వామ్మో హైదరాబాద్… ఇక ఆగేట్లు లేవే?

హైదరాబాద్ ను కరోనా వణికిస్తుంది. మొన్నటి వరకూ పెద్దగా కన్పించని కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపులు హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. హైదరాబాద్ లోనే [more]

Update: 2020-06-15 17:30 GMT

హైదరాబాద్ ను కరోనా వణికిస్తుంది. మొన్నటి వరకూ పెద్దగా కన్పించని కరోనా వైరస్ లాక్ డౌన్ మినహాయింపులు హైదరాబాద్ లో డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. హైదరాబాద్ లోనే దాదాపు రెండువేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పూర్తిగా లాక్ డౌన్ ను మినహాయింపులు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరుగుతోందంటున్నారు. లాక్ డౌన్ మినహాయింపులతో హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ ఇదివరికటిలాగానే ఉంది.

వందల కేసులు రోజుకు….

ఇప్పుడు రోజుకు హైదరాబాద్ లో రోజుకు వంద కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లోనే వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇది ఆందోళన కల్గించే అంశమే. నిజానికి హైదరాబాద్ జనసాంద్రత కలిగిన ప్రాంతం. నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ లో కరోనా కట్టడి అసాధ్యమే అని ప్రభుత్వానికి తెలియంది కాదు. ప్రధానంగా కంటెయిన్ మెంట్ జోన్లను కొన్ని ప్రాంతాల్లో తొలుత గుర్తించారు.

కంటెయిన్ మెంట్ జోన్లు….

చివరకు కంటెయిన్ మెంట్ జోన్లను కూడా కుదించారు. గతంలో కరోనా వ్యాధి సోకితే ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కంటెయిన్ మెంట్ జోన్ గా గుర్తించేవారు. ఇప్పుడు తాజా నిబంధనలతో కరోనా సోకిన ఇంటికే కంటెయిన్ మెంట్ జోన్ గా గుర్తిస్తున్నారు. ఇది కూడా కరోనా వ్యాప్తికి కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైదరాబాద్ లో మురికివాడలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. వీటిలో కరోనా వ్యాప్తి ప్రారంభమయితే ఇక ఆపడం ఎవరి వల్లా కాదన్న హెచ్చరికలు ఉన్నాయి.

భవిష్యత్తులో మరింతగా…..

హైదరాబాద్ లో ఇప్పటికే అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. రెడ్ జోన్ల మాటే వినపడటం లేదు. పైగా కరోనా టెస్ట్ ల సంఖ్య కూడా తక్కువగా జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో హైదరాబాద్ కరోనా కేంద్రంగా మారే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ అంటేనే వణుకుపుడుతుంది. మరోవైపు ప్రజలు కూడా కరోనాను లెక్క చేయకుండా బయటకు వస్తుండటం మరింత ఆందోళన కల్గిస్తుంది.

Tags:    

Similar News