హాట్ స్పాట్ గా నరసరావుపేట.. పూర్తిగా షట్ డౌన్

నరసరావుపేటను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లా అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో ఉంటే, నమోదయిన కేసుల్లో ఎక్కువ నరసరావుపేటలో ఉన్నాయి. ప్రతి రోజూ గుంటూరు [more]

Update: 2020-05-05 09:30 GMT

నరసరావుపేటను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లా అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో ఉంటే, నమోదయిన కేసుల్లో ఎక్కువ నరసరావుపేటలో ఉన్నాయి. ప్రతి రోజూ గుంటూరు జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం నరసరావుపేట కు చెందినవే. దీంతో అధికారులు నరసరావుపేటను పూర్తిగా లాక్ డౌన్ చేయాలని నిర్ణయించారు. మూడు రోజుల పాటు నరసరావుపేటను అధికారులు అష‌్టదిగ్బంధనం చేయనున్నారు.

సగం పేటలోనే…

గుంటూరు జిల్లాలో మూడు వందల యభైకి పైగా కేసులు నమోదయితే ఇక్క నరసరావుపేటలోనే 150 కేసులు వెలుగు చూడటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నరసరావుపేట పూర్తిగా రెడ్ జోన్ కింద ప్రకటించారు. దీంతో నరసరావుపేట రాష్ట్రంలోనే కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయింది. ఇక్కడ కరోనా వ్యాప్తికి కారణమని భావించి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన స్థానంలో కొత్త కమిషనర్ ను నియమించింది.

కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ ….?

అయినా కేసులు ఆగడం లేదు. మర్కజ్ మసీదు ప్రార్థనల నుంచి వచ్చిన వారితో తొలి కేసు నమోదయినప్పటికీ ఆ తర్వాత వేగంగా వైరస్ వ్యాప్తి చెందుతుండటంపై అధికారుల్లో భయం మొదలయిది. నరసరావుపేటలో కమ్యునిటీ ట్రాన్స్ మిషన్ జరిగిందేమో అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. దీంతో నరసరావుపేటలో అత్యధిక పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సమాయత్తమయింది. దాదాపు నెల రోజుల నుంచి నరసరావుపేటలో వైరస్ ఆగడం లేదు.

అందరికీ ఆరోగ్య పరీక్షలు….

దీంతో ప్రభుత్వం మరోసారి నరసరావుపేటలో ఇంటింటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని యోచిస్తుంది. వైరస్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాకపోవడంతో తొలుత ర్యాండమ్ గా పరీక్షలు జరిపి వైరస్ ను కొంత కట్టడి చేయాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. నిత్యావసరవస్తువులను మూడు రోజుల పాటు ఇళ్లకే చేర్చేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మే 15వ తేదీకల్లా నరసరావుపేటలో కరోనాను కంట్రోల్ చేయాలన్న కృతనిశ్చయంతో అధికారులు ఉన్నారు.

Tags:    

Similar News