అమితుమికి రంగం సిద్ధం … అమిర్ తోనే అసలు గండం ?

ప్రపంచకప్ లో దాయాదుల పోరు ఫైనల్ మ్యాచ్ ను తలపిస్తుంది. అది లీగ్ దశ అయినా ఏ దశ అయినా భారత్ – పాక్ మ్యాచ్తరువాత ఇంగ్లాండ్ [more]

Update: 2019-06-16 03:30 GMT

ప్రపంచకప్ లో దాయాదుల పోరు ఫైనల్ మ్యాచ్ ను తలపిస్తుంది. అది లీగ్ దశ అయినా ఏ దశ అయినా భారత్ – పాక్ మ్యాచ్తరువాత ఇంగ్లాండ్ – ఆసీస్ ల నడుమ సాగే పోరాటాలు యుద్ధాన్నే తలపిస్తాయి. కప్ పోయినా ఫరవాలేదు ఈ నాలుగు దేశాలు తమ చిరకాల ప్రత్యర్థులపై విజయం సాధిస్తే చాలన్నది అభిమానుల ఆరాటం. అంతలా నడిచే యుద్ధం నేడు భారత్ – పాక్ మ్యాచ్ రూపంలో రానే వచ్చింది. మాంచెస్టర్ వేదికగా భారత్ – పాక్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు ముమ్మర సాధనే సాగించాయి. అయితే ప్రపంచ కప్ మ్యాచ్ లపై వరుణుడి పగ ఈ మ్యాచ్ పై కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇరు జట్ల అభిమానులను కలవరపరుస్తున్నాయి. ఉదయం చిరుజల్లులు మధ్యాహ్నం సూర్యుడు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నా ఇరు జట్లు పూర్తి స్థాయిలో తలపడేలా వరుణదేవుడు కరుణిస్తాడో లేదో చెప్పలేని పరిస్థితి.

ఆ రికార్డ్ ను టీం ఇండియా కాపాడుకోవాలి …

ప్రపంచ కప్ లో ఇప్పటివరకు పాక్ తో తలపడిన ప్రతీ మ్యాచ్ లో భారత్ దే పై చెయ్యిగా వుంది. అన్ని వరల్డ్ కప్ ల్లో ఆరు మ్యాచ్ లను ఇండియా గెలిచి క్లిన్ రికార్డ్ సాధించింది. ఈ రికార్డ్ ను నిలబెట్టుకునేందుకు ఎప్పుడెలా ఆడుతుందో తెలియని పాక్ ను కోహ్లీ సేన చిత్తు చేయాలిసి వుంది. ప్రపంచ కప్ మ్యాచ్ లలో పాక్ భారత్ పై ఆడేటప్పుడు తీవ్ర వత్తిడికి గురౌతుంది. టీం ఇండియా కసి గా ఓడిపోయే మ్యాచ్ లను సైతం వత్తిడిని జయించి గెలుస్తూ వస్తుంది. ఈసారి పాక్ టీం లో ప్రధానంగా అమిర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా స్లాగ్ ఓవర్లలో అమిర్ అతి తక్కువ పరుగులు ఇవ్వడమే కాదు వికెట్లను టప టప కూలుస్తు పాక్ కి వెన్నెముకగా నిలుస్తున్నాడు. తాజాగా ఆసీస్ తో జరిగిన మ్యాచ్ లో సైతం అమీర్ 5 వికెట్లు కూల్చి 350 పరుగులకు పైగా అలవోకగా చేస్తుందని విశ్లేషకులు భావించిన టీం ను 308 పరుగులకే తన అద్భుత బౌలింగ్ తో కట్టడి చేశాడు. అందుకే అమీర్ బౌలింగ్ పై పరిశీలన చేసి సరైన వ్యూహంతో దెబ్బకొట్టాలని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టీం ఇండియా కు సూచించాడు. అతడి బౌలింగ్ పరిశీలిస్తే బ్యాట్స్ మెన్ కి పరుగుల వరద ఖాయమని సలహా ఇచ్చాడు.

పటిష్ట భద్రత...

భారత్ – పాక్ నడుమ మ్యాచ్ కి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఐసిసి చేపట్టింది. ఇరు జట్ల అభిమానులు భారీ సంఖ్యలో ఈ మ్యాచ్ తిలకించేందుకు రానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ఏర్పాట్లను ఐసిసి చేపట్టింది. దీనికి తోడు తీవ్రవాద దాడులు వంటివి ఈ మ్యాచ్ పై వుండే అవకాశాలు వున్నాయన్న హెచ్చరికలతో ఐసిసి ఈ జాగర్తలు చేపట్టింది.

Tags:    

Similar News