కరోనా వైరస్ వ్యాప్తికి నేతలే కారణమా …?

కరోనా వైరస్ విజృంభిస్తుంది. అదే రీతిలో రాజకీయ పార్టీలు విజృంభిస్తున్నాయి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. వీరు చేసే విన్యాసాలకు వైరస్ రక్కసి కరాళ నృత్యం [more]

Update: 2020-06-30 09:30 GMT

కరోనా వైరస్ విజృంభిస్తుంది. అదే రీతిలో రాజకీయ పార్టీలు విజృంభిస్తున్నాయి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. వీరు చేసే విన్యాసాలకు వైరస్ రక్కసి కరాళ నృత్యం చేస్తుంది. పదిమందికి చెప్పాలిసిన నేతలు మాస్క్ లు ధరించడం లేదు. భౌతిక దూరం పాటించారు. ఎలాంటి శుభ్రపరిచే సబ్బులు, నీరు ఉండనే ఉండవు. ఇక కార్యక్రమాల జోరు ఏ స్థాయిలో ఉంటుంది అంటే సాధారణ రోజుల్లో కన్నా అంతా ఒకరిపై మరొకరు పడిపోతున్నారు. ఫోటోలు, వీడియో లకు సెల్ఫీ లకు ఎగబడిపోతున్నారు.

టి హోం మంత్రి తీరే గమనిస్తే …

తెలంగాణ హోం మంత్రి మహమూద్ ఆలీ కి కరోనా సోకింది. దీనికి ఆయన స్వయం కృతం కనిపిస్తుందనే విమర్శలు సోషల్ మీడియా లో వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ మాత్రమే కాదు తెలంగాణ లో కాంగ్రెస్ నేతలు, బిజెపి నేతలు ప్రజా ఉద్యమాలు చేసేవారు అదే ధోరణి లో సాగుతున్నారు. వారే కాదు ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార వైసిపి కానీ ప్రతిపక్ష టిడిపి నేతలు చేసే కార్యక్రమాల్లో కూడా కరోనా మాకు సోకదు అనే రీతిలోనే సాగుతున్నారు. ఎవరైనా నేతలకు వైరస్ సోకితే డ్రైవర్లు, గన్ మ్యాన్లు వ్యక్తిగత సంరక్షకులకు ముందు టెస్ట్ లు చేయిస్తున్నారు. వారి వల్లే తమకు సోకుతుందని విఐపిలు భావిస్తున్నారు కానీ తాము ప్రజల్లో తిరుగుతున్న తీరు భౌతిక దూరం పాటించకపోవడం లేదన్నది ఒప్పుకోవడం లేదు.

అప్పుడు సేవల పేరుతో …

లాక్ డౌన్ కఠినంగా అమలు అయినప్పుడు పేదలకు సాయం అందించేందుకు పోటీలు పడి నాయకులు సేవలు అందించేవారు. అయితే నాడు వైరస్ వ్యాప్తి సమాజంలో పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదాలే తప్పాయి. ఇప్పుడు సేవలు అందించే పని లేదు. అన్ని పార్టీలు తమ కార్యకలాపాల వేగం పెంచాయి. అంతే వేగంగా కరనా వైరస్ వ్యాప్తి సాగుతుంది. దీన్నిఏ రాజకీయపార్టీ గుర్తించడం లేదు. ప్రజలను పదేపదే హెచ్చరించే నాయకులే విచ్చలవిడితనానికి తెరతీస్తే ఇక సామాన్యులకు వీరు చెప్పేదేముంది.

Tags:    

Similar News