స్వామి ముంగిట కమ్యూనిస్ట్ భక్తుడు ?

ఎర్రన్నల లోకేమే వేరు. వారు భౌతిక సిద్ధాంతాన్ని నమ్ముతారు. దేవుడు లేడు అంటారు. ఇక దేవుడే లేని చోట వారిని కొలిచే స్వాములూ మఠాలూ కామ్రేడ్స్ కళ్లకు [more]

Update: 2021-03-04 09:30 GMT

ఎర్రన్నల లోకేమే వేరు. వారు భౌతిక సిద్ధాంతాన్ని నమ్ముతారు. దేవుడు లేడు అంటారు. ఇక దేవుడే లేని చోట వారిని కొలిచే స్వాములూ మఠాలూ కామ్రేడ్స్ కళ్లకు ఎలా కనిపిస్తాయి. దాంతో వారికీ ఆశ్రమాలకు కడు దూరం. అయితే కొన్ని సార్లు మాత్రం కొందరు వామపక్షవాదులు సిద్ధాంతాలకు అతీతంగా ఆలయాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఆ మధ్యన ఎపుడో తిరుమల కొండ మీద కుటుంబ సమేతంగా సీపీఐ నారాయణ కనిపించి ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఆయన కుటుంబం మాత్రం స్వామిని దర్శించుకుంటే నారాయణ మాత్రం బయటే ఉండిపోయారు అది వేరే సంగతి.

స్వరూప సమక్షంలో …..

విశాఖలోని శారదాపీఠం అన్నది ఏపీలోనే ప్రఖ్యాతి చెందినది. ఇటీవల చంద్రబాబు నాయుడు ఈ పీఠం గురించి, స్వామీజీ మీద చేసిన హాట్ కామెంట్స్ తో ఒక్కసారి మరింత ఫోకస్ అయింది. రాజకీయ నాయకులు స్వామిని కలవడం ఆయన ఆశీర్వాదం పొందడం సాధారణమైన విషయమే. దానికి అప్పట్లో చంద్రబాబు అయినా ఆ తరువాత కేసీయార్, జగన్ అయినా అతీతులు కారు, కానీ సీపీఐ నారాయణ స్వరూపానందేంద్ర ఆశ్రమంలో ప్రత్యక్షం కావడం మాత్రం అందరికీ షాక్ తినిపించేదే.

ఎరుపు కాషాయమైందా …?

ఎరుపు రంగు అంటేనే కమ్యూనిస్టులకు మోజు. వారి ఉద్యమాలు కూడా ఎపుడూ నిప్పు కణికల్లా ఎర్రగానే ఉంటాయి. మరి కాషాయం రంగు అంటే వారికి ఎందుకో పడదు, అలాంటిది స్వామీజీ ఆశ్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ రావడం అంటే అది విశేషంగానే కాదు, ఒక సంచలనంగానే చూడాలి అంటున్నారు. నారాయణ స్వామీజీతో సంభాషించారు కూడా. మరి ఈ ఇద్దరి మధ్యన వచ్చిన చర్చలు ఏంటి అన్నది కూడా తెలియరావడంలేదు. ఏది ఏమైనా సీపీఐ ఒక పార్టీ గా రాజకీయమే చేస్తుంది. ఆ పార్టీ ఓట్లలో ఆస్తికులు కూడా ఉంటారు. అందువల్ల వారిని అట్రాక్ట్ చేయడానికి నారాయణ ఇలా చేశారా అన్నదే ఇక్కడ చర్చ.

సెంటిమెంట్ తోనా…?

ఇక స్వామీజీని కలిసిన వారికి రాజకీయంగా కలసివస్తుంది అని ఒక సెంటిమెంట్ ఉంది. దాంతో నారాయణ ఆ విధంగా కూడా స్వామీజీని కలసి ఉండవచ్చు అని అంటున్నారు. ఇదిలా ఉంటే నారాయణ ఆశ్రమానికి రావడం ఒక్కసారిగా ఏపీ రాజకీయాలో కలకలం రేపేలాగే ఉంది. స్వామిని దుర్భాషలాడుతూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ మధ్యనే ఘాటు విమర్శలు చేశారు. అటువంటి సమయంలో టీడీపీ పాత కొత్త మిత్రుడు నారాయ‌ణ ఇలా స్వామితో భేటీ వేయడం మాత్రం అనూహ్యమే అని అంటున్నారు.

Tags:    

Similar News