డేంజర్ బెల్స్… మళ్లీ లాక్ డౌన్ తప్పదా?

కరోనా తగ్గిపోయిందనుకున్నాం. వైరస్ వీడిందని భావించాం. వ్యాక్సిన్ వచ్చింది కదా? అని సంబరపడ్డాం. కానీ అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ తిరగబెడుతుంది. లాక్ డౌన్ మినహాయింపులు, [more]

Update: 2021-03-03 18:29 GMT

కరోనా తగ్గిపోయిందనుకున్నాం. వైరస్ వీడిందని భావించాం. వ్యాక్సిన్ వచ్చింది కదా? అని సంబరపడ్డాం. కానీ అనేక రాష్ట్రాల్లో కరోనా వైరస్ మళ్లీ తిరగబెడుతుంది. లాక్ డౌన్ మినహాయింపులు, తిరిగి సాధారణ జీవనం ప్రారంభం కావడంతో కరోనా వైరస్ మళ్లీ పెరిగిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసులను చూస్తుంటే మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నట్లే కన్పిస్తుంది. ఇప్పటికే కొన్ని దేశాలు తిరిగి లాక్ డౌన్ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

తగ్గుతుందని భావిస్తున్న…..

భారత్ లో కరోనా తగ్గిందని అందరూ భావించారు. గత కొద్ది రోజులుగా మళ్లీ కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. నిబంధనలను ప్రజలు సక్రమంగా పాటించకపోవడం వల్లనే వ్యాధి తీవ్రత పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మాస్క్ లు ధరించకపోవడం, శానిటైజర్లు వినియోగించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయంటున్నారు.

ఐదు రాష్ట్రాల్లో…..

దేశంలో ఇప్పటికే కరోనా వైరస్ కేసుల సంఖ్య కోటి ఇరవై లక్షలకు చేరుకుంది. ప్రధానంగా ఐదు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. మహరాష్ట్ర, కేరళ, ఛత్తీస్ ఘడ్, పంజాబ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో అయితే రోజుకు ఐదు వేల కేసులకు పైగానే నమోదవుతుండటంతో మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రజల సహకారం లేకపోతే?

అలాగే పంజాబ్, కేరళలో కూడా కేసుల సంఖ్య అధికంగానే ఉంది. కేరళలో ఒక్కసారిగా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈ ఐదు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టనుంది. ఇప్పటికే ఆ యా రాష్ట్రాలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజల నుంచి సహకారం లేకపోవడం వల్లనే కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాగే కంటిన్యూ అయితే మరోసారి కరోనా వైరస్ భారత్ ను చుట్టుముట్టే అవకాశముందంటున్నారు.

Tags:    

Similar News