ప్రశాంతంగా ఉన్న సమయంలో కుదుపు?

తొలినాళ్లలో ఒడిశా కరోనా విషయంలో కంట్రోల్ లోనే ఉంది. రోజుకు రెండు నుంచి ఐదు కేసులకు మించలేదు. కరోనా దేశ మంతటా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న దశలోనూ [more]

Update: 2020-06-19 16:30 GMT

తొలినాళ్లలో ఒడిశా కరోనా విషయంలో కంట్రోల్ లోనే ఉంది. రోజుకు రెండు నుంచి ఐదు కేసులకు మించలేదు. కరోనా దేశ మంతటా ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న దశలోనూ ఒడిశాలోనూ డెబ్భయికి మించి కేసులు నమోదు కాలేదు. దీంతో ఒడిశాలో కరోనా నియంత్రణ చర్యలను కట్టుదిట్టంగా అమలు చేశారని అంతా అనుకున్నారు. నిజమే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లాక్ డౌన్ నిబంధనలను కఠినతరంగా అమలు చేశారన్నది వాస్తవం.

నాలుగు వేల మందికి పైగా….

కట్ చేస్తే… ఇప్పుడు ఒడిశాలో నాలుగు వేల మందికి పైగా కరోనా సోకడం ఆందోళన కల్గిస్తుంది. కరోనా పరీక్షలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ 2.10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు వందకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నతాధికారులతో సమీక్షలు జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

వలస కార్మికుల వల్లనే…..

నిజానికి లాక్ డౌన్ విధించిన తర్వాత ఒడిశాలో కరోనా వైరస్ పూర్తిగా కంట్రోల్ లోనే ఉంది. ఎప్పుడైతే వలస కార్మికులు రాష్ట్రానికి చేరుకున్నారో వారి నుంచి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. దాదాపు ఐదు లక్షల మంది వలస కార్మికులు ఒడిశాకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలలోనే కేసుల సంఖ్య ఎక్కువగా పెరగడం వలస కార్మికుల వల్లనేనని అంటున్నారు. గంజాం జిల్లాలో అత్యథికంగా కేసులు నమోదు అవ్వడమే కాకుండా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అందుకే ఈ జిల్లాలో మధ్యాహ్నం 12 నుంచి ఉదయం 7గంటల వరకూ లాక్ డౌన్ విధించారు.

ఇంటింటి సర్వే……

దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలను నవీన్ పట్నాయక్ తీసుకున్నారు. ఇందుకోసం కార్యాచరణను నవీన్ పట్నాయక్ ప్రకటించారు. 45రోజుల పాటు ఇంటింటి సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకూ ఇంటింటికి తిరిగి సర్వే చేయడంతో పాటు పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. పరీక్షల్లో పాజిటివ్ గా తేలితే వెంటనే క్వారంటైన్ కు తరలించాలని నిర్ణయించారు. మొత్తం మీద మొన్నటి వరకూ కరోనా విషయంలో పెద్దగా ప్రమాదం లేకున్నా ఇప్పడు మాత్రం ఒడిశాను భయపెడుతోంది.

Tags:    

Similar News