వైరస్ వదిలేటట్లు లేదు.. పల్లెలకూ పాకింది

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా మరణాలు కూడా ఎక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. తమిళనాడు అంటేనే ఇతర రాష్ట్రాలకు [more]

Update: 2020-08-14 18:29 GMT

తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా మరణాలు కూడా ఎక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. తమిళనాడు అంటేనే ఇతర రాష్ట్రాలకు భయం పట్టుకుంది. తమిళనాడులో కరోనా కంట్రోల్ కాకపోవడానికి పాలకులు, ప్రజల నిర్లక్ష్యమేనని అంటున్నారు. లాక్ డౌన్ నిబంధనలున సయితం ప్రజలు ఉల్లంఘిస్తున్నారని, కమ్యునిటీ స్ప్రెడ్ అయందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసుల సంఖ్య రోజురోజుకూ….

నిన్న మొన్నటి వరకూ కరోనా వైరస్ మహారాష్ట్రను కుదిపేసింది. అక్కడ కేసుల సంఖ్య కొంత తగ్గుముఖ పడుతున్నాయి. పూనే, థానే వంటి నగరాల్లో కొంత వైరస్ సమస్య ఉన్నప్పటికీ మహారాష్ట్రలో కేసుల సంఖ్య కొంత తగ్గింది. అయితే తమిళనాడులో మాత్రం కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా పరీక్షలు ఎక్కవగా చేస్తున్నందుకు కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ప్రతి పల్లెకూ వైరస్ వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కల్గిస్తుంది.

మూడు లక్షలు దాటేసి…..

ప్రస్తుతం తమిళనాడులో మూడు లక్షల కరోనా పాజిటివ్ కేసులు దాటేశాయి. మరణాల సంఖ్య కూడా ఐదు వేలు దాటేసింది. ఇప్పటి వరకూ తమిళనాడులో 33 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రికవరీ శాతం కొంత బాగానే ఉంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 2.50 లక్షల మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రోజుకు ఆరు వేల కేసులు నమోదవతుండటంతో ప్రజల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.

చెన్నై నగరం లాక్…..

మరోవైపు తమిళనాడు రాజధాని చెన్నైలో సయితం కేసులు ఆగడం లేదు. ఇప్పటికే చెన్నై నగరం సగం ఖాళీ అయింది.వైరస్ కు భయపడి చాలా మంది ఉద్యోగులు, వలస కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లిపోయారు. చెన్నై నగరంలోనే దాదాపు లక్షా ఇరవై కేసులు నమోదవ్వడం వైరస్ వ్యాప్తి తీవ్రతకు అద్దం పడుతుంది. ప్రతి రోజూ వెయ్యికి తక్కువ కేసులు నమోదవుతున్నాయి. కంటెయిన్మెంట్ జోన్ల ఏర్పాటు, లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు పరుస్తున్నా కేసుల సంఖ్య మాత్రం ఆగడం లేదు. మొత్తం మీద తమిళనాడు కరోనా వైరస్ తో తల్లడిల్లిపోతోంది.

Tags:    

Similar News