నెల్లూరులో పల్లెలకూ పాకుతోందే?

నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా, నెల్లూరు లో అధిక సంఖ్యలో కేేసులు నమోదవుతుండటం ఆందోళన [more]

Update: 2020-06-18 09:30 GMT

నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నా, నెల్లూరు లో అధిక సంఖ్యలో కేేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం 441 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొన్న ఒక్కరోజే 36 కేసులు నమోదవ్వడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నెల్లూరులో గ్రామీణ ప్రాంతాలకు కూడా కరోనా వైరస్ విస్తరిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది.

మర్కజ్ మసీదు ప్రార్థనల తర్వాత…..

నెల్లూరు జిల్లాలో తొలి కేసు నమోదయింది. అప్పట్లో ఇది సంచలనం కల్గించింది. ఇక మర్కజ్ మసీద్ ప్రార్థనల తర్వాత నెల్లూరులో కేసుల సంఖ్య పెరిగిందనే చెప్పాలి. జిల్లా నుంచి ఎక్కువ మంది మర్కజ్ మసీదు కు వెళ్లి వచ్చినట్లు గుర్తించి వారందరినీ క్వారంటైన్ కు తరలించి అధికారులు చికిత్స చేయించారు. అయితే ఎక్కువగా నెల్లూరు పట్టణంలోనే కరోనా వైరస్ ఎక్కువగా సంభవించింది. పల్లెలకు పెద్దగా ఈ వైరస్ సోకలేదు.

కోయంబేడు మార్కెట్ నుంచి…..

ఇక ఆ తర్వాత కోయంబేడు మార్కెట్ నెల్లూరును కదిలించింది. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు నిత్యం కూరగాయలు, పండ్లు నెల్లూరు నుంచి తీసుకెళుతుంటారు. తీసుకొస్తుంటారు. దీంతో కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారి నుంచి కరనా వైరస్ వ్యాధి సోకింది. వీరి సంఖ్య వంద వరకూ ఉంటుందంటున్నారు. కోయంబేడు మార్కెట్ కు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి చికిత్స అందించేసరికి అధికారుల తల ప్రాణం తోకకు వచ్చింది.

పల్లెలకూ పాకుతున్న…..

ఇప్పటి వరకూ నగరానికే పరిమితమైన కరోనా వైరస్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ప్రస్తుతం రోజుకు పది నుంచి పదిహేను మంది వరకూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇవి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినవి కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. వింజమూరు మండలంలోని నలగండ్ల, ఆత్మకూరు మండలంలోని ఆరవీడు, బుచ్చిరెడ్డి పాలెం, ఏఎస్ పేట మండలం పొనుగోడు, కావలిదిగవల్లి, కోటమిట్ట, శెట్టిగుంటరోడ్డు, వెంకన్న పాలెం, ఇనమడుగు, లేగుంటపాడు ప్రాంతాల్లో కరోనా వ్యాధి సోకింది. పట్టణ ప్రాంతాల నుంచి కరోనా పల్లెలకు సోకుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News