ఖాన్ భయ్యా… ఇవి నీ రోజులే

భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఊపేస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రల్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు [more]

Update: 2021-05-08 18:29 GMT

భారత్ లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఊపేస్తుంది. రోజుకు మూడు లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ఆసుపత్రల్లో బెడ్స్ కొరత, ఆక్సిజన్ కొరతతో తీవ్ర ఇబ్బందులు తలెత్తతున్నాయి. కానీ పొరుగున ఉన్న పాకిస్థాన్ మాత్రం బిందాస్ గా ఉంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పాకిస్థాన్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. దీనికి కారణాలేంటి? ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలేనా? లేక ప్రజలే స్వీయ నియంత్రణను పాటించడం వల్ల ఇది సాధ్యమయిందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

వెనకబడిన దేశమైనా….

నిజానికి భారత్ కంటే పాకిస్థాన్ వెనకబడిన దేశం. మత విశ్వాసాలు ఎక్కువగా ఉండటం, పేదరికంతో అక్కడ భౌతిక దూరం పాటించే అవకాశాలు తక్కువే. పాకిస్థాన్ తొలి దశలో కరోనా విజృంభించింది. ఇమ్రాన్ ఖాన్ నిర్లక్ష్యం వహించడం వల్లనే తొలిదశలో కేసుల సంఖ్య పెరిగిందన్న విమర్శ సర్వత్రా విన్పించింది. చైనా సాయంతో పాకిస్థాన్ తొలిదశ కరోనా వైరస్ నుంచి బయటపడగలిగిందంటారు.

తొలిదశలో…

తొలిదశలో కరోనా సమయంలో ఇమ్రాన్ ఖాన్ లాక్ డౌన్ కూడా ప్రకటించలేదు. పంజాబ్, సింధు ప్రావిన్స్ లలో ఎక్కువగా అప్పట్లో కరోనా కేసులు నమోదయ్యాయి. పరీక్షల సంఖ్య కూడా తక్కువగా ఉంది. రోజురోజుకూ కేసులు పెరుగుతుండటం, మరణాల సంఖ్య కూడా ఎక్కువవుతుండటంతో ఇమ్రాన్ ఖాన్ కఠిన ఆంక్షలు విధించారు. దీంతో పాకిస్థాన్ కొంత వరకూ తక్కువ సమయంలోనే బయటపడింది.

సానుభూతి చూపుతున్నారు….

ఇక సెకండ్ వేవ్ లో పాకిస్థాన్ కు పెద్దగా ప్రమాదమేమీ లేదు. అతి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. ప్రజలను ఇమ్రాన్ ఖాన్ చైతన్యవంతుల్ని చేశారంటారు. వైద్య సౌకర్యాలు అతి తక్కువగా ఉన్నాయని భావించిన ప్రజలే స్వచ్ఛందంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే కేసులు పెరగడం లేదని చెబుతున్నారు. పేద దేశమైన పాకిస్థాన్ ఇప్పుడు భారత్ కు అండగా నిలుస్తామని చెబుతుంది. ఎలాంటి సాయమైనా చేస్తామని అంటోంది. భారత్ త్వరగా కోలుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ప్రార్థిస్తుండటం ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారింది. భారత్ కు ఎంత దురవస్థ పట్టిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News