ప్రభుత్వ ప్రకటనలు ఇప్పుడే చూస్తున్నామా?

ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో ప్రభుత్వ ప్రకటనలపై వివాదం నడుస్తోంది. విషయం కోర్టులో ఉన్నందున దానిపై వ్యాఖ్య చేయదలచుకోలేదు. కానీ, ప్రభుత్వాలు మీడియాలో కానీ, [more]

Update: 2020-09-05 09:30 GMT

ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో ప్రభుత్వ ప్రకటనలపై వివాదం నడుస్తోంది. విషయం కోర్టులో ఉన్నందున దానిపై వ్యాఖ్య చేయదలచుకోలేదు. కానీ, ప్రభుత్వాలు మీడియాలో కానీ, ఇతరత్రా కానీ ప్రకటనలు చేయకుండా పరిపాలన సాగదు అని గమనించాలి. కొందరు వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చేదే విస్తృత ప్రచారం కోసం. ఈ ఏడు దశాబ్దాల స్వతంత్ర భారత దేశంలో ప్రచారం వద్దనుకునే రాజకీయనాయకులు చాలా అరుదు. మరీ ముఖ్యంగా గత మూడు, నాలుగు దశాబ్దాల్లో ఇలాంటివారి సంఖ్య బాగా పెరిగింది. తరిమెల నాగిరెడ్డిలు, పుచ్చలపల్లి సుందరయ్యలు, వావిలాల గోపాలకృష్ణయ్యలు, పేట బాపయ్యలు, వేముల కూర్మయ్యలు, మాగంటి అంకినీడులు ఇప్పుడెక్కడ దొరుకుతారు?

వారికి ప్రచారం అవసరం లేదు….

స్వాతంత్రం తర్వాత మరీ ముఖ్యంగా 1970 దశకం, అంటే నెహ్రూ, శాస్త్రిల తరం తర్వాత పాలకులకు ప్రజల్లో ప్రచారం అవసరం బాగా పెరిగింది. ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే కేంద్రంలో ఇందిరా గాంధీకి, రాష్ట్రంలో ఎన్టీఆర్ కు అంత పెద్ద ప్రచారం అవసరం లేకపోయింది. ఆ ఒక్క దూరదర్శన్, ఆకాశవాణి వారికి సరిపోయాయి. కానీ ఆ తర్వాత కేంద్రంలో వచ్చిన రాజీవ్ గాంధీకి కానీ, ఇక్కడ రాష్ట్రంలో వచ్చిన చంద్రబాబుకు గానీ ఈ మీడియా ప్రచారం చాలా ఎక్కువగానే అవసరపడింది.

రాజీవ్ గాంధీ…..

రాజీవ్ గాంధీ “My Heart Beats For India” అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుని ప్రజలకు దగ్గరకావాల్సి వచ్చింది. అప్పటికే ఇందిరా గాంధీ ఇమేజ్ కూడా ఆయనకు ఉన్నప్పటికీ ఈ ప్రచారం కొంత అదనంగా అవసరపడింది. అయితే ఈ ప్రచారం ఖర్చు మొత్తం కాంగ్రెస్ పార్టీ భరించింది. ఇక రాష్ట్రంలో 1995లో ఎన్టీఆర్ ని అధికారం నుండి దించేసాక ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పెద్దఎత్తున ప్రచారానికి తెరలేపారు. ఇటు పత్రికల్లో, అటు హోర్డింగులు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కూడా చాలా విస్తృతంగా ప్రచారం చేశారు.

చంద్రబాబుకు అవసరపడింది….

అత్యధిక ప్రజాదరణ ఉన్న ఎన్టీఆర్ ను మరిపించడంతో పాటు ముఖ్యమంత్రిగా తన పేరు, ఫోటో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళడం కోసం అప్పట్లో ఎన్నడూ లేనంత విస్తృత ప్రచారం ఓ రెండేళ్ళపాటు జరిగింది. ఈ ప్రచార ఖర్చు మొత్తం ప్రభుత్వానిదే. ఆ తర్వాత ఆ ఉధృతి తగ్గింది. కొన్ని మీడియా సంస్థలు ఆయనకు అనుకూలంగా మారడంతో ప్రకటనల ఖర్చు తగ్గింది. ఈ రెండు సందర్భాలు మినహా ఇతర నేతలెవరూ ఇంత పెద్ద ఎత్తున ప్రచారంపై ఖర్చు చేసిన సందర్భాలు లేవు.

 

-గోపిదారా, సీనియర్ జర్నలిస్ట్

Tags:    

Similar News