రరావు మండిపడ్డారు. మొత్తానికి రాజధాని లక్ష కోట్లు కాదు కానీ బాబు అప్పు చేసిన రెండున్నర లక్షల అప్పు గురించి బాగానే దాడి చేశారు.

Tags:    

Similar News