మార్చి లో మళ్లీ తిరగబెట్టిందా?

గత ఏడాది మార్చిలో ప్రారంభమయిన కరోనా వైరస్ మళ్ల ీ ఏడాదికి తిరగబెట్టడం ప్రారంభించింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ [more]

Update: 2021-04-02 18:29 GMT

గత ఏడాది మార్చిలో ప్రారంభమయిన కరోనా వైరస్ మళ్ల ీ ఏడాదికి తిరగబెట్టడం ప్రారంభించింది. దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చినప్పటికీ కరోనా వైరస్ పెరుగుతుండటం ప్రభుత్వాల్లో ఆందోళన కల్గిస్తుంది. కరోనా వైరస్ కు ఆర్థికంగా దెబ్బతిని ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా వైరస్ జడలు విప్పే ప్రమాదముందన్న ఆందోళన వైద్య వర్గాల్లో వ్యక్తమవుతుంది.

సెకండ్ వేవ్ స్టార్టయినట్లే….

భారత్ లో కరోనా వైరస్ రెండో దశ ప్రారంభమయనట్లే. ప్రధానంగా తొమ్మిది రాష్ట్రాల్లో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అప్రమత్తమయినప్పటీకి ఇతర రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ విస్తరించే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

ఇతర రాష్ట్రాలకూ….

లాక్ డౌన్ మినహాయింపులతో ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు రవాణా సౌకర్యాలు పునరుద్ధరించారు. జన జీవనం సాధారణమయిపోయింది. కరోనా తగ్గు ముఖం పట్టడంతో అనేక రాష్ట్రాల్లో కోవిడ్ ఆసుపత్రులను కూడా ఎత్తివేశారు. వాటి బెడ్ల సంఖ్యను కూడా తగ్గించారు. కానీ భారత్ లో గత కొద్ది రోజులు గా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తుంది. రోజుకు నలభై వేలకు పైగా కేసులు, మూడు వందలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి.

లాక్ డౌన్ తప్పదా?

కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతుండటంతో ఆ యా రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచుతున్నాయి. కరోనా టెస్ట్ ల సంఖ్యను కూడా పెంచాయి. కొన్ని రాష్ట్రాలు నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర వంటి చోట్ల రాత్రి వేళ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ స్టార్టయిందన్న వైద్యుల హెచ్చరికతో మరోసారి దీనిపై యుద్ధం చేయాల్సి రావచ్చు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే లాక్ డౌన్ దిశగా ఆలోచన చేస్తున్నాయి. మొత్తం మీద కరోనా వైరస్ మార్చిలో మళ్లీ తిరగబెట్టిందనే చెప్పాలి.

Tags:    

Similar News