వాటిని తెరిస్తే ….గేట్లు ఓపెన్ చేసినట్లేనా?

భారత్ లో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని కార్యక్రమాలు యధావిధిగా నడుస్తున్నాయి. సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, [more]

Update: 2020-09-30 18:29 GMT

భారత్ లో కరోనా వైరస్ ఏమాత్రం తగ్గడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే దాదాపు అన్ని కార్యక్రమాలు యధావిధిగా నడుస్తున్నాయి. సినిమాహాళ్లు, విద్యాసంస్థలు, బార్ల విషయంలో ప్రభుత్వం కొంత వెనుకంజ వేస్తుంది. సామూహిక వ్యాప్తికి ఇవి కారణమవుతాయని భావించిన అన్ లాక్ 4.0లో కూడా ప్రభుత్వం వీటిపై నిషేధాన్ని తొలగించలేదు. అయితే వచ్చే నెల నుంచి పాఠశాలలను, కళాశాలలను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తల్లిదండ్రుల్లో ఆందోళన…..

ఇది కొంత మేర తల్లిదండ్రుల్లో ఆందోళన కల్గిస్తుంది. ప్రభుత్వం ఆన్ లైన్ పాఠాలవైపే మొగ్గు చూపుతున్నప్పటికీ కొన్ని తరగతులను పాఠశాలల్లోనే నిర్వహించాలన్న నిర్ణయానికి రావడం కలవరపాటుకు గురి చేస్తుంది. అక్టోబరు 5వ తేదీ నుంచి విద్యాసంస్థలను దేశ వ్యాప్తంగా ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.

మార్గదర్శకాలు ఉన్నా…..

పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు, తరగతుల నిర్వహణకు కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. దాదాపు ఆరు నెలల నుంచి స్కూళ్లు మూతబడటంతో ఈ విద్యాసంవత్సరం ప్రారంభమవుతుందా? లేదా? అన్న అయోమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే పాఠశాలలు ప్రారంభమయినా తమ పిల్లలను పంపేందుకు ఎంతమంది మొగ్గు చూపుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది. కోవిడ్ నిబంధనల ప్రకారం పాఠశాలలను నిర్వహించాలని కేంద్రం చెబుతున్నా అది ఎంతవరకూ సాధ్యమవుతుందన్నది సందేహమే.

కరోనా భయంతో……

ఇప్పటికే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు యాభై లక్షలు దాటి అరవై లక్షలకు చేరువలో ఉన్నాయి. దీంతో విద్యాసంస్థలు ప్రారంభమయినా అడ్మిషన్లు ఎంత వరకు జరుగుతాయన్నది అనుమానమే. తల్లిదండ్రులు తమ పిల్లల క్షేమానికి ప్రధమ ప్రాధాన్యత ఇస్తారు తప్పించి పాఠశాలలకు పంపకపోవచ్చన్న అనుమానం కూడా ప్రభుత్వాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రం విద్యాసంస్థల ప్రారంభానికి నిబంధనలను విధిస్తూనే రాష్ట్రాలకు నిర్ణయించే అధికారాన్ని ఇచ్చింది. మొత్తం మీద వచ్చే నెల నుంచి ప్రారంభంకానున్న పాఠశాలలు కరోనా వ్యాప్తికి కారణమవుతాయన్న అనుమానాలూ లేకపోలేదు.

Tags:    

Similar News